తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Skoda Kylaq : స్కోడా కొత్త ఎస్​యూవీకి క్రేజీ డిమాండ్​- హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Skoda Kylaq : స్కోడా కొత్త ఎస్​యూవీకి క్రేజీ డిమాండ్​- హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

14 December 2024, 11:45 IST

google News
    • Best SUV in India : ఇటీవలే లాంచ్​ అయిన స్కోడా కైలాక్​ ఎస్​యూవీని కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయిత హైదరాబాద్​లో స్కోడా కైలాక్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మీ బడ్జెట్​ ప్లాన్స్​కి ఈ డేటా ఉపయోగపడుతుంది.
హైదరాబాద్​లో స్కోడా కైలాక్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..
హైదరాబాద్​లో స్కోడా కైలాక్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు.. (Skoda )

హైదరాబాద్​లో స్కోడా కైలాక్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

భారత దేశ ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎస్​యూవీ సెగ్మెంట్​లో ఇటీవలే లాంచ్​ అయిన స్కోడా కైలాక్​ సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే 10,000కు పైగా బుకింగ్‌లను సాధించి సరికొత్త రికార్డును రాసింది. మరి ఈ ఎస్​యూవీని మీరు కూడా కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. హైదరాబాద్​లో స్కోడా కైలాక్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్​లో స్కోడా కైలాక్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

  • స్కోడా కైలాక్​ క్లాసిక్​- రూ. 9.35 లక్షలు
  • సిగ్నేచర్​- రూ. 11.35 లక్షలు
  • సిగ్నేచర్​ ఏటీ- రూ. 12.95 లక్షలు
  • సిగ్నేచర్​ ప్లస్​- రూ. 13.95 లక్షలు
  • సిగ్నేచర్​ ప్లస్​ ఏటీ- రూ. 15.15 లక్షలు
  • ప్రెస్టీజ్​- రూ. 16.30 లక్షలు
  • ప్రెస్టీజ్​ ఏటీ- రూ. 17.58 లక్షలు

అంటే హైదరాబాద్​లో స్కోడా కైలాక్​ ఎస్​యూవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ ధరలు రూ. 9.35లక్షలు- రూ. 17.58 లక్షల మధ్యలో ఉంటుంది. ఈ ఎస్​యూవీ వేరియంట్లన్నీ పెట్రోల్​ ఇంజిన్​తోనే వస్తాయి. డీజిల్​ ఇంజిన్​ని సంస్థ లాంచ్​ చేయలేదు.

సాధారణంగా వెహికల్​కి ఎక్స్​షోరూం ప్రైజ్​, ఆన్​రోడ్​ ప్రైజ్​లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్​ని లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు ఎక్స్​షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్​రోడ్​ ప్రైజ్​ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్​ని కొనే ముందు, ఎక్స్​షోరూం ప్రైజ్​ కాకుండా ఆన్​రోడ్​ ప్రైజ్​ తెలుసుకుని బడ్జెట్​ వేసుకోవాలి. 

మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​ని సందర్శిస్తే స్కోడా కైలాక్​ టెస్ట్​ డ్రైవ్​తో పాటు ఆఫర్స్​, డిస్కౌంట్స్​ వంటి వివరాలపైనా క్లారిటీ వస్తుంది. ఆ మేరకు మీరు మీ బడ్జెట్​ని ప్లాన్​ చేసుకోవచ్చు.

బుకింగ్స్​.. డెలివరీలు..

గత నెల లాంచ్​ అయిన స్కోడా కైలాక్ బుకింగ్స్ డిసెంబర్ 2న ప్రారంభమయ్యాయి. ఈ కాంపాక్ట్ ఎస్​యూవీ డెలివరీలు జనవరి 27 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. కాగా స్కోడా ఇండియా కైలాక్​ని ఇప్పటికే ను బుక్ చేసుకున్న మొదటి 33,333 కస్టమర్‌లకు పరిమిత ఆఫర్‌ను ప్రకటించింది దిగ్గజ ఆటోమొబైల్ ​సంస్థ. వారు కాంప్లిమెంటరీగా 3 సంవత్సరాల స్టాండర్డ్ మెయింటెనెన్స్ ప్యాకేజీని పొందుతారు. అలాగే ఈ కారు మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుందని స్కోడా హామీ ఇస్తోంది.

స్కోడా కైలాక్‌ లో 1.0-లీటర్ టీఎస్​ఐ ఇంజిన్ ఉంటుంది. ఇది 115 బీహెచ్​పీ పవర్​, 178 ఎన్ఎం టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది.

ఈ స్కోడా కైలాక్​ ఎస్​యూవీ కియా సోనెట్​, టాటా పంచ్​, హోండా ఎలివేట్​, హ్యుందాయ్​ క్రేటా వంటి మోడల్స్​కి గట్టిపోటీ ఇస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం