AU Distance Degree PG Courses : ఏయూ డిస్టెన్స్ డిగ్రీ, పీజీ కోర్సుల నోటిఫికేషన్ విడుదల- ఆగస్టు 31 ఆఖరు తేదీ
07 August 2024, 16:17 IST
- AU Distance Degree PG Courses : ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆన్ లైన్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 31లోపు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏయూ డిస్టెన్స్ డిగ్రీ, పీజీ కోర్సుల నోటిఫికేషన్ విడుదల-ఆగస్టు 31 ఆఖరు తేదీ
AU Distance Degree PG Courses : ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్య (స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్) 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆన్‌లైన్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు దాఖలు ఆఖరు తేదీ ఆగస్టు 31న నిర్ణయించారు. అర్హులైన ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు చేసుకోవాలి. అకాడమిక్ ఇయర్ సెప్టెంబర్-2024లో ప్రారంభం అవుతుంది. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌లను ఉంటాయి. గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌కు మూడేళ్ల కాల వ్యవధితో ఆరు సెమిస్టర్లు ఉంటాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ రెండేళ్ల కాల వ్యవధితో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి.
గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్
బీఏ, బీకాం కోర్సులు : ఇంగ్లీష్, తెలుగు మీడియంలో ఉంటాయి. దీనికి అర్హత ఇంటర్మీడియేట్, ఐటీఐ పాలిటెక్నిక్ డిప్లొమా, వెటర్నరీ, అగ్రికల్చర్ డిప్లొమా, లేదా ఏదైనా 10+2 విద్యా అర్హత ఉండాలి.
బీఎస్సీ ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్‌సీఎస్, సీబీజెడ్ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు కేవలం ఇంగ్లీష్ మీడియాలోనే ఉంటాయి. ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్‌సీఎస్ కోర్సులకు విద్యా అర్హత 10+2 చదివి ఉండాలి. ఎంపీసీ చది ఉండాలి. పాలిటెక్నిక్ డిప్లొమా, మాథ్యమెటిక్స్ డిప్లొమా, మాథ్యమెటిక్స్ బ్రిడ్జి కోర్సుతో ఒకేషనల్ కోర్సులు చదివి ఉండాలి.
- సీబీజెడ్ కోర్సుకు విద్యా అర్హత 10+2 చదివి ఉండాలి. బైపీసీ ఉండాలి. బ్రిడ్జి కోర్సుతో ఒకేషనల్ కోర్సులు చదివి ఉండాలి. వెటర్నరీ, అగ్రికల్చరల్ డిప్లొమా చేసి ఉండాలి.
- మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ) : తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఎకనామిక్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, హిస్టరీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎంఏ హిందీ కోర్సుకు అర్హత బీఏ, బీకాం, బీఎస్సీతో హిందీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. మిగిలిన కోర్సులకు ఏదైనా డిగ్రీ చేస్తే సరిపోతుంది.
- ఎంకామ్ కోర్సు: దీనికి అర్హత ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- ఎంఎస్సీ కోర్సులు : సైకాలజీ, బోటనీ, ఫిజిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, జూవాలజీ కోర్సులు ఉన్నాయి. ఇందులో ఎంఎస్సీ సైకాలజీ కోర్సుకు విద్యా అర్హత ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంఎస్సీ బోటనీ కోర్సుకు విద్యా అర్హత బీఎస్సీ బోటనీ చేసి ఉండాలి. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్టీకి విద్యా అర్హత బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఎంఎస్సీ జూవాలజీ కోర్సుకు విద్యా అర్హత బీఎస్సీ జూవాలజీ చేసి ఉండాలి.
- ఎంఏ, ఎంఎస్సీ మాథ్యమెటిక్స్ కోర్సులు : ఈ కోర్సులకు విద్యా అర్హత బీఏ, బీఎస్సీ మాథ్యమెటిక్స్ చేసి ఉండాలి.
- ఎంబీఏ, హెచ్ఆర్ఎం, ఫైనాన్స్, మార్కెటింగ్ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు నాలుగు సెమిస్టర్స్ ఉంటాయి. వీటికి విద్యా అర్హత మూడేళ్ల డిగ్రీ చేసి ఉండాలి. 50 శాతం మార్కులు రావాలి. రిజర్డ్వ్ అభ్యర్థులైతే 45 శాతం రావాలి.
- ఎంసీఏ : నాలుగు సెమిస్టర్స్ ఉంటాయి. దీనికి విద్యా అర్హత బీసీఏ, లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మ్యాథమెటిక్స్‌తో బీఎస్సీ, బీకాం, బీఏ పూర్తి చేసి ఉండాలి. 50 శాతం మార్కులు రావాలి. రిజర్డ్వ్ అభ్యర్థులైతే 45 శాతం రావాలి. ఆంధ్రా యూనివర్సిటీలో బీఏ, బీకాం, పీజీడీసీపిఏను చేసి ఉండాలి.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు