Andhra Pradesh News Live October 16, 2024: Visakha Crime : విశాఖపట్నం జిల్లాలో ఘోరం, గొర్రెను అమ్మిన డబ్బుల ఇవ్వలేదని తండ్రిని హత్య చేసిన కొడుకు
16 October 2024, 22:34 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Visakha Crime : విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గొర్రెను అమ్మిన డబ్బులు ఇవ్వలేదని తండ్రితో గొడవ పడి చివరకు హత్య చేశాడు ఓ కొడుకు. మద్యానికి బానిసైన కొడుకు ఈ దారుణానికి ఒడిగట్టాడనని స్థానికులు అంటున్నారు.
AP Schools Holiday : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. దీంతో పలు జిల్లాల్లో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరు కొత్త ఇండస్ట్రియల్ పాలసీలపై చర్చించి కేబినెట్ ఆమోదించింది. 'వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్' అనే నినాదంతో కూటమి ప్రభుత్వం కొత్త ఇండస్ట్రియల్ పాలసీలు అమలు చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
Tirumala Rains : భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని రేపటి వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. కొండ చరియలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఈవో అధికారులను ఆదేశించారు
- భారీ వర్షాల కారణంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని అక్టోబర్ 17 వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈవో శ్యామలరావు ప్రకటన విడుదల చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు.
AP Rains Update : ఏపీ వైపీ వాయుగుండం దూసుకొస్తుంది. నెల్లూరుకి 370 దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయ్యి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.
Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి ఆర్జిత, వర్చువల్, అంగప్రదక్షిణం సహా ఇతర దర్శనం, గదుల బుకింగ్ టికెట్లకు సంబంధించి జనవరి నెల కోటాను అక్టోబర్ 19 నుంచి 24వ తేదీ వరకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ 19న ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేయనుంది.
Srikakulam Crime : శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భర్తపై కోపంతో ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది.
Tdp Office Attack Case : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం మంగళగిరి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
- AP Liquor Prices: ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో మద్యం ధరలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కూటమి పార్టీలు, ప్రైవేట్ దుకాణాల్లో అవే ధరలను కొనసాగించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పినా, పాత ధరలతోనే లిక్కర్ సరఫరా చేస్తోంది.
- AP DSC Coaching: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో వెలువడనున్న డిఎస్సీ 2024 ఉపాధ్యాయ నియామకాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డిఎస్సీ 2024 పరీక్షలకు శిక్షణనిస్తారు.
- Special Trains: రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పండగా నేపథ్యంలో అనంతపురం, కర్నూలు జిల్లాలు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు,కలబురగి స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు.
- AP Fisheries Department Jobs 2024 : ఏపీ మత్స్యశాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా.. మూడు ప్రోగ్రామ్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://fisheries.ap.gov.in/ వెబ్ సైట్ లోకి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
- అయ్యప్ప స్వామి భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శబరిమలకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు రకాల ప్యాకేజీలను నిర్ణయించింది. ఇందులో ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు ఉన్నాయి. వాటి వివరాలను ఇక్కడ చూడండి…
- ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ఉత్తర్వులను ఇచ్చింది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న సమయం మాత్రమే కాకుండా… ఒక గంట ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. దీంతో సాయంత్రం 5 గంటల వరకు కాలేజీలు పని చేయనున్నాయి.
RBI Internship 2024 : ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్ షిప్-2024 ప్రోగ్రామ్ కు దరఖాస్తులు ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా 125 మంది విద్యార్థులకు మూడు నెలల పాటు ఆర్బీఐ శిక్షణ ఇస్తుంది. అక్టోబర్ 15 దరఖాస్తులు ప్రారంభం కాగా...డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు.
- Texas Road Accident: అమెరికాలోని రాండాల్ఫ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. వారిలో ఒక మహిళతో పాటు ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు.
Skill Scam: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - సీమెన్స్ ప్రాజెక్టు కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రూ.23 కోట్లకు పైగా విలువైన కొత్త ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు.
- Gang Rape Accused: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం కేసు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులో ఒకరు పరారీలో ఉండగా, పట్టుబడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. చోరీలు, మహిళలపై అఘాయిత్యాలు, నేరాలకు అలవాటు పడిన కరడు గట్టిన ముఠాగా గుర్తించారు.
- AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ కోస్తా జిల్లా వైపు సాగుతోంది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం నుంచి తిరుపతి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.
- AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా మరో ముగ్గురి పేర్లను సుప్రీం కోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. ముగ్గురు న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకానికి పేర్లను సిఫారసు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో సహా 26 మంది న్యాయమూర్తులు ఉన్నారు.