
Andhra Pradesh News Live February 8, 2025: Tirumala Dashan Tickets : ఫిబ్రవరి 9న తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం టోకెన్లు జారీ-ఎక్కడంటే?
Updated Feb 08, 2025 10:04 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tirumala Dashan Tickets : తిరుపతి స్థానిక భక్తుల కోటా టికెట్లను ఈ నెల 9న విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఫిబ్రవరి 9న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టికెట్లు జారీ చేస్తారు.
CM Chandrababu : ఏపీలో మద్యం స్కాంతో పోలిస్తే దిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నదని సీఎం చంద్రబాబు అన్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యా్న్ని నాశనం చేసి, వేలకోట్లు దోచుకున్నారన్నారు.
- CBN on Delhi Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం ఢిల్లీని మార్చేశాయని వ్యాఖ్యానించారు. భారత్‌కు సరైన సమయంలో సరైన నేత నరేంద్ర మోదీ అని సీబీఎన్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఫెయిల్యూర్ మోడల్ అయ్యిందన్నారు.
- Delhi Election Results : ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై బీజేపీ జెండా ఎగిరింది. ఆమ్‌ఆద్మీ పార్టీ పాలనకు పుల్‌స్టాప్ పడింది. పలువురు ఆప్ అగ్ర నేతలు ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఈ ఫలితాలపై తాజాగా పవన్ కల్యాణ్ స్పందించారు.
Gunadala Mary Matha Festival : ఈ నెల 9 నుంచి 12వ విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు జరగనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8 నుంచి 12 వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఏ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ స్థలాలపై విజయవాడ సిటీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
- Kadapa Politics : బీజేపీ నేతల మధ్య వార్ జరుగుతోంది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఆదిపత్యపోరు పతాకస్థాయికి చేరింది. ఆదినారాయణ రెడ్డి అనుచరులపై సీఎం రమేష్ కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు లేఖలు రాశారు. దీనిపై ఆదినారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు.
- Eluru Railway Station : ఏలూరు రైల్వే స్టేషన్.. విజయవాడ- రాజమండ్రి మధ్యలో కీలకంగా ఉంటుంది. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణం సాగిస్తున్నా.. అభివృద్ధికి నోచుకోలేదు. కేంద్రం నిధులు కేటాయించినా.. పనులు సరిగా జరగలేదు. అటు అధికారులు, ఇటు నాయకుల చొరవతో ప్రస్తుతం పనులు పరుగులు పెడుతున్నాయి.
- Mana Mitra Whatsapp : బర్త్ నుంచి డెత్ వరకు.. ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. లోకల్ లీడర్లను బతిమిలాడాల్సి వచ్చేది. కానీ.. ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి మారింది. ఒక్క హాయ్ అనే మెసేజ్‌తో అన్ని మన ఫోన్‌లోకే వచ్చేస్తున్నాయి.
- AP Senior Citizen Card : సీనియర్ సిటిజన్ కార్డు.. వృద్ధాప్యంలో ఇదో తోడు. ఈ కార్డు తీసుకుంటే అనేక రకాల సేవలను, ప్రభుత్వ పథకాలను వేగంగా, సులభంగా పొందవచ్చు. అంతేకాదు.. దీన్ని ఉచితంగానే ఇస్తారు. మరి ఆలస్యం ఎందుకు వెంటనే వెళ్లి ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి.
- Anakapalle : విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది విద్యార్థిని. కుటుంబ సభ్యులు, బంధువులు స్కూల్‌కెళ్లి ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి, పోక్సో కేసు నమోదు చేశారు.
విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2019లో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో కొన్ని సవరణలు చేసింది. ఇక వాల్తేరు పేరును విశాఖపట్నం డివిజన్ గా మార్చేందుకు ఆమోదం తెలిపింది.