తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live February 9, 2025: Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం, నలుగురి అరెస్ట్!
Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం, నలుగురి అరెస్ట్!
Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం, నలుగురి అరెస్ట్! (image source istockphoto.com)

Andhra Pradesh News Live February 9, 2025: Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం, నలుగురి అరెస్ట్!

Updated Feb 09, 2025 11:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Updated Feb 09, 2025 11:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం, నలుగురి అరెస్ట్!

  • Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో నలుగురుని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఏఆర్‌ డెయిరీ, పరాగ్‌ డెయిరీ, ప్రీమియర్‌ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్‌ ఫుడ్స్‌ సంస్థలకు చెందిన నలుగురిని మూడ్రోజులగా విచారించిన సీబీఐ ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 09, 2025 11:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Palnadu Accident : పల్నాడు జిల్లాలో తీవ్రవిషాదం, ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు మృతి-సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

  • Palnadu Accident : పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలను మృతి చెందారు. బొల్లవరం మాదల మేజర్ కెనాల్ కట్టపై కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 09, 2025 11:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Kiran Royal : కిరణ్ రాయల్ వ్యవహారంపై జనసేన యాక్షన్, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు

  • Kiran Royal : కిరణ్ రాయల్ పై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలపై జనసేన స్పందించింది. ఈ ఆరోపణలపై క్షుణ్ణమైన విచారణ జరిపి నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్ ను ఆదేశించింది.

పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 09, 2025 11:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Dhar Gang Arrest : అనంతపురం పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ధార్ గ్యాంగ్- భారీగా బంగారం, నగదు స్వాధీనం

  • Dhar Gang Arrest : దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వరుస చోరీలతో హడలెత్తిస్తున్న ధార్ గ్యాంగ్ లోని ముగ్గురిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ లో మారుమూల గ్రామాల్లో జల్లెడపట్టి నిందితులను పట్టుకున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 09, 2025 11:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AU Protest : ఆంధ్ర యూనివ‌ర్సిటీలో రీసెర్చ్ స్కాల‌ర్స్‌ ఆందోళ‌న‌-ప‌రిశుభ్రమైన భోజ‌నం, మంచి నీరు అందించాలని బైఠాయింపు

  • AU Scholars Protest : ఆంధ్ర యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ ఆందోళన చేపట్టారు. ప‌రిశుభ్రమైన భోజ‌నం, తాగేందుకు మంచి నీరు అందించాల‌ని రీసెర్చ్ స్కాల‌ర్స్ బైఠాయించారు. దీంతో వైస్ ఛాన్సులర్ స్పందించి విద్యార్థులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 

పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 09, 2025 11:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Janasena Kiran Royal : కిరణ్ రాయల్ వీడియోలు వైర‌ల్, వైసీపీ చిల్లర రాజకీయాలంటూ జనసేన నేత ఆరోపణలు

  • Janasena Kiran Royal : తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. తన వద్ద రూ.1.20 కోట్లు తీసుకుని మోసం చేశారని మహిళ ఓ వీడియో విడుదల చేశారు. సదరు మహిళను కిరణ్ రాయల్ బెదిరించారని ఓ ఆడియో, ఆమెతో సన్నిహితంగా ఉన్న ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.  

పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 09, 2025 11:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala Updates : శ్రీవారి భక్తులకు గమనిక, ఫిబ్రవరి 12న తిరుమల పౌర్ణమి గరుడ సేవ

  • Tirumala Updates : తిరుమలలో ఫిబ్రవరి 12న పౌర్ణమి గరుడ వాహన సేవ నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్రతినెలా పౌర్ణమి రోజున టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 09, 2025 11:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Jagan House : జగన్ నివాసం దగ్గర భద్రతా చర్యలు.. వరుస ఘటనల దృష్ట్యా పోలీసులు అలర్ట్

  • YS Jagan House : ఇటీవల జగన్ నివాసం దగ్గర వరుస ఘటనలు జరిగాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భద్రతా చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు అమర్చారు. వైసీపీ ఓటమి తర్వాత కొందరు యువకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అందుకే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 09, 2025 11:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nalgonda : ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులో రూ.23 లక్షల బ్యాగ్ మాయం! పోలీసులకు ఫిర్యాదు

