తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Dzire : మధ్యతరగతి ప్రజలకు ప్రియమైన కారు.. ఇప్పుడు సరికొత్త అవతారంలో!

Maruti Suzuki Dzire : మధ్యతరగతి ప్రజలకు ప్రియమైన కారు.. ఇప్పుడు సరికొత్త అవతారంలో!

Sharath Chitturi HT Telugu

15 October 2024, 13:34 IST

google News
    • Maruti Suzuki Dzire 2024 : మారుతీ సుజుకీ డిజైర్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​కు రెడీ అవుతోంది. ఇంకొన్ని రోజుల్లో ఈ మోడల్​ లాంచ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
మారుతీ సుజుకీ డిజైర్​ ఫేస్​లిఫ్ట్​ వచ్చేస్తోంది!
మారుతీ సుజుకీ డిజైర్​ ఫేస్​లిఫ్ట్​ వచ్చేస్తోంది!

మారుతీ సుజుకీ డిజైర్​ ఫేస్​లిఫ్ట్​ వచ్చేస్తోంది!

ఇండియాలో మారుతీ సుజుకీ డిజైర్​కి మంచి డిమాండ్​ ఉంది. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఇదొక ప్రియమైన కారు! ఇక ఇప్పుడు ఈ డిజైర్​కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని తీసుకొచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. లాంచ్ డేట్​పై ఇంకా క్లారిటీ లేదు కానీ, ఈ మారుతీ సుజుకీ స్విఫ్ట్​ డిజైర్​ ఫేస్​లిఫ్ట్​, అక్టోబర్​ 3వ వారంలో అరంగేట్రం చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మారుతీ సుజుకీ డిజైర్​..

మారుతీ సుజుకీ డిజైర్ 2008లో లాంచ్ అయ్యి, ఆ తరువాత డిజైర్​గా మారింది. కాంపాక్ట్ సెడాన్ మార్కెట్లో విజయవంతమైన పోటీదారుగా ఉంది. సెగ్మెంట్​లో తన ఆకర్షణను కొనసాగించడానికి, తదుపరి తరం మారుతీ సుజుకీ డిజైర్ కొన్ని మెరుగైన స్టైలింగ్, ఫీచర్ అప్​గ్రేడ్స్​ని హామీ ఇస్తుంది.

2024 మారుతీ సుజుకీ డిజైర్: ఎక్స్​టీరియర్..

ఇటీవల లీక్​ అయిన స్పై షాట్స్​ ప్రకారం.. రాబోయే మారుతీ సుజుకీ డిజైర్ బోల్డ్ డిజైన్ లాంగ్వేజ్​ని కలిగి ఉంటుంది. క్రోమ్ ఫినిషింగ్​తో వచ్చే మల్టిపుల్ హారిజాంటల్ స్లాట్స్​తో కూడిన భారీ గ్రిల్, డీఆర్​ఎల్​లతో కూడిన కొత్త ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్, ఫాగ్ లైట్లు ఇందులో ఉండనున్నాయి. కాంపాక్ట్ సెడాన్​లో ఎల్ఈడీ టెయిల్ లైట్లతో రీడిజైన్ చేసిన వెనుక భాగం, షార్క్ ఫిన్ యాంటెనాతో పాటు కొత్త అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి.

2024 మారుతీ సుజుకీ డిజైర్: ఇంటీరియర్..

2024 మారుతీ సుజుకీ డిజైర్ క్యాబిన్ గణనీయమైన మార్పును పొందుతుందని భావిస్తున్నారు. 360-డిగ్రీల కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లను పరిచయం చేసే అవకాశం ఉంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే ఫ్లోటింగ్ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్​తో పాటు స్పోర్టీ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో ఉండనుంది. పుడిల్ ల్యాంప్స్, హెడ్-అప్ డిస్ప్లే, స్టైలిష్ డ్యూయెల్-టోన్ బీజ్, బ్లాక్ ఇంటీరియర్ డిజైన్ ఈ మారుతీ సుజుకీ డిజైర్​ ఫేస్​లిఫ్ట్​ అదనపు ప్రత్యేకతలు.

2024 మారుతీ సుజుకీ డిజైర్: ఇంజిన్​..

నెక్ట్స్​ జెనరేషన్​ మారుతీ సుజుకీ డిజైర్.. లేటెస్ట్​ స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్​తో తన ప్లాట్​ఫామ్​ను పంచుకునే అవకాశం ఉంది. అంటే సబ్ కాంపాక్ట్ సెడాన్ 1.2-లీటర్, 3 సిలిండర్​ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉన్న రెండవ మోడల్ అవుతుంది. స్విఫ్ట్​లో ఈ ఇంజిన్ 80బీహెచ్​పీ పవర్​, 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. డిజైర్​కి కూడా ఇదే విధమైన పనితీరును అందిస్తుంది. 5-స్పీడ్ మేన్యువల్, ఏఎంటీ ఆప్షన్స్​ ఉండొచ్చు.

స్విఫ్ట్​లో ఇటీవల సీఎన్జీ వేరియంట్​ను సంస్థ విడుదల చేసింది. ఇక ఇప్పుడు 2024 మారుతీ సుజుకీ డిజైర్​లో కూడా ఈ ఆప్షన్​ వచ్చే అవకాశం ఉంది. ఇది తక్కువ రన్నింగ్ ఖర్చులకు ఆకర్షితమయ్యే ప్రైవేట్ కొనుగోలుదారులలో పెరుగుతున్న ప్రజాదరణను తీర్చుతుంది. ఫ్లీట్ కొనుగోలుదారుల కోసం డిజైర్ టూర్ వెర్షన్ కూడా రావొచ్చు.

ఈ మారుతీ సుజుకీ డిజైర్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ లాంచ్​ డేట్​పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లాంచ్​ సమయానికి మరిన్ని వివరాలు స్పష్టమవుతాయి.

తదుపరి వ్యాసం