తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Informations : ఏపీ మీదుగా 2 ప్ర‌త్యేక రైళ్లు - ఈ రూట్లలో పలు సర్వీసులు రద్దు

Trains Informations : ఏపీ మీదుగా 2 ప్ర‌త్యేక రైళ్లు - ఈ రూట్లలో పలు సర్వీసులు రద్దు

HT Telugu Desk HT Telugu

26 October 2024, 8:07 IST

google News
    • ప్రయాణికులకు రైల్వేశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ మీదుగా రెండు ప్ర‌త్యేక రైళ్లను నడపనుంది. ఈ రెండు రైళ్లు పలు స్టేషన్లలో ఆగనున్నాయి. ఇక దానా తుఫాను కారణంగా 15 రైళ్ల రద్దయ్యాయి. మరోవైపు కిరండూల్-విశాఖపట్నం (08552) రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ అందుబాటులోకి రానుంది.
ఏపీలో ప్రత్యేక రైళ్లు
ఏపీలో ప్రత్యేక రైళ్లు

ఏపీలో ప్రత్యేక రైళ్లు

ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి రెండు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్ల‌ను న‌డ‌పాల‌ని రైల్వే నిర్ణ‌యించింది. కోయంబత్తూర్-బరౌని-కోయంబత్తూర్ మ‌ధ్య ఈ రెండు రైళ్లు న‌డుస్తాయి. మ‌రోవైపు దానా తుఫాను కారణంగా 15 రైళ్ల రద్దు చేసింది.

1. కోయంబత్తూరు - బరౌని ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (06055) రైలు అక్టోబ‌ర్ 26 నుండి న‌వంబ‌ర్ 16 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. శనివారాల్లో ఉద‌యం 11.50 గంటలకు కోయంబత్తూరులో బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఆదివారం ఉద‌యం 10.48 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్క‌డి నుంచి 10:50 గంటలకు బయలుదేరుతుంది. 

విజయనగరం మ‌ధ్యాహ్నం 1.25 గంటలకు చేరుకుని, అక్క‌డి నుంచి 1.35 గంటలకు బ‌య‌లుదేరుతుంది. బొబ్బిలి 2.23 గంటలకు చేరుకుని, అక్క‌డి ఉండి 2.25 గంటలకు బ‌య‌లుదేరుతుంది. పార్వతీపురం మ‌ధ్యాహ్నం 2.50 గంటలకు చేరుకుంటుంది. అక్క‌డ నుండి 2.50 గంటలకు బ‌య‌లుదేరి, మ‌రుస‌టి రోజు సోమ‌వారం బ‌రౌని మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు చేరుకుంటుంది.

2. బరౌని - కోయంబత్తూరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (06056) రైలు నుండి అక్టోబ‌ర్ 29 నుండి న‌వంబ‌ర్ 19 వరకు అందుబాటులో ఉంటుంది. ప్ర‌తి మంగళవారాల్లో రాత్రి 11:45 గంటలకు బరౌని నుండి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు బుధ‌వారం రాత్రి 11.25 గంటలకు రాయగడ చేరుకుని, అక్క‌డి నుండి రాత్రి 11.30 గంటలకు బ‌య‌లుదేరుతుంది. పార్వతీపురం అర్థ‌రాత్రి 12.15 గంటలకు చేరుకుని, 12.17 గంటలకు బ‌య‌లుదేరుతుంది. 

బొబ్బిలికి అర్థ‌రాత్రి 12.40 గంటలకు చేరుకుని, అక్క‌డి నుండి 12.42 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. విజయనగరం అర్థ‌రాత్రి 1.04 గంటలకు చేరుకుని, అక్క‌డి నుండి అర్థ‌రాత్రి 1.05 గంటలకు బ‌య‌లుదేరుతుంది. దువ్వాడ తెల్ల‌వారుజామున 3.48 గంటలకు చేరుకుని, అక్క‌డి నుండి 3.50 గంటలకు బ‌య‌లుదేరి, శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 3:50 గంటలకు కోయంబ‌త్తూరు చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, బొబ్బిలి, పార్వ‌తీపురం స్టేష‌న్ల‌లో స్టాప్‌లు ఉన్నాయి. థ‌ర్డ్ ఏసీ-6, స్లీపర్ క్లాస్-08, జనరల్ సెకండ్ క్లాస్-1, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/దివ్యాంగజన్ కోచ్‌లు-01, జనరేటర్ మోటార్ కార్-1 కోచ్ ఉంటుంది.

