iQOO 12 5G price : ఐకూ 12 సేల్స్ షురూ.. ధర, ఫీచర్స్ ఇవే!
15 December 2023, 6:49 IST
- iQOO 12 5G price : ఐకూ 12 5జీ ఇటీవలే ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ మోడల్ సేల్స్ ప్రారంభమయ్యాయి. పలు ఎగ్జైటింగ్ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఆ వివరాలు..
ఐకూ 12 సేల్స్ షురూ.. ధర, ఫీచర్స్ ఇవే!
iQOO 12 5G price : ఇండియాలో ఐకూ 12 ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభమయ్యాయి. ఈ మోడల్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్‌తో పాటు ధరపై లభించే ఆఫర్స్‌కు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఐకూ 12 ఫీచర్స్..
ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.78 ఇంచ్ ఎల్టీఓ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. వెట్ టచ్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే.. డిస్ప్లే తడిగా ఉన్నా.. టచ్ కంట్రోల్స్ పనిచేస్తాయి. ఈ మోడల్ థిక్నెస్ 8.10ఎంఎం, బరువు 203.7గ్రాములు.
ఈ ఐకూ 12 గ్యాడ్జెట్లో 50ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ అల్ట్రా వైడ్, 64ఎంపీ పెరిస్కోపిక్ టెలిఫొటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.
iQOO 12 5G price in India : ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇండియాలో ఈ చిప్సెట్ ఉన్న తొలి గ్యాడ్జెట్ ఇదే. వన్‌ప్లస్ 12లో ఈ ప్రాసెసర్ ఉన్నా.. అది ఇంకా ఇండియాలో లాంచ్ అవ్వలేదు. ఇక ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50వాట్ వయర్లెస్ ఛార్జింగ్, 10వాట్ రివర్స్ వయర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ మొబైల్‌కి లభిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్టచ్ఓఎస్ 14 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది.
ఐకూ 12లో డ్యూయెల్ సిమ్, 5జీ, వైఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, గ్లోనాస్, నావ్ఐసీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది.
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర, ఆఫర్స్..
iQOO 12 5G features : అమెజాన్‌లో ఐకూ 12 12జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ ధర రూ. 52,999గా ఉంది. లెజెండ్ వైట్, అల్ఫా బ్లాక్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ఐకూ 12 16జబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్ ధర రూ. 57,999గా ఉంది.
టాప్ ఎండ్ మోడల్‌పై మంచి డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ/ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌తో రూ. 3వేల ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభించనుంది. రూ. 5వేలు విలువ చేసే ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంటుంది. అయితే ఇది పాత ఫోన్ పర్ఫార్మెన్స్పై ఆధారపడి ఉంటుంది. ఐకూలో రూ. 1000 విలువచేసే ఈ-స్టోర్ వోచర్ సైతం లభిస్తుంది. ఈ గ్యాడ్జెట్‌పై 6 నెలల ఎక్స్టెండెడ్ వారంటీని కూడా పొందొచ్చు.
iQOO 12 5G : ఈ లెక్కన చూసుకుంటే.. ఐకూ బేస్ వేరియంట్ కన్నా.. టాప్ వేరియంట్ ధరే తక్కువగా ఉంటుంది!