తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap High Court: ఏపీ హైకోర్టుకు మ‌రో ముగ్గురు న్యాయ‌మూర్తులు…సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు

AP High Court: ఏపీ హైకోర్టుకు మ‌రో ముగ్గురు న్యాయ‌మూర్తులు…సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు

HT Telugu Desk HT Telugu

16 October 2024, 6:13 IST

google News
    • AP High Court: ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు న్యాయ‌మూర్తులుగా మ‌రో ముగ్గురి పేర్లను సుప్రీం కోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. ముగ్గురు న్యాయ‌వాదులకు హైకోర్టు న్యాయ‌మూర్తులుగా నియామ‌కానికి పేర్ల‌ను సిఫార‌సు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో సహా 26 మంది న్యాయమూర్తులు ఉన్నారు.
ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల్ని సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు
ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల్ని సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు (HT_PRINT)

ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల్ని సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు

AP High Court: ఏపీ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం కోర్టు కొలిజియం అమోదముద్ర వేసింది. ముగ్గురి నియామకంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29 మంది పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉంది. ప్రస్తుతం 11 ఖాళీలు ఉన్నాయి. ముగ్గురు నియామకపు ప్రక్రియ పూర్తి అయితే, అప్పుడు ఖాళీల సంఖ్య 8కి తగ్గుతుంది

మంగ‌ళ‌వారం సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డివై చంద్ర‌చూడ్, న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ జె.సంజ‌య్ ఖ‌న్నా, జ‌స్టిస్ బీఆర్ గ‌వాయిల‌తో కూడిన సుప్రీం కోర్టు కొలిజియం స‌మావేశం జ‌రిగింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టుకు న్యాయ‌వాదులు కుంచం మ‌హేశ్వ‌ర‌రావు, తూట‌ చంద్ర ధ‌న‌శేఖ‌ర్‌, చ‌ల్లా గుణ‌రంజ‌న్ పేర్ల‌ను సిఫారసు చేసింది. ఈ మేర‌కు కొలిజియం తీర్మాన కాపీని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసింది. తీర్మానాన్ని సుప్రీం కోర్టు కొలిజియం కేంద్ర ప్ర‌భుత్వానికి పంపింది. కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం త‌రువాత రాష్ట్రప‌తి ఆమోద ముద్ర వేసి గెజిట్ విడుద‌ల చేస్తారు.

"2024 మే 15 న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సీనియర్ న్యాయ‌మూర్తుల‌తో సంప్రదించి, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం ముగ్గురు న్యాయవాదుల పేర్లను సిఫార్సు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ అభిప్రాయాలు స్వీకరించ‌లేదు.

న్యాయ శాఖ రాష్ట్ర రాజ్యాంగ అధికారుల స్పంద‌న‌ను అందించే మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్‌లోని పారా 14ను అమలు చేస్తూ ఆ సిఫార్సును వారికి పంపించింది. నిర్ణీత గడువులోగా ఎటువంటి స్పంద‌న రాలేదు. గవర్నర్‌, ముఖ్యమంత్రి ప్రతిపాదనకు జోడించడానికి ఏమీ లేదని, తదనుగుణంగా కొనసాగాలని లా అండ్ జ‌స్టిస్‌ మంత్రి భావించాలి" అని తీర్మానంలో పేర్కొంది.

ముగ్గురు న్యాయవాదులు హైకోర్టు న్యాయ‌మూర్తులుగా నియామ‌కానికి తగినవారో లేదో తెలుసుకోవడానికి, మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యవహారాలతో సంప్రదింపులు జరుపుతున్న సహోద్యోగులను సంప్రదించామని, కన్సల్టీ న్యాయమూర్తులలో ఒకరు అభ్యర్థుల అనుకూలతపై లేదా ఇతరత్రా తన అభిప్రాయాలను తెలియజేయలేదు. హైకోర్టు న్యాయ‌మూర్తులుగా నియామ‌కానికి అభ్యర్థుల మెరిట్, అనుకూలతను అంచనా వేయడానికి, మేము న్యాయ శాఖ చేసిన పరిశీలనలతో సహా రికార్డ్‌లో ఉంచిన అన్ని విషయాలను పరిశీలించి నిర్ణ‌యం తీసుకున్నాం" అని కొలిజియం తీర్మానంలో పేర్కొంది.

కుంచం మహేశ్వరరావు

కె. సుశీలమ్మ, కె. కోటేశ్వరరావు దంపతులకు కుంచం మహేశ్వరరావు తిరుపతిలో జన్మించారు. తిరుపతిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లా కళాశాలలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1998 లో బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసు కున్నారు. అనంతపురం జిల్లా కోర్టులో మొదట్లో న్యాయవాదిగా వృత్తిని ప్రారం భించారు. తర్వాత ప్రాక్టీసును హైకోర్టుకు మార్చారు. సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వద్ద కొంతకాలం ప్రాక్టీసు చేశారు. తర్వాత సొంతగా ప్రాక్టీసు ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధ కేసులలో పట్టు సాధిం చారు. హైకోర్టు ప్యానల్ న్యాయవాదిగా, భారత బార్ కౌన్సిల్, ఎఫ్సీఐ, పలు బీమా సంస్థలకు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉంది. తండ్రి కోటేశ్వ రరావు అసిస్టెంట్ పోలీసు కమిషనర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు.

తూట చంద్ర ధనశేఖర్

తూట శైలజ, చంద్రశేఖరన్ దంపతులకు చంద్ర ధనశేఖర్ జన్మించారు. తిరుపతి జిల్లా సత్యవేడు స్వస్థలం. నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1999లో బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేయించుకున్నారు. మాజీ ఏజీ పి. వేణుగోపాల్ వద్ద వృత్తిని ప్రారంభించారు. 2019లో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. ట్యాక్స్, రెవెన్యూ, భూసేకరణ, సివిల్, క్రిమినల్ చట్టాలపై అనుభవం సాధించారు.

చల్లా గుణరంజన్

చల్లా చంద్రమ్మ, నారాయణ దంపతులకు గుణరంజన్ జన్మించారు. అనం తపురం జిల్లా తాడిపత్రికి చెందిన వారు. తండ్రి నారాయణ న్యాయవాది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గుణరంజన్‌ కు సోదరుడి వరుస అవుతారు. 2001 మార్చి 21న బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసు కున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, వివిధ ట్రైబ్యునళ్ళులో రెండు దశాబ్దాలుగా న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. సివిల్, క్రిమినల్ చట్టాలతోపాటు విద్యుత్ సంబంధ, పర్యావరణ, ట్యాక్స్, కంపెనీ లా, దివాలా తదితర చట్టా లపై అపార అనుభవం గడించారు. పలు ప్రఖ్యాత సంస్థలకు న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

తదుపరి వ్యాసం