తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Unemployment Rate : ఏపీలో యువ‌త నిరుద్యోగ రేటు 17.5 శాతం-పురుషుల కంటే, మ‌హిళ‌ల్లోనే ఎక్కువ నిరుద్యోగం

AP Unemployment Rate : ఏపీలో యువ‌త నిరుద్యోగ రేటు 17.5 శాతం-పురుషుల కంటే, మ‌హిళ‌ల్లోనే ఎక్కువ నిరుద్యోగం

HT Telugu Desk HT Telugu

01 October 2024, 20:29 IST

google News
    • AP Unemployment Rate : ఏపీలో యువత నిరుద్యోగ రేటు 17.5 శాతం నమోదైదని లేబర్ బ్యూరో ప్రకటించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో నిరుద్యోగ రేట్లను లేబర్ బ్యూరో ప్రకటించింది. నిరుద్యోగంలో ఏపీ ప‌దో స్థానంలో నిలిచింది
 ఏపీలో యువ‌త నిరుద్యోగ రేటు 17.5 శాతం, పురుషుల కంటే, మ‌హిళ‌ల్లోనే ఎక్కువ నిరుద్యోగం
ఏపీలో యువ‌త నిరుద్యోగ రేటు 17.5 శాతం, పురుషుల కంటే, మ‌హిళ‌ల్లోనే ఎక్కువ నిరుద్యోగం

ఏపీలో యువ‌త నిరుద్యోగ రేటు 17.5 శాతం, పురుషుల కంటే, మ‌హిళ‌ల్లోనే ఎక్కువ నిరుద్యోగం

AP Unemployment Rate : ఆంధ్రప్రదేశ్‌లో యువ‌త నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతోంది. ఉద్యోగాలు లేక యువ‌తీ, యువ‌కులు అల్లాడిపోతున్నారు. డిగ్రీ, పీజీలు, ఇంజినీరింగ్‌, పీహెచ్‌డీలు వంటి ఉన్నత విద్యను పూర్తి చేసిన వారు సైతం నిరుద్యోగులుగా ఉన్నారు. కేవ‌లం ఏపీ ఒక్కటే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ యువ‌తీ, యువ‌కుల ప‌రిస్థితి దాదాపుగా ఇలానే ఉంది. ఈ ప‌రిస్థితుల‌ను ఈ నెల‌లో లేబ‌ర్ బ్యూరో విడుద‌ల చేసిన పీరియాడిక్ లేబ‌ర్ ఫోర్స్ స‌ర్వే (పీఎల్ఎఫ్ఎస్) గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఏపీలో యువ‌త నిరుద్యోగ రేటు 17.5 శాతం న‌మోదు అయిందని పీఎల్ఎఫ్ఎస్ స్పష్టం చేసింది. అందులో పురుషులు నిరుద్యోగం 16.4 శాతమ‌ని, మ‌హిళ‌ల నిరుద్యోగం 19.7 శాతం న‌మోదు అయింద‌ని పేర్కొంది. దేశంలోని గ్రామీణ‌, ప‌ట్టణ ప్రాంతాల్లో యువ‌త (15-29 ఏళ్ల ) నిరుద్యోగాన్ని ఇది స్పష్టం చేసింది. నిరుద్యోగంలో దేశంలో ఏపీ ప‌దో స్థానంలో నిలిచింది. స్త్రీ, పురుష మ‌ధ్య అంత‌రం త‌క్కువ‌గా ఉన్నప్పటికీ, యువ‌త నిరుద్యోగం మొత్తం అధిక రేటు రాష్ట్ర లేబ‌ర్ మార్కెట్‌లో నైపుణ్యాల అస‌మ‌తుల్యత‌ను స్పష్టం చేస్తోంద‌ని స‌ర్వే తెలిపింది.

లేబ‌ర్ బ్యూరో విడుద‌ల చేసిన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కంటే ల‌క్షద్వీప్ 36.2 శాతం, అండ‌మాన్‌, నికోబ‌ర్ దీవులు 34 శాతం, కేర‌ళ 30 శాతం, నాగాలాండ్ 27 శాతం, మ‌ణిపూర్ 23 శాతం, ల‌డ‌ఖ్ 22 శాతం, అరుణాచ‌ల్‌ప్రదేశ్ 21 శాతం, గోవా 19 శాతం, పంజాబ్ 19 శాతం యువ‌త నిరుద్యోగ రేటుతో ముందంజ‌లో ఉన్నాయి.

2023 జులై నుంచి 2024 జూన్ వ‌ర‌కు పీరియాడిక్ లేబ‌ర్ ఫోర్స్ స‌ర్వే (పీఎల్ఎఫ్ఎస్) భారతీయ లేబ‌ర్ మార్కెట్‌లో కొన‌సాగుతున్న స‌వాళ్లును వెల్లడించింది. యువ‌త‌లో లేబ‌ర్ మార్కెట్ మ‌ధ్య గ‌ణ‌నీయ‌మైన అంత‌రం కొన‌సాగుతోంది. ఆందళ‌న‌క‌రంగా యువ‌త నిరుద్యోగ రేటు 10.2 శాతం వ‌ద్ద ఉంది. అందులో పురుషులు నిరుద్యోగం 9.8 శాతం కాగా, మ‌హిళ‌ల నిరుద్యోగ‌లు 11 శాతంగా న‌మోదు అయింది.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూట‌మి ప్రభుత్వం 20 ల‌క్షల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని యువ‌త‌కు ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చింది. దానిక‌నుగుణంగానే ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తున్నామ‌ని ప్రభుత్వం చెబుతోంది. అయితే మ‌రోవైపు ఉపాధి ఉన్న వాలంటీర్ల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో దాదాపు 2.60 ల‌క్షల మంది యువ‌త ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా త‌య‌రు అయింది. అలాగే బేవ‌రేజ్ కార్పొరేష‌న్‌లో ప‌ని చేసే దాదాపు 20 వేల మంది ఉద్యోగుల‌ను అక్టోబ‌ర్ 1న నుంచి తొల‌గించారు. ప్రభుత్వ మ‌ద్యం షాపుల‌ను తొల‌గించ‌డంతో వారు ఉపాధి కోల్పోయారు. రాష్ట్రంలోని యువ‌త నిరుద్యోగం ఎక్కువ ఉండ‌టంతో దాన్ని ఎదుర్కొవ‌డం టీడీపీ కూట‌మి ప్రభుత్వానికి స‌వాల్‌గా మారింది.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం