Ys Jagan Condolence: తిరుమల తొక్కిసలాట దుర్ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. మెరుగైన వైద్యం అందించాలని వినతి
Published Jan 08, 2025 10:38 PM IST
- Ys Jagan Condolence: తిరుమలలో వైకుంఠ ఏకదశి టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితదులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
Ys Jagan Condolence: తొక్కిసలాటలో శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల మృతిపై మాజీ సీఎం వైయస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్ని ఆదుకోవాలని డిమాండ్ ేశారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనంకోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్‌జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.