అదనపు విస్టాడోమ్ కోచ్

వెయిటింగ్ లిస్ట్, ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్… విశాఖపట్నం-కిరండూల్-విశాఖపట్నం రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌ను జోడించాలని నిర్ణయించింది. అక్టోబ‌ర్ 26న కిరండూల్-విశాఖపట్నం (08552) రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ అందుబాటులో ఉంటుంది. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని వాల్తేర్ డివిజ‌న్ సీనియ‌ర్ మేనేజ‌ర్ కె.సందీప్ తెలిపారు.

15 రైళ్లు రద్దు :

దానా తుఫాన్ ప్రభావంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. ఇందులో భాగంగా ఇవాళ 11 రైళ్ల సేవలు బంద్ కానున్నాయి.ఇక 27వ తేదీన (ఆదివారం)తేదీన మరో మూడు రైళ్లు ర‌ద్దు కానున్నాయి. 28వ తేదీన ఒక రైలు సర్వీస్ రద్దు కానుంది.

1. 12513- సికింద్రాబాద్-సిల్చార్ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్

2. 22884- యశ్వంత్‌పూర్ - పూరీ గరీబ్రత్ ఎక్స్‌ప్రెస్

3. 22852 -మంగళూరు సెంట్రల్- సంత్రాగచ్చి వివేక్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

4. 12551- ఎస్ఎంవీ బెంగళూరు - కామాఖ్య ఏపీ ఎక్స్‌ప్రెస్

5. 17480- తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్

6. 22974- పూరి- గాంధీధామ్ ఎక్స్‌ప్రెస్

7. 12245- హౌరా- ఎస్ఎంవీటీ బెంగళూరు దురంతో ఎక్స్‌ప్రెస్

8. 18045- షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్

9. 20889- హౌరా-తిరుపతి హంసఫర్ ఎక్స్‌ప్రెస్

10. 06088- షాలిమార్ - తిరునల్వేలి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

11. 18418- గుణుపూర్-పూరి ఎక్స్‌ప్రెస్

27 (ఆదివారం)తేదీన మూడు రైళ్లు ర‌ద్దు..

1. 12510- గౌహతి- ఎస్ఎంవీటీ బెంగళూరు

2. 18048- వాస్కోడగామా-షాలిమార్ అమరావతి ఎక్స్‌ప్రెస్

3. 20895- రామేశ్వరం-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్

28 (సోమ‌వారం)తేదీన ఒక రైలు రద్దు…

1. 03430- మాల్దా టౌన్ - సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

రెండు రైళ్లు రీ షెడ్యూల్:

1. హౌరా- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ (12839) రైలు అక్టోబ‌ర్ 25 రాత్రి 11:55 గంటలకు బదులుగా అక్టోబ‌ర్ 26 తెల్ల‌వారు జామున 2:55 గంటలకు హౌరాలో బయల్దేరడానికి రీషెడ్యూల్ చేశారు.

2. హౌరా-జగ్దల్‌పూర్ సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్ (18005) రైలు అక్టోబ‌ర్ 25న రాత్రి 10:20 గంటలకు బదులుగా అక్టోబ‌ర్ 26 అర్థ‌రాత్రి 12:20 గంటలకు హౌరాలో బయల్దేరడానికి రీషెడ్యూల్ చేశారు. ప్రజలు ఈ మార్పులను గమనించాలని సందీప్ కోరారు. 

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌ర‌రావు జర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం