
Andhra Pradesh News Live February 4, 2025: Krishna Viral News : తల్లి బతికుండగానే పెద్దకర్మ భోజనాలు, వింత కోరిక తీర్చిన కొడుకులు
Updated Feb 04, 2025 10:39 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Krishna Viral News : కృష్ణా జిల్లా ముచ్చర్లలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఊరంతటినీ పిలిచి ఎంతో ఘనంగా..తల్లి బతికుండగానే పెద్ద కర్మ భోజనాలు పెట్టారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే...తల్లే ఇలా భోజనాలు పెట్టమని కోరింది.
AP Building Permissions : రాష్ట్రంలో బిల్డింగ్ పర్మిషన్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 300 చ.మీ లోపు నిర్మాణాలకు యజమానులే స్వయంగా ప్లాన్ ధ్రువీకరించి దరఖాస్తు చేసుకునేలా అనుమతి ఇచ్చింది.
Visakha Mahakumbh Trains : మహా కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఈస్ట్ రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం- గోరఖ్‌పూర్- విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
Tirupati Deputy Mayor : తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. నాటకీయ పరిణామాల మధ్య డిప్యూటీ మేయర్ పీఠం టీడీపీ కైవసం చేసుకుంది. కిడ్నాప్ లు, బెదిరింపుల ఆరోపణల మధ్య ఎన్నిక ముగిసింది.
AP Schools : కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు శ్రీకారం చుట్టనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 7500 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్త విధానంలో 1 నుంచి 5 తరగతులు ఉండే పాఠశాలల్లో క్లాస్ కు ఒక టీచర్ ను కేటాయించనున్నారు.
- CPM AP Secretary: సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. మరోవైపు వయస్సు నిబంధన కారణంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎంఏ గఫూర్ తన బాధ్యతల నుంచి రీలివ్ అయ్యారు.కొత్త కార్యదర్శి ఎన్నిక సందర్భంగా ర్యాలీలో బృందాకారత్ బాబు,బీజేపీలపై విమర‌్శించారు.
- APSRTC : మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. భక్తుల సౌకర్యార్థం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా, శివరాత్రికి కాశీ యాత్రకు స్పెషల్ సర్వీసులను వేసింది. ఈ ప్రత్యేక బస్సుల ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి.
- Nandigama Murder Plan: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూతురు ప్రేమ వివాహానికి సహకరించిన స్నేహితుడిని హత్య చేయడానికి సుపారీ ఇచ్చిన తండ్రి కటకటాల పాలయ్యాడు. ప్రేమ పెళ్లికి సహకరించిన వ్యక్తని చంపేందుకు కిరాయి మూకతో ఒప్పందం చేసుకుని అడ్డంగా బుక్కయ్యాడు. నిందితుల్ని రిమాండ్‌కు పంపారు.
- TTD Rathasaptami: సూర్య జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో రథ సప్తమి వేడుకలను టీటీడీ వైభవంగా నిర్వహించింది. ఉదయం 6.48 సూర్యకిరణాలు శ్రీవారి పాదాలను తాకాయి. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వచ్చారు.
- Nidadavole Cheating: చిన్ననాటి స్నేహితురాలి భర్తగా పరిచయం చేసుకుని ఆ తర్వాత న్యూడ్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి రెండున్నర కోట్లు కాజేసిన ఘటన నిడదవోలులో వెలుగు చూసింది. ఈ ఘటనలో నిందితుల నుంచి రూ.1.81 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని పోలీసులు జప్తు చేశారు.
- Fee Reimbursement: ఫీజురియింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలన్న ఇంజనీరింగ్ కాలేజీల విజ్ఞప్తిపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ఇకపై క్యాలెండర్ ప్రకారం ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.