Trains Diverted : రైల్వే ప్రయాణికులు అలర్ట్, ఎనిమిది రైళ్లు దారి మళ్లింపు
21 December 2024, 14:53 IST
Trains Diverted : ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 8 రైళ్లను దారి మళ్లించింది. రైళ్లను గుంటూరు-పగిడిపల్లి మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తాయి. అలాగే పలు రైళ్లను రీషెడ్యూల్ చేశారు.
రైల్వే ప్రయాణికులు అలర్ట్, ఎనిమిది రైళ్లు దారి మళ్లింపు
Trains Diverted : దక్షిణ మధ్య రైల్వే ఎనిమిది రైళ్లు దారి మళ్లించింది. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశారు. సికింద్రాబాద్ డివిజన్‌లోని కాజీపేట, విజయవాడ సెక్షన్‌ల మధ్య మోటుమారి జంక్షన్‌లో మూడో లైన్‌ను ప్రారంభించడం, ప్రీ నాన్-ఇంటర్ లాకింగ్ పనులు, నాన్-ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా ఎనిమిది రైళ్లు దారి మళ్లించారు.
రైళ్ల మళ్లింపు
ఈ రైళ్లు గుంటూరు-పగిడిపల్లి మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తాయి.
1. విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు నెంబర్ 18519 విశాఖపట్నం- లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ రైలు డిసెంబర్ 26 నుంచి జనవరి 8 వరకు మళ్లించిన మార్గంలో నడుస్తుంది. కాజీపేటలో స్టాపేజ్ తొలగించారు.
2. సీఎస్‌టీ ముంబయి నుంచి బయలుదేరే రైలు నెంబర్ 11019 సీఎస్‌టీ ముంబయి- భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 6 నుంచి జనవరి 8 వరకు మళ్లించిన మార్గంలో నడుస్తుంది. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం టౌన్, మధిరలో స్టాపేజ్ తొలగించారు.
3. భువనేశ్వర్‌లో బయలుదేరే రైలు నెంబర్ 11020 భువనేశ్వర్-సీఎస్‌టీ ముంబయి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 6 నుంచి జనవరి 8 వరకు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. మధిర ఖమ్మం టౌన్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేటలో స్టాపేజ్ తొలగించబడింది.
4. షాలిమార్ నుంచి బయలుదేరే రైలు నెంబర్ 18045 షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 6 నుంచి జనవరి 8 వరకు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ఖమ్మం టౌన్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగావ్, ఆలేరు, భోంగీర్‌లో స్టాపేజ్ తొలగించారు.
5. హైదరాబాద్ నుంచి బయలుదేరే రైలు నెంబర్ 18046హైదరాబాద్- షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 7 నుంచి జవనరి 9 వరకు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. భోంగీర్, ఆలేరు, జనగాన్, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం టౌన్ వంటి స్టాప్‌లు తొలగించారు.
6. షాలిమార్ నుంచి బయలుదేరే రైలు నెంబర్ 22849 షాలిమార్-సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 1, జనవరి 8 తేదీలలో దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. వరంగల్, కాజీపేటలో స్టాపేజ్‌లు తొలగించారు.
7. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైలు నెంబర్ 12774 సికింద్రాబాద్- షాలిమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 7న దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. వరంగల్, రాయనపాడులో స్టాపేజ్‌లు తొలగించారు.
8. విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు నెంబర్ 20833 విశాఖపట్నం- సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 8, జనవరి 9 తేదీలలో మళ్లించిన మార్గంలో నడుస్తుంది. స్టాపేజ్‌లు ఖమ్మం టౌన్, వరంగల్‌ను తొలగించారు.
రైళ్ల రీషెడ్యూలింగ్
1. యశ్వంత్‌పూర్‌లో బయలుదేరే రైలు నెంబర్ 18112 యశ్వంత్‌పూర్ - టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 5న షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరడానికి బదులు మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరుతుంది. (1 గంట రీషెడ్యూల్ చేశారు)
2. సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు నెంబర్ 20834 సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 7, 8, 9 తేదీల్లో షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరడానికి బదులుగా సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుంది. (1 గంట రీషెడ్యూల్ చేశారు)
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు