Smartphone Discounts : మళ్లీ మళ్లీ రాని ఆఫర్స్.. అతి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు.. టాప్ 3 డీల్స్
Published Jan 15, 2025 10:14 AM IST
Smartphone Discounts : అమెజాన్ సేల్‌లో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మంచి డిస్కౌంట్‌తో ఈ ఫోన్లు లభించనున్నాయి. టాప్ 3 డీల్స్ గురించి చూసేయండి.
ప్రతీకాత్మక చిత్రం
రూ.10,000 కంటే తక్కువ ధరకు కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసం గుడ్‌న్యూస్. ఎందుకంటే అమెజాన్‌లో నేటి నుండి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్ట్రాంగ్ ఫీచర్స్ ఉన్న ఫోన్లను రూ.10వేలలోపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో టాప్ 3 డీల్స్ గురించి చూద్దాం.. చాలా తక్కువ ధరలో ఫోన్ కొనవచ్చు. ఈ లిస్టులో కేవలం రూ.6,249 ధర కలిగిన శాంసంగ్ ఫోన్ కూడా ఉంది.
జనవరి 19 వరకు జరిగే ఈ సేల్‌లో మీరు 9 వేల రూపాయల కంటే తక్కువకు 5జీ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. సేల్‌లో ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం05
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎం05 ఫోన్ రూ.6,249 ధరకు లభిస్తుంది. ఈ ఫోన్‌పై సుమారు రూ.312 క్యాష్‌బ్యాక్ దొరుకుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో దీని ధరను రూ.5,900 వరకు తగ్గించుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కంపెనీ అందిస్తోంది. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
లావా ఓ3
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో లావా ఓ3 వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ.6,199కు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లో మీరు దాని ధరను 10 శాతం వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌పై రూ.5,850 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. రూ.310 వరకు క్యాష్ బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. 8జీబీ వరకు ర్యామ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 6.75 అంగుళాల పంచ్ హోల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ ప్రధాన కెమెరా 13 మెగాపిక్సెల్ కాగా, సెల్ఫీ కెమెరా 5 మెగాపిక్సెల్‌గా ఉంది.
టెక్నో పాప్ 9 5జీ
ఈ 5జీ ఫోన్ ధర రూ.9,499. ఈ సేల్‌పై రూ.750 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లించే యూజర్లకు రూ.1,000 వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. ఈ ఫోన్‌తో పాటు కంపెనీ సుమారు రూ.475 క్యాష్ బ్యాక్‌ను కూడా అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.9,000 వరకు పొందొచ్చు. ఈ ఫోన్లో డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ సోనీ ఏఐ కెమెరాను పొందుతారు.
గమనిక : ప్రస్తుతం ఉన్న డిస్కౌంట్ ఆధారంగా ధరలు ఇచ్చాం. భవిష్యత్తులో ధరలో మారవచ్చు.