తెలుగు న్యూస్  /  బిజినెస్  /  సింగిల్​ ఛార్జ్​తో 160 కి.మీ రేంజ్​- స్టైల్​తో పాటు బెస్ట్​ లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ బైక్​ ఇది..

సింగిల్​ ఛార్జ్​తో 160 కి.మీ రేంజ్​- స్టైల్​తో పాటు బెస్ట్​ లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ బైక్​ ఇది..

Sharath Chitturi HT Telugu

Published Jun 22, 2025 05:48 AM IST

google News
  • కొత్తగా ఒక మంచి ఎలక్ట్రిక్​ బైక్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! సింగిల్​ ఛార్జ్​తో 160 కి.మీ వరకు రేంజ్​ని ఇచ్చే రివల్ట్​ ఆర్​వీ1+ ఎలక్ట్రిక్​ బైక్​ ఫీచర్స్​, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..
ఆర్​వీ1+ ఎలక్ట్రిక్​ బైక్​..

ఆర్​వీ1+ ఎలక్ట్రిక్​ బైక్​..

ఇండియా ఆటోమొబైల్​ సెగ్మెంట్​లో ఎలక్ట్రిక్​ స్కూటర్లే కాదు ఎలక్ట్రిక్​ బైక్​ ఆప్షన్స్​ కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇవి యువతతో పాటు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈలాంటి వాటిల్లో ఒకటి రివోల్ట్​కి చెందిన ఆర్​వీ1+ ఎలక్ట్రిక్​ బైక్​! ఈ మోడల్​కి మంచి డిమాండ్​ కూడా కనిపిస్తోంది. స్టైల్​తో పాటు లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ బైక్​ కొనాలని ప్లాన్​ చేస్తున్న వారికి ఇది మంచి ఆప్షన్​ అవుతుంది. నగరాల్లో ప్రయాణానికి ఈ మోడల్​ సూట్​ అయ్యే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..


రివోల్ట్​ ఆర్​వీ1+ ఎలక్ట్రిక్​ బైక్​ : బ్యాటరీ- రేంజ్​..

ఈ రివోల్ట్​ ఆర్​వీ1+ ఎలక్ట్రిక్​ బైక్​ 3.24 కేడబ్ల్యూహెచ్​ లిథియం ఐయాన్​ బ్యాటరీ ప్యాక్​ ఉంది. దీనిని 0 నుంచి 80శాతం వరకు సాధారణ ఛార్జర్​తో ఛార్జ్​​ చేయడానికి 3 గంటల 30 నిమిషాల సమయం పడుతుందని సంస్థ చెప్పింది. కాగా ఫాస్ట్​ ఛార్జింగ్​తో 0 నుంచి 80శాతం ఛార్జ్​ చేసేందుకు కేవలం 1 గంట 20 నిమిషాల సమయం పడుతుందని స్పష్టం చేసింది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ఈకో మోడ్​లో 160 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుందని రివోల్ట్​ పేర్కొంది.

రివోల్ట్​ ఆర్​వీ1+ పై 5ఏళ్లు లేదా 75వేల కిలోమీటర్ల వరకు ఎక్స్​టెండెడ్​ ప్రాడక్ట్​ వారెంటీని సంస్థ అందిస్తోంది. అదే సమయంలో బ్యాటరీపై కూడా 5ఏళ్లు లేదా 75వేల కిలోమీటర్ల వరకు ఎక్స్​టెండెడ్​ వారెంటీని ఇస్తోంది. ఛార్జర్​పై 2ఏళ్ల వారంటీ లభిస్తోంది.

రివోల్ట్​ ఆర్​వీ1+ ఎలక్ట్రిక్​ బైక్​ : స్పెసిఫికేషన్లు..

సింగిల్​ ఛార్జ్​తో 160 కి.మీ రేంజ్​ ఇచ్చే ఈ ఎలక్ట్రిక్​ బైక్​లో 4 డ్యూయెల్​ టోన్​ కలర్​ ఆప్షన్స్​ ఉన్నాయి. అవి.. బ్లాక్​ మిడ్​నైట్​ బ్లూ, బ్లాక్​ నియాన్​ గ్రీన్​, కాస్మిక్​ బ్లాక్​ రెడ్​, టైటాన్​ రెడ్​ సిల్వర్​. ఈ ఈ-బైక్​ గ్రౌండ్​ క్లియరెన్స్​ 180ఎంఎం. ఇది గరిష్ఠంగా 250 కేజీల బరువును మోయగలదు. సీట్​ హైట్​ 790ఎంఎం. వీల్​బేస్​ 1350ఎంఎంగా ఉంది. ఈ బైక్​ కెర్బ్​ వెయిట్​ 110కేజీలు.

ఇందులో 2.8 కేడబ్ల్యూ మోటార్​ ఉంటుంది. ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో ట్విన్​ షాక్​ అబ్సార్బర్లు సస్పెన్షన్స్​గా వస్తున్నాయి. ఇక బ్రేక్స్​ విషయానికొస్తే ఈ బైక్​లో ఫ్రెంట్​ డిస్క్​, రేర్​ డిస్క్​ బ్రేక్​లు ఉన్నాయి. సీబీఎస్​ కూడా ఉంది.

రివోల్ట్​ ఆర్​వీ1+ ఎలక్ట్రిక్​ బైక్​ : ధర..

రివోల్ట్​ ఆర్​వీ1+ ఎలక్ట్రిక్​ బైక్​ ఎక్స్​షోరూం ధర రూ. 1,04,990 వద్ద ప్రారంభమవుతుంది. ఆన్​లైన్​లో లభించే అధికారిక వెబ్​సైట్​లో ఈ ఎలక్ట్రిక్​ బైక్​ని బుక్​ చేసుకోవచ్చు. టెస్ట్​ రైడ్​ కూడా బుక్​ చేసుకోవచ్చు. లేదా సమీప డీలర్​షిప్​షోరూమ్​కి వెళ్లి ఈ మోడల్​ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.