తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Banking Data : మీ బ్యాంకు వివరాలు హ్యాకింగ్‌కు గురికాకుండా ఉండాలంటే ఈ 5 విషయాలను ఫాలో అవ్వండి

Banking Data : మీ బ్యాంకు వివరాలు హ్యాకింగ్‌కు గురికాకుండా ఉండాలంటే ఈ 5 విషయాలను ఫాలో అవ్వండి

Anand Sai HT Telugu

02 October 2024, 14:00 IST

google News
    • Banking Data Protect : టెక్నాలజీ పెరగడతోపాటుగా సైబర్ మోసాలు కూడా పెరిగాయి. మీ బ్యాంకింగ్‌కు సంబంధించిన వివరాలను మీకు తెలియకుండా నేరగాళ్లు తీసుకుంటారు. అందుకే కొన్ని పద్ధతులు పాటిస్తే మీ వివరాలు సీక్రెట్‌గా ఉంటాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Pixabay)

ప్రతీకాత్మక చిత్రం

ఈ డిజిటల్ యుగంలో అన్ని ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. బ్యాంకింగ్ లావాదేవీల నుంచి అన్నీ విషయాలు డిజిటల్‌గా మారాయి. నేరుగా బ్యాంకులకు వెళ్లి పనులు చేయాల్సిన పని తగ్గిపోయింది. అయితే సాంకేతికత వృద్ధితో భద్రత కూడా ముప్పుగా మారింది. ఆన్‌లైన్ హ్యాకర్ల నుండి మీ డిజిటల్ సమాచారాన్ని దొంగిలించడం వరకు, అనేక స్కామ్‌లు చూస్తున్నాం. ఇది మీ ఆర్థిక లావాదేవీలపై ప్రభావంచ చూపిస్తుంది. అందుకే వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

సురక్షితమైన, కచ్చితమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి. వాటిని మర్చిపోకండి. దానితో పాటు కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను సురక్షితంగా ఉంచడంలో, సైబర్ బెదిరింపుల నుండి సురక్షితంగా ఉండటానికి మీకు సహాయపడే ముఖ్యమైన విషయాలను ఉన్నాయి.

పాస్‌వర్డ్‌లు

మీకు తెలియకుండానే మీ సమాచారం ఆన్‌లైన్‌లో రికార్డ్ అవుతుంది. హ్యాకర్లు వీటన్నింటినీ సులభంగా తెలుసుకుంటారు. పేరు, చిరునామా, పుట్టిన ప్రదేశం పాస్‌వర్డ్‌గా ఇస్తే హ్యాకర్లు ఈ పాస్‌వర్డ్‌ను కనుగొనడానికి ఈజీ అవుతుంది. బ్యాంకింగ్ సేవలకు ఎల్లప్పుడూ పెద్ద, ఊహించలేని పాస్‌వర్డ్ సెట్ చేయాలి. 1,2,3,4,5 వంటి ఒకే క్రమంలోని సంఖ్యలను ఉపయోగించవద్దు. ఒక్కో బ్యాంకు ఖాతాకు వేర్వేరు పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. ప్రతి 3 నుండి 6 నెలలకు పాస్‌వర్డ్‌లను మార్చాలి.

బహిరంగ ప్రదేశాల్లో వైఫై

ప్రయాణంలో బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వైఫైని ఉపయోగించవద్దు. ఇది హ్యాకర్లు మీ బ్యాంకింగ్ సమాచారాన్ని లేదా ఇతర ఆన్‌లైన్ కార్యకలాపాలను దొంగిలించడం సులభం చేస్తుంది. నెట్ బ్యాంకింగ్ చేయాల్సి వస్తే సురక్షితమైన సైట్లను మాత్రమే ఉపయోగించండి. మీ స్వంత ఉపయోగం కోసం వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(VPN) సేవను ఉపయోగించండి.

నెట్ బ్యాంకింగ్

నెట్ బ్యాంకింగ్, యూపీఐ యాప్‌లలో ధృవీకరణలు ఉంటాయి. ఫోన్ కాల్ ద్వారా మీ ఖాతాను ధృవీకరించడానికి ఎంపికలను సెట్ చేయండి. లావాదేవీల కోసం బయోమెట్రిక్ ధృవీకరణ లేదా ఫేస్ రికగ్నేషన్ ఉపయోగించండి. ఈ విధంగా హ్యాకర్లు మీ సమాచారాన్ని కనుగొనలేరు.

లింక్‌లపై క్లిక్ చేయవద్దు

స్కామ్‌లు సందేశాల ద్వారా మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. ఇవి మీ బ్యాంక్ నుండి వచ్చిన సందేశం రూపంలో ఉంటాయి. ఇది మీ సమాచారాన్ని అప్‌డేట్ చేయమని బ్యాంకు నుండి వచ్చిన సందేశాలు లేదా డబ్బు కోసం అడిగే పరిచయస్తుల సందేశాలు కావచ్చు. లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా మీ మొత్తం సమాచారాన్ని హ్యాకర్లు యాక్సెస్ చేస్తారు. అలాంటి సందేశాలు వస్తే వాటిని జాగ్రత్తగా చదవండి. సందేహాలుంటే నేరుగా బ్యాంకుకు వెళ్లండి.

నకిలీ సందేశాలు

హ్యాకర్లు నకిలీ సందేశాలను పంపుతుంటారు. బ్యాలెన్స్‌లు, టెక్నికల్ మెయింటెనెన్స్, పాస్‌వర్డ్ మార్పులు మొదలైనవాటిని చెక్ చేయండి. మీ ఫోన్‌లో టెక్స్ట్ సందేశాలు లేదా ఇ-మెయిల్‌లు వస్తాయి. అది మీ బ్యాంక్ అని తప్పుగా భావించవచ్చు. హ్యాకర్లు ఇలాంటి సందేశాలు కూడా పంపుతారు. అందుకే మీరు బ్యాంక్ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసుకోవాలి. ఎలాంటి తప్పు జరిగినా బ్యాంకు దృష్టికి వస్తుంది. మీకు కచ్చితంగా తెలుస్తుంది.

తదుపరి వ్యాసం