Investing tips : వారెన్ బఫెట్ చెప్పిన ఈ 6 ఇన్వెస్టింగ్ టిప్స్ తెలిస్తే సక్సెస్ మీదే!
04 August 2024, 7:19 IST
Warren Buffett investing tips : వారెన్ బఫెట్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్లో ఆయన ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవుతారు? ఆయన నుంచి నేర్చుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్
ఇన్వెస్ట్మెంట్స్ చేసే వారికి దిగ్గజ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ జీవితం ఒక ఇన్స్పిరేషన్. మరీ ముఖ్యంగా చాలా మంది బిగినర్స్, ఆయన జీవిత పాఠాలను తెలుసుకునేందుకు ఇష్టపడుతుంటారు. వాటిని తమ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్‌లో అప్లై చేసుకోవాలని భావిస్తుంటారు. అందుకే ఇన్వెస్ట్ చేయడంలో ప్రోగా మారాలంటే వారెన్ బఫెట్ కంటే మంచి వ్యక్తి దొరుకుతారా? ఆయన తన ప్రసంగాలు, ప్రసంగాల్లో పంచుకున్న కీలక పెట్టుబడి పాఠాలను ఇక్కడ మరింత లోతుగా పరిశీలిద్దాం.
వారెన్ బఫెట్ నుంచి నేర్చుకోవాల్సిన కీలక పెట్టుబడి పాఠాలు:
1. సరైన ధరకు కొనండి: ఫెయిర్ కంపెనీని వండర్ఫుల్ ప్రైజ్‌కి కొనడం కన్నా వండర్ఫుల్ కంపెనీని ఫెయిర్ ప్రైజ్‌కి కొనడం ముఖ్యం అని వారెన్ బఫెట్ అంటూ ఉంటారు.
అంటే దీర్ఘకాలంలో రాణించే అవకాశాలు తక్కువగా ఉన్న కంపెనీతో పోలిస్తే బలమైన పోటీతత్వం ఉన్న కంపెనీలో పెట్టుబడులు (సరసమైన ధరకు కొనుగోలు చేయడం) దీర్ఘకాలంలో మరింత ఫలప్రదంగా ఉంటాయి. యాపిల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, కోకాకోలా తదితర కంపెనీల్లో బఫెట్ పెట్టుబడులు పెట్టారు.
2. ధరలు తక్కువగా ఉన్నప్పుడు బల్క్‌గా కొనండి: వారెన్ బఫెట్ తక్కువ ధరల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి భారీగా క్యాష్‌ని చేతిలో ఉంచుకోవాలని నమ్ముతారు.
బెర్క్‌షైర్ హాత్వే నగదు నిల్వలు ఇప్పుడు 277 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బఫెట్ సంస్థ యాపిల్‌లో ఇటీవల తన వాటాను విక్రయించడానికి ముందు, ఇది 189 బిలియన్ డాలర్లుగా ఉండేది.
3. ఇన్వెస్ట్మెంట్ అంటే భావోద్వేగాలను మేనేజ్ చేయడం: ఇన్వెస్ట్మెంట్ అంటే భావోద్వేగాలను మేనేజ్ చేసుకోవడమే అని వారెన్ బఫెట్ తరచూ చెబుతుంటారు. ఎదుటివారు భయపడినప్పుడు అత్యాశ, ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు భయపడాలి అని ఆయన చెప్పేవారు.
ఒక్క మాటలో చెప్పాలంటే, బుల్ రన్లో ఉన్నప్పుడు కరెక్షన్ వస్తుందేమో అని భయపడొచ్చు. కానీ ఆ సమయంలో ఇతరులు అమ్ముతుంటే, మనం కొనుగోలు చేయాలి.
4. సరైన స్ట్రైక్ కోసం వేచి ఉండండి: ప్రతి రోజు, ప్రతిసారి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదని వారెన్ బఫెట్ చెబుతుంటారు. సరైన సమయం, సరైన ప్రైజ్ కోసం వేచి చూసి, అప్పుడు ఎంట్రీ ఇవ్వాలని అంటూ ఉంటారు.
5. ఇండెక్స్ ఫండ్స్ రిటైల్ ఇన్వెస్టర్లకు మంచి ఆప్షన్: చాలా మంది ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ల మాదిరిగా కాకుండా, వారెన్ బఫెట్ యూఎస్‌లో ఎస్ అండ్ పీ 500 (లేదా భారతదేశంలో నిఫ్టీ 50) వంటి ఇండెక్స్ ఫండ్లను ఎక్కువగా నమ్ముతారు. వీటిలో రిస్క్ తక్కువగా ఉంటుంది. రిటర్నులు మెరుగ్గా ఉంటాయి.
6. లాంగ్ హోల్డింగ్ పీరియడ్: ఎంట్రీ ఇచ్చిన స్టాక్‌ని దీర్ఘకాలంపాటు హోల్డ్ చేసి ఉంచాలని వారెన్ బఫెట్ నుమ్ముతారు. అప్పుడే వెల్త్ క్రియేషన్ జరుగుతుందని అంటూ ఉంటారు.
వాస్తవానికి ఆర్థిక సంక్షోభం సమయంలోనూ బఫెట్ తన పోర్ట్‌ఫోలియోకి కట్టుబడి ఉన్నారు. వాల్యూ స్టాక్స్‌ని ఎప్పుడూ పెద్దగా విక్రయించలేదు.