
Andhra Pradesh News Live February 5, 2025: SIT On Liquor Irregularities : వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలపై సిట్ ఏర్పాటు-నగదు లావాదేవీలు, హోలోగ్రామ్ వ్యవహారంపై విచారణ
Updated Feb 05, 2025 10:27 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
SIT On Liquor Irregularities : గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో 7గురి సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది.
Kurnool Crime : కర్నూలులో వివాహిత దారుణ హత్యకు గురైంది. అనుమానంతో వేధిస్తు్న్న భర్త నుంచి దూరంగా పుట్టింట్లో ఉంటుంది భార్య. దీంతో కక్ష పెంచుకున్న భర్త, భార్యపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Minister Lokesh : ఈసారి జగన్ 2.0 చూస్తారని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ 1.0 అరాచకం నుంచే ఇంకా బయటపడలేదన్నారు. ఇలాగే నా వెంట్రుక కూడా పీకలేరని అంటే ఉన్న 1.0 కూడా పీకేశారన్నారని ఎద్దేవా చేశారు.
Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ తో ఇబ్బంది పడుతున్నారని డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. దీంతో రేపటి కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరు కాలేకపోవచ్చని చెప్పింది.
Rajahmundry Forest Fire : రాజమండ్రి దివాన్ చెరువు రిజర్వు ఫారెస్టులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో వందలాది చెట్లు కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దాదాపు 12.5 ఎకరాల మేర అటవీ ప్రాంతం దగ్ధం అయ్యింది.
TTD : హిందూయేతర ఉద్యోగులు, సిబ్బందిపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. విధుల్లో ఉండగా హిందూయేతర మత ఆచారాలు పాటిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. 18 మందిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.
- వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ హెచ్చరించారు. విజయవాడలో వైసీపీ నేతలతో భేటీ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈసారి జగన్ 2.0 చూడబోతున్నారని కామెంట్స్ చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానని చెప్పుకొచ్చారు.
Maha Kumbh Mela Special Trains : మహాకుంభ మేళాకు కాకినాడ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాకినాడ టౌన్-గయ, కాకినాడ టౌన్-అజామ్‌గర్హ్ మధ్య మహాకుంభ మేళా స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
- వైసీపీ నేతలకు మంత్రి లోకేశ్ ఛాలెంజ్ విసిరారు. వాట్సాప్ గవర్నెన్స్ లో డేటా చోరీ జరిగినట్లు నిరూపిస్తే రూ. 10 కోట్ల కానుకగా ఇస్తానని చెప్పారు. ప్రభుత్వం తరఫున కాకుండా వ్యక్తిగతంగా తానే చెక్ ఇస్తానని చెప్పుకొచ్చారు. ఫోనే లేదని చెప్పిన జగన్ కు వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఏమి తెలుస్తుందని ప్రశ్నించారు.
AP Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీపై త్వరలో ప్రకటనలు మినహా స్పష్టత లేదంటూ పలువురు అసంతృప్తి చేస్తున్నారు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రులు ప్రకటించారు. జనవరి ముగిసినా రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభంకాలేదని ప్రశ్నలు మొదలయ్యాయి.
East Godavari Crime : తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో నమ్మించి కాలేజీ విద్యార్థినిపై లెక్చరర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు రావడంతో పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
- South Coastal Zone: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని ఖరారు చేశారు. 410 కి.మీ పరిధితో కొత్త జోన్ ఏర్పాటుకు రైల్వే శాఖ అమోదం తెలిపింది. ఇక వాల్తేర్ రైల్వే డివిజన్‌ను విశాఖపట్నం డివిజన్‌గా పరిగణిస్తారు.
- ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్తతోపాటు ప్రియురాలికి బంధువులు దేహశుద్ది చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని బోయకాలనీలో వెలుగు చూసింది. భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- AP Town Planing: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు దాటిపోయినా రియల్ ఎస్టేట్, వ్యక్తిగత నిర్మాణదారుల కష్టాలు మాత్రం తీరలేదు. అనుమతుల్ని సరళీకృతం చేసినట్టు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నా క్షేత్ర స్థాయి సమస్యల్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
- Trains Stoppage: తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు చెప్పింది. ప్రయాణికుల వినతులు, ప్రజా ప్రతినిధుల సూచనలతో ప్రయోగాత్మకంగా కొన్ని స్టేషన్లలో రైళ్లను ఆపుతున్నారు. ఆ గడువును మరో ఆర్నెల్లు పొడిగిస్తున్నట్టు సోమవారం ప్రకటించారు.
- Poultry Industry: ఏపీ, తెలంగాణల్లో పౌల్ట్రీ ఫారంలలో అంతు చిక్కని వైరస్‌తో భారీగా కోళ్లు మరణిస్తున్నాయి. వలస పక్షులతో విస్తరించిన వైరస్ వల్ల కోళ్లు వ్యాధుల బారిన పడుతున్నాయని పశు సంవర్థక శాఖ చెబుతోంది.వైరస్ నిర్ధారణకు భోపాల్‌లోని హై సెక్యూరిటీ ల్యాబ్‌కు నమూనాలను పంపారు.
- Ys Jagan: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోసాలను ఎండగట్టి ప్రజలకు వాటిని వివరించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీ సీనియర్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కొత్తగా మెడికల్ సీట్లు వద్దంటూ లేఖ రాయడం, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చర్యల్ని ఫీజు పోరులో భాగం చేయాలని సూచించారు.