Budget 2024: 18 సంవత్సరాల లోపు పిల్లల కోసం ‘ఎన్పీఎస్ - వాత్సల్య’ స్కీమ్; దీని ప్రయోజనాలేంటి?
23 July 2024, 18:36 IST
భవిష్యత్తులో 18 సంవత్సరాల లోపు పిల్లల పెన్షన్ అవసరాలు తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో నేషనల్ పెన్షన్ స్కీమ్ - వాత్సల్య’ ను ప్రవేశపెట్టింది. ఈ ఎన్పీఎస్ వాత్సల్య, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ మైనర్ పిల్లల కోసం పెన్షన్ ప్లాన్ ను ప్రారంభించడానికి వీలు కల్పిస్తుంది.
18 సంవత్సరాల లోపు పిల్లల కోసం ఎన్పీఎస్ - వాత్సల్య
NPS Vatsalya: 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మైనర్ల కోసం నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) కింద ఎన్పిఎస్ వాత్సల్య అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల కోసం ఇప్పుడే ఎన్పీఎస్ - వాత్సల్య (NPS Vatsalya) అనే నేషనల్ పెన్షన్ స్కీమ్ లో చేరవచ్చు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తరువాత ఆ ఎన్పీఎస్ - వాత్సల్య ఆటోమేటిక్ గా రెగ్యులర్ ఎన్పీఎస్ గా మారుతుంది. తల్లిదండ్రులు, లేదా గార్డియన్లు అప్పటివరకు జమ చేసిన మొత్తం కూడా రెగ్యులర్ ఎన్పీఎస్ లోకి ట్రాన్స్ ఫర్ అవుతుంది.
పిల్లల దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం..
పిల్లలకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందించడానికే ఈ ఎన్పీఎస్ వాత్సల్యను ప్రారంభించామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. పిల్లలకు మెజారిటీ వయస్సు వచ్చాక, ఈ ప్రణాళికను నాన్ ఎన్పీఎస్ ప్లాన్ గా మార్చుకోవచ్చని వెల్లడించారు.
ఎన్పీఎస్ వాత్సల్య అంటే ఏమిటి?
పిల్లల భవిష్యత్తు ఆర్థిక భద్రతను నిర్ధారించడానికి ఒక క్రమబద్ధమైన విధానాన్ని ఈ ఎన్పీఎస్ వాత్సల్య (NPS Vatsalya) అందిస్తుంది. ఈ పథకంలో చేరడం ద్వారా, తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్ద వాళ్లయ్యే సమయానికి వారి ఆర్థిక అవసరాలకు గట్టి పునాది వేస్తుంది. ఈ కొత్త పథకం ఎన్పిఎస్ మాదిరిగానే పనిచేస్తుంది. ఇది పదవీ విరమణలో ఆర్థిక స్థిరత్వాన్ని పొందడానికి విలువైన సాధనంగా ఉంటుంది. ఎన్పీఎస్ వల్ల పొదుపు అలవాటు పెరుగుతుంది. రిటైర్మెంట్ కార్పస్ సిద్ధమవుతుంది.
ఎన్పీఎస్ ఎలా పని చేస్తుంది?
సంప్రదాయ పెన్షన్ పథకాల మాదిరిగా కాకుండా, ఎన్పిఎస్ మీ కంట్రిబ్యూషన్లను స్టాక్స్, బాండ్స్ వంటి మార్కెట్-లింక్డ్ సాధనాలకు కేటాయిస్తుంది. ఈ వ్యూహం స్థిర-ఆదాయ ఎంపికలతో పోలిస్తే అధిక రాబడికి అవకాశం కల్పిస్తుంది. మీ రిటైర్మెంట్ పొదుపు మొత్తం కూడా గణనీయంగా పెరుగుతుంది. వ్యక్తుల పదవీ విరమణ అవసరాలు తీరడం కసం పెన్షన్ ఆదాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్పీఎస్ ను ప్రవేశపెట్టింది. మీ బిడ్డకు 18 ఏళ్లు నిండిన తర్వాత, వారు ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రామాణిక ఎన్పీఎస్ ఖాతా వలె నిర్వహించవచ్చు.
NPS స్కీమ్ ప్రయోజనాలు..
ఈ స్కీమ్ లో చాలా సౌలభ్యాలు ఉన్నాయి. మీ రిస్క్ టాలరెన్స్ లేదా ఆర్థిక లక్ష్యాల్లో మార్పులకు అనుగుణంగా మీ పెట్టుబడి మిశ్రమాన్ని ఎంచుకోవచ్చు. అంతేకాక, ఇది పోర్టబుల్. మీరు మీ ఉద్యోగం మారిన్పటికీ.. అది మీ ఎన్పీఎస్ ఖాతాపై ఎటువంటి ప్రభావం చూపదు.
టాప్ NPS పెన్షన్ స్కీమ్ లు
SBI పెన్షన్ ఫండ్స్
LIC పెన్షన్ ఫండ్
UTI రిటైర్మెంట్ సొల్యూషన్స్
HDFC పెన్షన్ మేనేజ్‌మెంట్ కంపెనీ
ICICI ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్ నిర్వహణ
కోటక్ మహీంద్రా పెన్షన్ ఫండ్
ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ పెన్షన్ మేనేజ్‌మెంట్
టాటా పెన్షన్ నిర్వహణ
మాక్స్ లైఫ్ పెన్షన్ ఫండ్ మేనేజ్‌మెంట్
యాక్సిస్ పెన్షన్ ఫండ్ మేనేజ్‌మెంట్