HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan On Cbn: గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారు.. పూర్తి బడ్జెట్‌ పెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడన్న జగన్

Ys jagan on CBN: గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారు.. పూర్తి బడ్జెట్‌ పెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడన్న జగన్

Sarath chandra.B HT Telugu

26 July 2024, 13:07 IST

    • Ys jagan on CBN:  పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే పరిస్థితిలో కూడా ఏపీ ప‌్రభుత్వం లేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గవర్నర్‌తో అబద్దాలు చెప్పిస్తున్నారని,  మ్యానిఫెస్టో అమలును ప్రశ్నిస్తారనే  ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ పొడిగిస్తున్నారని జగన్ ఆరోపించారు. 
వైసీపీ అధినేత జగన్
వైసీపీ అధినేత జగన్

వైసీపీ అధినేత జగన్

kuYs jagan on CBN: ఎన్నికల హామీల నుంచి తప్పించుకోడానికి పద్దతి ప్రకారం అబద్దాలు చెబుతున్నారని, రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని కథనాలు ప్రచారం చేస్తున్నారని, కోవిడ్‌ ఉన్నా కూడా రాష్ట్రంలో ఎక్కువ అప్పులు చేయలేదని జగన్‌ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్న సమయంలోనే వైసీపీ అధ్యక్షుడు జగన్ మీడియా ముందుకు వచ్చారు. ఆర్థిక పరిస్థితి, అప్పులపై సుదీర్ఘంగా మీడియాకు వివరణ ఇచ్చారు.

రాష్ట్రంలో ఫలితాలు వచ్చి 52రోజులైందని , 52రోజులుగా రాష్ట్రంలో ఏమి జరుగుతుందో గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతుందా, రివర్స్ డైరెక్షన్‌లో పోతుందో ప్రతి ఒక్కరు ఆలోచించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ కోరారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. ఎక్కడ చూసినా తప్పుడు కేసులు పెడుతున్నారని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ప్రశ్నించడానికి ఏ స్వరం ఉండకూడదు, బయటకు అడుగు పెట్టకూడదనే ధోరణితో ప్రభుత్వం పరిపాలన చేస్తోందన్నారు. చూస్తే బాధ కలగుతోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 12నెలల పాటు బడ్జెట్‌ ప్రవేశపెడుతుందని, ఆ బడ్జెట్‌ కూడా 7నెలల రెగ్యులర్ బడ్జెట్‌ ప్రవేశపెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.

ఓటాన్ అకౌంట్‌ కూడా పెట్టలేకపోతున్నారు..

12 నెలల కాల వ్యవధిలో 7నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ మాత్రమే ప్రవేశపెట్టే పరిస్థితిలో మాత్రమే ప్రభుత్వం ఉందని, రెగ్యులర్ బడ్జెట్‌ ప్రవేశపెట్టే ధైర్యం చంద్రబాబుకు లేదని, ఎంతటి దారుణమైన ప్రభుత్వం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

రెగ్యులర్ బడ్జెట్‌ ప్రవేశపెడితే ఎన్నికల్లో ఇచ్చి మోసపూరిత హామీలకు కేటాయింపులు రెగ్యులర్ బడ్జెట్‌లో చూపించాల్సి వస్తుందన్నారు. రెగ్యులర్ బడ్జెట్‌లో చూపకపోతే ప్రజలు రోడ్లపైకి వచ్చి, గళం విప్పుతారని, ప్రజలు ప్రశ్నించకుండా ఉండటానికి రెగ్యులర్ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం లేదన్నారు. తన అబద్దాలు బయటపడిపోతాయనే ఉద్దేశంతో రెగ్యులర్ బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా దాటవేస్తున్నారని ఆరోపించారు.

రెగ్యులర్ బడ్జెట్‌ ప్రవేశపెడితే పథకాలు, మ్యానిఫెస్టోలకు సంబంధించిన హామీలు,ఆ పథకాల డబ్బులు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తుంటారని, అవన్నీ మోసపూరిత హామీలుగా ప్రజలకు తెలిసిపోతుందని భావించి బడ్జెట్‌ ప్రవేశపెట్టడం లేదన్నారు. ప్రజలు బయటకురాకుండా అత్యాచారాలు, హత్యలు, కొట్టడంతో భయానక వాతావరణం కల్పిస్తున్నారన్నారు.

