Trains Information : రైల్వే ప్రయాణికులకు అలర్ట్- 14 రైళ్లు రద్దు, 5 రైళ్లు రీషెడ్యూల్
27 July 2024, 18:44 IST
- Trains Information : విజయవాడ డివిజన్ లో రైల్వే లైన్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు. సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 14 రైళ్లు రద్దు కాగా, 5 రైళ్లను రీషెడ్యూల్ చేశారు.
రైల్వే ప్రయాణికులకు అలర్ట్- 14 రైళ్లు రద్దు, 5 రైళ్లు రీషెడ్యూల్
Trains Information : రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక ఏమిటంటే సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని దౌండ్ మార్గంతో పాటు దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో మూడో లైన్ పనులు, రైల్వే లైన్ల మరమ్మతులు, నిర్వహణ వంటి కారణంగా 14 రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈనెల 29 నుంచి ఆగస్టు 10 వరకు వివిధ రైళ్లు ఆయా తేదీల్లో రద్దు అయ్యాయి. ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లు రద్దు చేశారు. సికింద్రాబాద్-పూణే మధ్య తిరిగి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌తో సహా పలు రైళ్లు కొన్ని రోజులు పాటు రద్దు అయ్యాయి.
రద్దైన రైళ్లు
జులై 29, 31, ఆగస్టు 1న తేదీల్లో పూణే నుంచి బయలుదేరే పూణే-సికింద్రాబాద్ మధ్య నడిచే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (12205) రైలును రద్దు చేశారు. జులై 29, 31 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరే సికింద్రాబాద్-పూణే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12206) రైలును రద్దు చేశారు. జులై 30న సికింద్రాబాద్ నుంచి బయలుదేరే సికింద్రాబాద్-ముంబయి ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్ (12220) రైలు రద్దు చేశారు. జులై 31న ముంబాయి నుంచి బయలుదేరే ముంబాయి-సికింద్రాబాద్ ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్ (12219) రైలును రద్దు చేశారు. జులై 31న నిజామాబాద్ నుంచి బయలుదేరే నిజామాబాద్-పూణే ఎక్స్‌ప్రెస్ (11410) రైలును రద్దు చేశారు.
ఆగస్టు 5 నుంచి 10 వరకు విజయవాడ నుంచి బయలుదేరే విజయవాడ-భద్రాచలం రోడ్డు మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07278) రైలును రద్దు చేశారు. భద్రాచలం రోడ్డులో బయలుదేరే భద్రాచలం రోడ్డు-విజయవాడ మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07979) రైలును రద్దు చేశారు. డోర్నకల్ నుంచి బయలుదేరే డోర్నకల్-విజయవాడ మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07755)ను రద్దు చేశారు. విజయవాడలో బయలదేరే విజయవాడ-డోర్నకల్ మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07756) రైలును రద్దు చేశారు.
ఆగస్టు 5 నుంచి 10 వరకు విజయవాడ నుంచి బయలుదేరే విజయవాడ-సికింద్రాబాద్ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12713) రైలును రద్దు చేశారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరరే సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12714) రైలును రద్దు చేశారు. గుంటూరులో బయలుదేరే గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (17201) రైలును రద్దు చేశారు. సికింద్రాబాద్‌లో బయలుదేరే సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (17202) రైలును రద్దు చేశారు.
రైళ్ల రీషెడ్యూల్
వాల్తేర్ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా పుండి - నౌపడ విభాగంలో భద్రత సంబంధిత ఆధునికీకరణ పనుల కోసం ట్రాఫిక్ బ్లాక్‌ల కారణంగా జులై 29 నుంచి ఆగస్టు 3 వరకు ఐదు రైళ్లు రీషెడ్యూల్ చేశారు. ఆగస్టు 1న మధ్యాహ్నం 12ః10 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరే భువనేశ్వర్ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (12830) రైలు గంట ఆలస్యంగా బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1ః10 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరే విధంగా రీషెడ్యూల్ చేశారు.
ఆగస్టు 3న ఉదయం 11.15 గంటలకు పూరీ నుండి బయలుదేరే పూరీ - గాంధీధామ్ ఎక్స్‌ప్రెస్ (22974) రైలు 1.30 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు పూరీ నుంచి బయలుదేరే విధంగా రీషెడ్యూల్ చేశారు. ఆగస్టు 3న ఉదయం 12.10 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరే భువనేశ్వర్ - తిరుపతి ఎక్స్‌ప్రెస్ (22879) రైలు గంట ఆలస్యంగా బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1.10 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరే విధంగా రీషెడ్యూల్ చేశారు.
షార్ట్-టర్మినేషన్
జులై 29, ఆగస్టు 1, ఆగస్టు 3 తేదీలలో విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం - పలాస మెము (07470) రైలు శ్రీకాకుళం రోడ్‌లో షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది. పలాస - విశాఖపట్నం మెము (07471) రైలు పలాసకు బదులుగా శ్రీకాకుళం రోడ్ నుండి బయలుదేరుతుంది. ప్రజలు, ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తదనుగుణంగా ప్రయాణాలు చేసుకోవాలని వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు.
ఐదు రైళ్లు దారి మళ్లింపు
విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య తిరిగే గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727), తిరుపతి- సికింద్రాబాద్ మధ్య తిరిగే పద్మావతి ఎక్స్‌ప్రెస్ (14207), గూడూరు- సికింద్రాబాద్ మధ్య తిరిగే సింహపురి ఎక్స్‌ప్రెస్ (12710), తిరుపతి-ఆదిలాబాద్ మధ్య రాకపోకలు సాగించే కృష్ణా ఎక్స్‌ప్రెస్ (17405), హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్ (18046) రైళ్లను దారి మళ్లించారు.
కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీలు
ప్రయాణికుల సౌకర్యార్థం కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు జనరల్ బోగీలను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. భువనేశ్వర్-ముంబయి-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రెండు అదనపు జనరల్ బోగీలు అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి సీఎస్‌టీ ముంబాయి-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019) రైలుకు రెండు అదనపు జనరల్ బోగీలు రానున్నాయి. అలాగే సెప్టెంబర్ 17 నుంచి భువనేశ్వర్-సీఎస్‌టీ ముంబాయి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11020) రైలుకు రెండు అదనపు జనరల్ బోగీలు రానున్నాయి.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు