తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Good News : మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు.. ఉద్యోగాల్లో ఆ కోటా 2 నుంచి 3 శాతానికి పెంపు

AP Govt Good News : మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు.. ఉద్యోగాల్లో ఆ కోటా 2 నుంచి 3 శాతానికి పెంపు

04 November 2024, 17:53 IST

google News
    • AP Govt Good News : ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త క్రీడా పాలసీకి చంద్రబాబు ఆమోదం తెలిపారు. అటు వివిధ స్థాయిల్లో విజయం సాధించిన క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సహకాన్ని భారీగా పెంచారు. అదే సమయంలో.. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

కొత్త క్రీడా పాలసీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. నాలుగు లక్ష్యాలతో క్రీడా పాలసీ రూపకల్పన జరిగిందని వివరించారు. ప్రభుత్వం ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్‌ విజేతల ప్రోత్సాహకాన్ని భారీగా పెంచారు. రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ స్పోర్ట్స్ పాలసీపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

స్పోర్ట్స్ ఫర్ ఆల్..

స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ పేరుతో క్రీడా విధానాన్ని రూపొందించిన అధికారులు.. ముఖ్యమంత్రికి వివరించారు. పీపీపీ విధానంలో స్టేడియాలు, సంస్థల సహకారంతో క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై చర్చించారు. ఒలింపిక్స్‌, ఏషియన్స్‌ గేమ్స్‌లో పతకాలు పొందేవారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచాలని ప్రతిపాదించారు. సమగ్ర క్రీడా విధానంపై సీఎంకు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అన్నింటిని క్షుణ్నంగా పరిశీలించిన చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

త్వరలో మూలపాడు..

త్వరలోనే మూలపాడు క్రికెట్ స్టేడియంలోని రెండో గ్రౌండ్‌‌ను అందుబాటులోకి తీసుకొస్తామని.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. మూలపాడు మైదానాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మూలపాడులో సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో క్రికెట్‌ గ్రౌండ్లు ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు.

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఐపీఎల్ తరహాలో ఏపీఎల్‌ నిర్వహిస్తామని కేశినేని చిన్ని వివరించారు. ఏసీఏ తరఫున మూలపాడులో ఏడాదిలోపు క్రికెట్‌ అకాడమీ వస్తుందన్నారు. మూలపాడుకు అన్నీ అనుకూలిస్తే గోల్ఫ్‌ కోర్స్‌ వచ్చే అవకాశం ఉందని.. రాజ‌ధాని ప్రాంతంలో మంగ‌ళ‌గిరి, మూల‌పాడులో రెండు క్రికెట్ స్టేడియాలు ఉండ‌టం ఆనందంగా ఉందన్నారు.

తదుపరి వ్యాసం