తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd : విధుల్లో హిందూయేతర మత ఆచారాలు పాటిస్తే కఠిన చర్యలు- టీటీడీ కీలక నిర్ణయం

TTD : విధుల్లో హిందూయేతర మత ఆచారాలు పాటిస్తే కఠిన చర్యలు- టీటీడీ కీలక నిర్ణయం

Updated Feb 05, 2025 05:38 PM IST

google News
  • TTD : హిందూయేతర ఉద్యోగులు, సిబ్బందిపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. విధుల్లో ఉండగా హిందూయేతర మత ఆచారాలు పాటిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. 18 మందిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.

విధుల్లో హిందూయేతర మత ఆచారాలు పాటిస్తే కఠిన చర్యలు- టీటీడీ కీలక నిర్ణయం

విధుల్లో హిందూయేతర మత ఆచారాలు పాటిస్తే కఠిన చర్యలు- టీటీడీ కీలక నిర్ణయం

TTD : తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలోని హిందూయేతర ఉద్యోగులు, సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించింది. విధుల్లో ఉన్నప్పుడు హిందూయేతర మత ఆచారాలు పాటిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. 18 మందిపై క్రమశిక్షణ చర్యలకు టీటీడీ ఆదేశాలు జారీచేసింది. దీంతో పాటు హిందూయేతర ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేయాలని నిర్ణయించింది.

అలాగే వీఆర్‌ఎస్ తీసుకునే వారికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు సూచనలతో ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. గతేడాది నవంబరులో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో చేసిన తీర్మానం మేరకు టీటీడీ ఈ చర్యలు తీసున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

గోవిందరాజస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు

తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవ‌రి 6 నుంచి 12వ తేదీ వ‌ర‌కు తెప్పోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి గోవింద‌రాజస్వామివారి పుష్కరిణిలో తెప్పల‌పై విహరిస్తారు. ఆ త‌రువాత ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

ఫిబ్రవ‌రి 6న కోదండరామస్వామివారు, 7న రుక్మిణి, స‌త్యభామ స‌మేత పార్థసారథిస్వామి వారు, 8న కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు, 9న ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు, 10, 11, 12వ తేదీల్లో గోవిందరాజస్వామి వారు తెప్పల‌పై భక్తులకు కనువిందు చేయ‌నున్నారు. చివ‌రి రోజు తెప్పోత్సవం అనంత‌రం ఎదురు ఆంజ‌నేయ‌స్వామివారి స‌న్నిధికి స్వామివారు వేంచేపు చేస్తారు.

తదుపరి వ్యాసం