ఇలాంటి దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవన్నారు. చంద్రబాబుకు ఎప్పుడూ వంచన, గోబెల్స్‌ సిద్ధాంతాలను నమ్ముకుంటాడని, మనిషి అప్రతిష్ట పాలు చేయాలనుకున్నా, తన మాట తప్పాలనుకున్నా ఒక పద్ధతి ఫాలో అవుతాడన్నారు.

పద్ధతి ప్రకారం ప్రచారం…

ముందస్తు పథకం ప్రకారం ముందే కథ సిద్ధం చేసి, తన మీడియా సంస్థల ద్వారా ముమ్మరంగా ప్రచారం చేసి, ఆ కథనాలే వచ్చేలా చేసి, మంత్రులు నుంచి కింద స్థాయి వరకు అవే మాటలు మాట్లాడించి, డిబేట్లలో అవే అభిప్రాయాలు వచ్చేలా చేసి, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు చేసే పని న్యాయమైందని అభిప్రాయం కల్పిస్తున్నారని జగన్ ఆరోపించారు.

చంద్రబాబు అనుసరించే విధానాలు టీడీపీని లాక్కున్నప్పటి నుంచి ఇదే పద్ధతి పాటిస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఇటీవల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసమైపోయిందని చెప్పుకొస్తున్నారని,దానిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై వాస్తవాలు గమనించాల్సి ఉందన్నారు. ఇందులో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. మీడియా కూడా ప్రజలకు చెప్పాల్సి ఉందన్నారు.

చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాల నుంచి ఏ రకంగా పక్కకు తప్పుకుంటున్నాడో ప్రజలు గమనించాలన్నారు. ఎన్నికల హామీల నుంచి తప్పుకోడానికి రాష్ట్రంలో 14లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెబుతున్నారని,లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెబుతూనే సూపర్ సిక్స్‌ హామీలు ఇచ్చారన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రజలు అడిగేసరికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రూ.14లక్షల కోట్ల అప్పులు ఎక్కడ?

చంద్రబాబు ఎన్నికల సమయంలో ఆరోపించినట్టు రాష్ట్రంలో రూ.14లక్షల కోట్ల అప్పును బడ్జెట్‌లో చూపించాల్సి ఉందని, అది చూపించ లేక పడరాని పాట్లు పడుతున్నాడన్నారు. రివ్యూలు, అధికారుల బదిలీ అని హడావుడి చేశారని, చివరకు గవర్నర్‌ ప్రసంగంలో పది లక్షల కోట్లు అన్నారని, అందులో కూడా నిజం లేదన్నారు.గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారన్నారు.

ఆర్‌బిఐ,కాగ్, స్టేట్ బడ్జెట్‌ నుంచి సేకరించిన డేటాతో రాష్ట్రంలో ఎంత అప్పుందో చెప్పాలన్నారు. ఇవన్నీ బయటపడతాయనే బడ్జెట్‌ పెట్డం లేదన్నారు. రాష్ట్రంలో అప్పులు రూ.14లక్షల కోట్ల అప్పులు లేవని రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులు.. మార్చి కాకుండా జూన్‌ వరకు ఉన్న అప్పులు తీసుకున్నా రూ.5.18లక్షల కోట్లు మాత్రమే ఉందన్నారు.

2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి రూ.1.18లక్షల కోట్ల అప్పు ఉంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి చంద్రబాబు 2.71లక్షల కోట్లు అప్పులు మిగిల్చారని, తమ ప్రభుత్వంలో ఐదేళ్లలో అప్పులు రూ.5.18లక్షల కోట్లకు చేరాయనారు.

జూన్ 204నాటికి రూ.5.18లక్షల కోట్లు అప్పు ఉందని, దానికి రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీలు కలుపుకుంటే, కార్పోరేషన్లకు ఇచ్చిన అప్పులు కలుపుకుంటే, 2014లోరూ. 5744 కోట్ల నుంచి చంద్రబాబు ప్రభుత్వం ముగిసే సరికి రూ50వేల కోట్లు ఉన్నాయని, తమ ప్రభుత్వంలో ఐదేళ్లలో రూ.50వేల కోట్ల నుంచి రూ.1.06వేల కోట్లకు చేరాయన్నారు.

ప్రభుత్వ గ్యారెంటీ లని అప్పులు రూ.86,215 కోట్ల నుంచి తమ ప్రభుత్వం రూ. 1.23లక్షల కోట్లకు చేరిందన్నారు.మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, గ్యారంటీలతో చేసిన అప్పులు, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులతో కలిపిన అప్పుల్లో 2014లో విభజన నాటికి రూ.1,53, 347కోట్ల అప్పు ఉంటే 2019ల చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే సమయానికి రూ.4,08,170కోట్ల అప్పులు ఏపీలో ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం ముగిసే సమయానికి జూన్‌ 2024లో రాష్ట్రంలో మొత్తం అప్పులు రూ.7,48, 612 కోట్లు ఉన్నాయన్నారు.

చంద్రబాబు కంటే తక్కువ అప్పులే…

చంద్రబాబు హయంలో చేసిన అప్పులతో పోలిస్తే తమ ప్రభుత్వంలో చేసిన అప్పులు తక్కువేనన్నారు. చంద్రబాబు హయంలో 21.63శాతం వార్షిక పెరుగుదల ఉంటే, తమ ఐదేళ్ల పాలనలో రూ.12.90శాతం పెరుగుదల మాత్రమే అప్పుల్లో ఉందన్నారు. 21శాతం అప్పులు చేసిన వారు మంచి చేశారా? 12.90శాతం అప్పులు తగ్గించిన వారు రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశారో అంతా ఆలోచించాలన్నారు. గవర్నర్ ప్రసంగంలో పదిలక్షల కోట్ల అప్పులని చెప్పడం ఏమిటన్నారు. తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు.

వాస్తవాలు తెలుసుకోకుండా అసెంబ్లీలో ప్రకటన చేయడంపై గవర్నర్‌కు లేఖ రాస్తున్నట్టు జగన్ చెప్పారు. చంద్రబాబును మందలించాల్సిందిగా కోరుతామన్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని నడిపించామని గుర్తు చేశారు. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో క్యాలెండర్‌ ప్రకారం ఇచ్చామని, కులం, మతం, పార్టీలు చూడకుండా డోర్ డెలివరీ చేశామని,తమకు ఓటు వేయని వారికి కూడా డోర్ డెలివరీ చేశామన్నారు. ఏ నెల ఏ పథకం ఇస్తున్నామో కూడా చెప్పి చేశామని, చంద్రబాబు చేసేది న్యాయమేనా అని ప్రశ్నించారు.

దేశ చరిత్రలో ఇలా ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ పొడిగించడం ఎక్కడా జరగదని, ఏడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ పొడిగించడం ఎక్కడా జరగదన్నారు. ఎన్నికల్లో తానిచ్చిన అబద్దాలు బయటపడతాయనే ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ పొడిగిస్తున్నారని ఆరోపించారు. రెగ్యలర్ బడ్జెట్‌లో వాల్యూం 5, వాల్యూం 6ను ప్రకటించాల్సి వస్తుందనే భయంతో తాత్సారం చేస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు తప్పుడు పేపర్‌ ప్రకటించాడని, దానిపై తాము ఫ్యాక్ట్‌ పేపర్‌ ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ప్రజల దృష్టికి వాస్తవాలు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ధర్మం వైపు ప్రజలు నిలవాలన్నారు.

డైవర్షన్‌ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నిపుణుడని చెప్పారు. వినుకొండలో రషీద్‌ దారుణ హత్య జరుగుతున్న సమయంలో తాను వినుకొండ వెళుతుండగా, చంద్రబాబును ప్రశ్నించడానికి వెళుతుండగా మదనపల్లె ఘటన జరిగిందన్నారు. హత్య చేసిన యువకుడు ఎమ్మెల్యే భార్యకు కేకు తినిపించిన ఫోటోలు ఉన్నాయని హతుడి తల్లి తనకు చూపించిందని చెప్పారు

తాను వాటి మీద ప్రశ్నిస్తుంటే మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం కాలిపోతే రెండుసార్లు రివ్యూలు చేసి, డీజీపీ, సీఐడీ చీఫ్‌లను హెలికాఫ్టర్‌లను పంపించాడని, పెద్దిరెడ్డి చేయించాడని హడావుడి చేశారన్నారు. ఆర్డీఓ ఆఫీసులో ఘటన జరిగితే ఆ డాక్యుమెంట్స్‌ కాలిపోతే అవి ఎమ్మార్వో , కలెక్టర్‌, సిసిఎల్‌ఏలో కూడా ఆ డాక్యుమెంట్స్‌ ఉంటాయని, ఆన్‌లైన్‌లో కూడా ఉంటాయని అయినా ఏదో జరిగిపోయిందని రకరకాలుగా చిత్రీకరించారని ఆరోపించారు. పెద్దిరెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, మిథున్ రెడ్డి మూడుసార్లు ఎంపీగా గెలిచారని చెప్పారు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్