  • Nalgonda : ఓ వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాడు. తన తోపాటు రూ.23 లక్షల బ్యాగ్‌ను తెచ్చుకున్నాడు. దారి మధ్యలో ప్రయాణికులు టిఫిన్ చేయడానికి బస్సును ఆపారు. అందరి తోపాటు ఆ వ్యక్తి కూడా బస్సు దిగాడు. మళ్లి వచ్చేసరికి డబ్బుల బ్యాగ్ మాయమైంది.
పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 09, 2025 11:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Palnadu Politics : పల్నాడులో మాజీ మంత్రుల మాటల యుద్ధం, ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్

  • Palnadu Politics : పల్నాడు జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని మాజీ మంత్రి విడదల రజిని...టీడీపీ ఎమ్మెల్సే ప్రత్తిపాటి పుల్లారావుపై ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక పుల్లరావు అక్కడ దాక్కొన్నా లాక్కొస్తామని వార్నింగ్ ఇచ్చారు.

పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 09, 2025 11:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP MLC elections : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కూట‌మిలో కుమ్ములాట‌.. టీడీపీ, బీజేపీ త‌లోదారి!

  • AP MLC elections : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూట‌మిలో కుమ్ములాట మొద‌లైంది. కూట‌మిలోని భాగంగా ఉన్న టీడీపీ, బీజేపీ త‌లోదారిని ఎంచుకున్నాయి. రెండు పార్టీలు ఇద్ద‌రు వేర్వేరు అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చాయి. ఈ ఎన్నిక‌లు కూట‌మిలో నెల‌కొన్న విబేధాలను తేట‌తెల్లం చేసింద‌నే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 09, 2025 11:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Railway ALERT : ప్రయాణికులకు అల‌ర్ట్‌... విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు, వందేభార‌త్ ట్రైన్ రీషెడ్యూల్

  •  ప్రయాణికులకు రైల్వేశాఖ అలర్ట్ ఇచ్చింది. విజయవాడ డివిజన్ లో పరిధిలో పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. ఇక విశాఖ‌ప‌ట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభార‌త్ రైలును రీషెడ్యూల్‌ చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 09, 2025 11:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala News : ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త - వీఐపీ బ్రేక్‌ దర్శనం కోటా పెంపు..!

  •  ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (APNRTS) సభ్యులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రోజువారీగా అందిస్తున్న వీఐపీ బ్రేక్‌ దర్శన కోటాను 50 నుంచి 100కు పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 09, 2025 11:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Govt Central Data System : ప్రభుత్వ విభాగాల డిజిటలైజేషన్ - తెరపైకి కేంద్రీకృత డేటా వ్యవస్థ..!

  • డిజిటల్ సేవలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కేంద్రీకృత డేటా సిస్టమ్ ద్వారా పౌరులకు అత్యుత్తమమైన సేవలను అందించాలని యోచిస్తోంది. మొబైల్ లోనే ముఖ్యమైన డాక్యుమెంట్లను పొందేలా చర్యలు తీసుకుంటోంది. మరిన్ని ప్రభుత్వ సేవలను డిజిటలైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు డేటా వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.

పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 09, 2025 11:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Kakinada Crime : విద్యార్థినుల‌కు అశ్లీల‌ వీడియోలు చూపించి.. ఉపాధ్యాయుడి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న

  • Kakinada Crime : విద్యార్థుల‌కు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కీచ‌కుడిగా మారాడు. అశ్లీల‌ వీడియోలు చూపించి.. వారిని తాకుతూ అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. ఉపాధ్యాయుడి వ్య‌వ‌హారిక శైలిపై విద్యార్థినులు, వారి త‌ల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు న‌మోదు అయింది.
పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 09, 2025 11:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Temperatures : ఏపీలో భానుడి భగభగలు - 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు

  • AP Telangana Weather Report : ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి పూర్తి కాకముందే భానుడి భగభగలతో అల్లాడిపోతున్నారు. ఇక తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి