తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila Counter : జగన్ విషపు నాగు, ఐదేళ్లు గాడిదలు కాశారా?- విజయసాయిరెడ్డికి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్

YS Sharmila Counter : జగన్ విషపు నాగు, ఐదేళ్లు గాడిదలు కాశారా?- విజయసాయిరెడ్డికి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్

27 October 2024, 16:56 IST

google News
  • YS Sharmila Counter To Vijayasai Reddy : వైఎస్ఆర్ ఆస్తుల విషయంలో వైఎస్ జగన్, షర్మిల మధ్య వివాదం కొనసాగుతోంది. వైఎస్ జగన్ తరఫున వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. ఇక వైసీపీ నేతలకు షర్మిల దీటుగా సమాధానం ఇస్తున్నారు. తాజాగా విజయసాయి రెడ్డికి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

జగన్ విషపు నాగు, ఐదేళ్లు గాడిదలు కాశారా?- విజయసాయిరెడ్డికి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
జగన్ విషపు నాగు, ఐదేళ్లు గాడిదలు కాశారా?- విజయసాయిరెడ్డికి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్

జగన్ విషపు నాగు, ఐదేళ్లు గాడిదలు కాశారా?- విజయసాయిరెడ్డికి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్

వైఎస్ జగన్ ను జైలుకు పంపిచమే షర్మిల ఉద్యేశమా? అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. విజయసాయి రెడ్డి చదివింది జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు. ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు(మనవళ్లు, మనవరాళ్లకు) సమాన వాటా ఉంటుందన్న వైఎస్ఆర్ మ్యాండేట్ .. అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా? అని షర్మిల ప్రశ్నించారు.

5 ఏళ్లు గాడిదలు కాశారా?

"మీరు కూడా జగన్ మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగిన వాళ్లే. రాజకీయంగా, ఆర్థికంగా జగన్ వల్ల బలపడిన వాళ్లే. మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే. వైఎస్ఆర్ మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది వైఎస్ఆర్. బంగారు బాతును ఎవరు చంపుకోరు. సొంత కళ్లను ఎవరు పొడుచుకోరు. వైఎస్ఆర్ మరణానికి చంద్రబాబు కారణం అయితే మీరు అధికారంలో ఉండి 5 ఏళ్లు గాడిదలు కాశారా ? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదు? దోషులను ఎందుకు శిక్షించలేదు? అనుమానం ఉండి, 5 ఏళ్లు అధికారంలో ఉండి, ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వెయ్యలేదు? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా?" - వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ మరణం తర్వాత ఛార్జిషీట్ లో ఆయన పేరు చేర్పించింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాదా? అని షర్మిల ప్రశ్నించారు. కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా? అని నిలదీశారు. కుట్ర చేయకపోతే జగన్ సీఎం అయిన వెంటనే, మొదటగా పొన్నవోలుకు అడ్వొకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మళ్లీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకి ఈడ్చిన విషపు నాగు జగన్ కాదా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

జగన్ కు చంద్రబాబు పిచ్చి వీడలేదా?

"చంద్రబాబుతో నాకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవు. వైఎస్ఆర్ తన బిడ్డ పెళ్లికి చంద్రబాబును పిలిచారు. అలాగే నేను కూడా పిలిచాను. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే.. నా చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్లకు సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి ? జగన్ కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా? ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా.. చంద్రబాబే కనిపిస్తున్నారేమో. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికో.. ఆయన బ్రాండింగ్ ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో, పని చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ బిడ్డకు ఎన్నటికీ రాదని మాట ఇస్తున్నా" -వైఎస్ షర్మిల

విజయసాయిరెడ్డి ఏమన్నారంటే?

జగన్ రాజకీయ ప్రత్యర్థుల కుట్రలో వైఎస్ షర్మిల పావుగా మారారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. షర్మిలకు కన్నీళ్లకు విలువలేదన్నారు.ఆమెను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. జగన్ పై అనేక కేసులు మోపిన కాంగ్రెస్ పార్టీతో పాటు… కుట్రలు చేసిన చంద్రబాబుతో చేతులు కలుపుతారా అని ప్రశ్నించారు. జగన్ కు వ్యతిరేకంగా షర్మిలను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్ కు రాసిన లేఖ టీడీపీ చేతికి ఎలా చేరిందని వైఎస్ షర్మిలను ప్రశ్నించారు. ప్రత్యర్థుల కుట్రలో మీరు భాగమవ్వటం శోఛనీయమన్నారు.

తదుపరి వ్యాసం