
Andhra Pradesh News Live February 16, 2025: GBS Cases In AP : జీబీఎస్ వ్యాధితో చికిత్స పొందుతూ మహిళ మృతి, ఏపీలో తొలి మరణం
Updated Feb 16, 2025 09:32 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
GBS Cases In AP : ఏపీలో గులియన్-బారీ సిండ్రోమ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ జీబీఎస్ వ్యాధితో గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది.
Bird Flu Effect : తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ తో లక్షల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చికెన్, గుడ్లు తినొచ్చని ప్రభుత్వం భరోసా ఇస్తున్నా జనం వాటికి కాస్త దూరంగా ఉంటున్నారు. మటన్, చేపల ధరలు కొండెక్కాయి.
Rajahmundry Mumbai Airbus : రాజమండ్రి-ముంబాయి ఎయిర్ బస్ సర్వీసులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎయిర్ బస్ సర్వీస్ ను ప్రయాగ్ రాజ్ కు మళ్లించారు. 14 రోజుల పాటు ప్రయాగ్ రాజ్ లో ఎయిర్ బస్ సర్వీసులు కొనసాగనున్నాయి. అనంతరం మార్చి 1 నుంచి రాజమండ్రిలో సేవలు పునరుద్ధరిస్తామని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.
APSRTC Special Buses : మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి 453 ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. ఫిబ్రవరి 19 నుంచి 28 వరకు ఈ స్పెషల్ సర్వీసులు రాకపోకలు నిర్వహించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
- AP Govt : రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈనెల 17న రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగ సంఘాలతో.. ప్రభుత్వం భేటీ కానుంది. అయితే.. ప్రమోషన్ ఛానల్‌పై స్పష్టత ఉండాలని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
- Kakinada : ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ యువకుడికి ఇంటర్ విద్యార్థినిని పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు మధ్య ప్రేమ చిగురించడంతో విద్యార్థినిని యువకుడు తీసుకెళ్లిపోయాడు. జిల్లాలు వేర్వేరు కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Guntur : గుంటూరు జీజీహెచ్‌లో విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బ్లడ్‌బ్యాంక్‌లో ల్యాబ్ టెక్నిషియన్, డాక్టర్ వేధింపులకు అంతు లేదని సిబ్బంది చెబుతున్నారు. వీరిద్దరిపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై కమిటీ చేశారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
- Vallabhaneni Vamsi Row : సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో.. వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసుపై రచ్చ జరుగుతుండగానే.. మరో విషయం బయటకొచ్చింది. ఆయన పాత కేసులపై పోలీసులు ఫోకస్ పెట్టినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
- CBN Warning : ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఊరుకోబోమని.. చంద్రబాబు స్పష్టం చేశారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంటలో స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు.