HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Transport Department: రవాణా శాఖలో రగడ, మంత్రి సూచనలు పట్టించుకోని కమిషనర్‌, రిజర్వేషన్‌ వివాదంపై రచ్చ

AP Transport Department: రవాణా శాఖలో రగడ, మంత్రి సూచనలు పట్టించుకోని కమిషనర్‌, రిజర్వేషన్‌ వివాదంపై రచ్చ

15 October 2024, 11:44 IST

    • AP Transport Department: ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖలో కొత్త రగడ మొదలైంది. ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదం కొనసాగుతుండగానే రవాణా శాఖ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదం అయ్యాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా కమిషనర్‌ ఏకపక్ష ఆదేశాలపై ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
రవాణా శాఖలో కొత్త వివాదం
రవాణా శాఖలో కొత్త వివాదం

రవాణా శాఖలో కొత్త వివాదం

AP Transport Department: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో వివాదం కొనసాగుతుండగానే రవాణా శాఖ కమిషనర్‌ గత నెలలో జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన సున్నితమైన అంశంలో కమిషషనర్‌ ఏకపక్ష నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కలకలం రేగింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే వివాదం నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ విషయంలో కమిటీ రిపోర్ట్‌కు అమోద ముద్ర వేసేందుకు జరిగిన ప్రయత్నాలు ఎన్నికల సంఘం జోక్యంతో ఆగిపోయాయి. పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీని నియమించింది. ఈ కమిటీ తుది నివేదికను సమర్పించాల్సి ఉంది.

పదోన్నతుల్లో జరుగుతున్న ఇబ్బందులపై ఎస్సీ ఎస్టీ సంఘాలు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అభ్యంతరాలు, అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. రిజర్వేషన్ల విషయంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్నిప్రభుత్వ శాఖలు విధిగా అమలు చేయాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో రవాణా శాఖలో ఉద్యోగులకు సొంతంగా విధి విధానాలు రూపొందిస్తూ కొత్త పాలసీని ప్రవేశపెట్టడం వివాదాస్పదంగా మారింది. కోర్ట్ కేసులను సైతం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే పరిష్కరించాల్సి ఉన్నా ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా, జాయింట్ కమీషనర్ రమణశ్రీ కొత్త పాలసీని రూపొందించాలని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఈ వివాదం సిఎంఓకు చేరిది. ఆ తర్వాత ఆగమేఘాలపై సీనియారిటీ ఖరారు చేస్తూ అర్థరాత్రి ఉత్తర్వులు జారీ కావడంతో వివాదం తలెత్తింది. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రికి తెలియకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌ ఆదేశాలపై రవాణా మంత్రి వివరణ కోరే ప్రయత్నం చేసినా కమిషనర్‌ సహకరిచకపోవడం, ఆ శాఖ కార్యదర్శి పట్టనట్టు వ్యవహరించడంతె వివాదం తీవ్రమైంది. జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ బదిలీను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో మంత్రి తన పదవికి రాజీనామా చేస్తానని కమిషనర్‌ను హెచ్చరించినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఉద్యోగుేల వివాదంలో ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని అన్ని శాఖలకు ఉమ్మడి పాలసీ ఏర్పాటు చేయాల్సి ఉండగా రవాణా శాఖలో ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేయడాన్ని తప్పు పడుతున్నారు.

ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీ నివేదిక పెండింగ్ లో ఉండగానే క్యాచ్ అప్ రూల్ ని అమలు చేస్తూ వివిధ క్యాడర్ లలో సీనియారిటీని రివైజ్ చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు సిఎంఓ కార్యదర్శులకు ఫిర్యాదు చేశాయి. ముఖ్యమంత్రి కార్యదర్శుల సమస్యను వివరించినా, కమీషనర్ ఖాతరు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. రవాణా శాఖలో అన్ని క్యాడర్ లలో సీనియారిటీ ని రివైజ్ చేస్తూ దసరా పండుగ రోజు ఉత్తర్వులు జారీ చేయడంపై మండి పడుతున్ఇనారు.

సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఉత్తర్వులు పాటించడం తప్ప కమీషనర్ కు స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారాలు లేవని చెప్పినా, తనకు లేని అధికారాలను ఆపాదించుకుని ఆదేశాలు జారీ చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌పై చర్యలు తీసుకోకపోతే చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిస్తామని ఎస్సీ ఎస్టీ ఉద్యోగ, దళిత సంఘాలు ప్రకటించాయి.

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్