తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Welfare Pensions: ఏపీలో మూడు లక్షల మంది అనర్హులకు సామాజిక పెన్షన్లు, 2.5లక్షల దరఖాస్తుల పెండింగ్, త్వరలో ప్రక్షాళన

AP Welfare Pensions: ఏపీలో మూడు లక్షల మంది అనర్హులకు సామాజిక పెన్షన్లు, 2.5లక్షల దరఖాస్తుల పెండింగ్, త్వరలో ప్రక్షాళన

14 November 2024, 10:45 IST

google News
    • AP Welfare Pensions: ఆంధ్రప్రదేశ్‌లో మూడు లక్షల మంది అనర్హులకు సామాజిక పెన్షన్లు అందుతున్నట్టు గుర్తించినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పెన్షన్ల పంపిణీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు  మంత్రి బదులిచ్చారు. 
పెన్షన్లపై సభలో సమాధానం ఇస్తున్న మంత్రి శ్రీనివాస్
పెన్షన్లపై సభలో సమాధానం ఇస్తున్న మంత్రి శ్రీనివాస్

పెన్షన్లపై సభలో సమాధానం ఇస్తున్న మంత్రి శ్రీనివాస్

AP Welfare Pensions: ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 3లక్షల మంది అనర్హులకు సామాజిక పెన్షన్లు అందుతున్నట్టు ప్రభుత్వం గుర్తించినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రభుత్వం వద్ద కొత్తగా రెండున్నర లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. మంత్రి  సమాధానంపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకుని అనర్హులకు పెన్షన్ల పంపిణీపై ఏమి చర్యలు తీసుకుంటున్నారని, వికలాంగుల పెన్షన్లలో అక్రమాలు జరుగుతున్నాయని వాటిపై ఏం చేస్తారని మంత్రిని  ప్రశ్నించాచు. 

టీడీపీ అధికారం చేపట్టిన ప్రతిసారి వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు కనీస అవసరాలు తీరేలా అందరితో పాటు గౌరవంగా బ్రతికేందుకు పెన్షన్లను మంజూరు చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. 2014లో రూ.200గా ఉన్న పెన్షన్‌ వెయ్యి చేశారని  2018లో  వెయ్యిపెన్షన్‌  రెండువేలు చేశారని  చెప్పారు. దివ్యాంగులకు, డప్పు కళాకారులు, ట్రాన్స్‌ జెండర్లు పెన్షన్లు చంద్రబాబు హయంలో పెంచారని గుర్తు చేశారు. 

ఎన్నికల్లో పెన్షన్లను మూడు వేలు చేస్తామని చెప్పిన  జగన్‌ ఏడాదికి రూ.250మాత్రమే పెంచారన్నారు.  పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం గత ఏప్రిల్‌ నుంచి మూడు వేలు బకాయిలతో కలిపి రూ. 7వేలు పెన్షన్‌  చెల్లించారన్నారు.  వికలాంగులు, తీవ్రమైన రోగాల వారికి పెన్షన్‌ కూడా గణనీయంగా పెంచినట్టు చెప్పారు. 

గత ఐదేళ్లతో పోలిస్తే పెన్షన్ల ఖర్చు నెలకు  రూ.1939 కోట్ల నుంచి 2758కోట్లకు పెరిగిందని వివరించారు. ఏటా పెన్షన్ల బడ్జెట్‌ రూ. 23,272కోట్ల నుంచి 33వేల కోట్లకు పెరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇంత మొత్తం పెంచడం, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో 99శాతం పెన్షన్లను రెండు రోజుల వ్యవధిలోనే ఇంటి దగ్గరే పంచుతున్నట్టు చెప్పారు

ప్రతి నెల 1వ తేదీన పేదల దినోత్సవాన్ని ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పెన్షన్ల పంపిణీలో పాల్గొని, గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వంశీకృష్ణ, సింధూర రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిలు లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని మంత్రి వెల్లడించారు. 

పెన్షన్ల అర్హత మీద కొత్త ప్రభుత్వం జరిపిన పరిశీలనలో 3లక్షల పెన్షన్లకు అనర్హత పొందాయని, మరో  2.5లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తామన్నారు. అర్హత లేని వారికి చెల్లించడం, వికలాంగుల్లో అర్హత లేని వారికి ధృవీకరణ ఇచ్చారని, వాటిని సరిచేయాలని స్పీకర్‌ సూచించడంతో చర్యలు చేపడుతున్నట్టు మంత్రి వివరణ ఇచ్చారు. 

రాష్ట్రంలో  8లక్షల మందికి వికలాంగుల పెన్షన్లు ఉన్నాయని వాటన్నింటిని వెరిఫై చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. పూర్తి స్థాయిలో వైద్య, ఆరోగ్య శాఖలతో తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు.  పెన్షనర్లలో  భార్య భర్తల్లో ఎవరైనా మరణిస్తే స్పౌస్‌ పెన్షన్‌ జారీ చేసేందుకు, అలాంటి వారికి బకాయిలు చెల్లించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ వివరించారు.

తదుపరి వ్యాసం