తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ration Dealer Recruitment : కృష్ణా జిల్లాలో రేష‌న్ డీల‌ర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు

AP Ration Dealer Recruitment : కృష్ణా జిల్లాలో రేష‌న్ డీల‌ర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు

HT Telugu Desk HT Telugu

29 November 2024, 17:03 IST

google News
    • AP Ration Dealer Recruitment 2024: కృష్ణా జిల్లాలో రేష‌న్ డీల‌ర్ పోస్టుల‌ను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబ‌ర్ 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 49 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూలు ద్వారా ఎంపిక ఉంటుంది.
రేష‌న్ డీల‌ర్ పోస్టుల‌కు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌
రేష‌న్ డీల‌ర్ పోస్టుల‌కు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

రేష‌న్ డీల‌ర్ పోస్టుల‌కు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రేష‌న్ డీల‌ర్ల నియామ‌కానికి సంబంధించి ఖాళీల‌ను భ‌ర్తీ చేయడానికి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. కృష్ణా జిల్లా గుడివాడ రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలోని ఆరు మండ‌లాల్లో 49 రేష‌న్ డీల‌ర్ల నియామ‌కం, దుకాణాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు డిసెంబ‌ర్‌ ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించారు. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూలు ద్వారా ఎంపిక ఉంటుంది.

గుడివాడ‌ రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో గ‌న్న‌వ‌రం, బాపుల‌పాడు, ఉంగుటూరు, నందివాడ‌, గుడ్డ‌వ‌ల్లేరు, పెద‌పారుపూడి మండ‌లాల్లో ఖాళీగా ఉన్న 49 రేష‌న్ దుకాణాల‌కు డీల‌ర్ల నియామ‌కానికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు గుడివాడ‌ ఆర్డీవో సుబ్ర‌హ్మ‌ణ్యం తెలిపారు. వీటిలో గ‌న్న‌వ‌రం మండ‌లంలో 14, బాపుల‌పాడు మండ‌లంలో 11, ఉంగుటూరు మండ‌లంలో 9, నందివాడ మండ‌లంలో 8, గుడ్డ‌వ‌ల్లేరు మండ‌లంలో 3, పెద‌పారుపూడి మండ‌లంలో 4 రేష‌న్ డీల‌ర్ల పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు.

అర్హ‌త‌లు...వ‌యో ప‌రిమితి

గుడివాడ‌ రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో ఖాళీగా ఉన్న రేష‌న్ డీల‌ర్లు, కొత్తగా మంజూరైన దుకాణాల భ‌ర్తీ చేయ‌డానికి ఇంట‌ర్మీడియ‌ట్ విద్యా అర్హ‌త‌ను నిర్ణ‌యించారు. డీల‌ర్ పోస్టుకు, దుకాణానికి ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు సొంత గ్రామానికి చెందిన వారై ఉండాలి. ఎటువంటి పోలీసు కేసులు ఉండ‌కూడ‌దు. చ‌దువుతున్న‌వారు, విద్యా వ‌లంటీర్లు, ఏఎన్ఎంలు, కాంట్రాక్టు ఉద్యోగులుగా ప‌ని చేస్తున్న‌వారు, ఆశ కార్య‌క్త‌లు ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు అన‌ర్హులు. అలాగే వ‌య‌స్సు 18 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. రిజ‌ర్డ్వ్ కేట‌గిరీకి చెందిన అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వ నిర్ణ‌యించిన మిన‌హాయింపు ఉంటుంది.

అభ్యర్థుల ఎంపిక షెడ్యూల్…

అభ్య‌ర్థులు డిసెంబ‌ర్ 13 తేదీ సాయంత్రం 5 గంట‌ల‌లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబ‌ర్ 14 తేదీన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీలించ‌నున్నారు. అదే రోజు అర్హులైన వారి జాబితా ప్ర‌క‌టిస్తారు. ఎంపికైన వారికి డిసెంబ‌ర్ 18న రాత ప‌రీక్ష‌ నిర్వ‌హిస్తారు.

రాత ప‌రీక్ష‌కు సంబంధించి హాల్ టికెట్స్ డిసెంబ‌ర్ 16న జారీ చేస్తారు. డిసెంబ‌ర్ 19న రాత ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు. ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల జాబితా ప్ర‌చురిస్తారు. రాత ప‌రీక్ష‌లో ఆయా ప్రాంతాల‌కు చెందిన అత్య‌ధిక మార్కులు సాధించిన ఐదుగురు అభ్య‌ర్థుల‌కు డిసెంబ‌ర్ 21న గుడివాడ‌ ఆర్డీవో కార్యాల‌యంలో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు. డిసెంబ‌ర్ 22న ఎంపికైన వారి తుది జాబితాను విడుద‌ల చేస్తారు.

జ‌త చేయాల్సిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు

1. ఇంట‌ర్మీడియ‌ట్‌, ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త స‌ర్టిపికేట్లు

2,. వ‌య‌స్సు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

3. నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రం (ఓట‌రు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైనా ప‌ర్వాలేదు)

4. మూడు పాస్‌పోట్ సైజ్ పోటోలు

5. కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

6. నిరుద్యోగిగా ఉన్న‌ట్లు స్వీయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

7. దివ్యాంగుల కేట‌గిరికి చెందిన వారైతే సంబంధిత స‌ర్టిఫికేట్లు జ‌త చేయాలి.

గుడివాడ‌ రెవెన్యూ డివిజ‌న్‌కు సంబంధించి డీల‌ర్ల పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన నోటిఫికేట‌ష‌న్ ఆర్డీవో కార్యాల‌యం, సంబందిత తాహ‌శీల్దారు కార్యాల‌యాలు, ఎంపీడీవో కార్యాల‌యాలు, గ్రామా స‌చివాల‌యం నోటీసు బోర్డు, సంబందిత రేష‌న్ షాపుల వ‌ద్ద ప్ర‌చురిస్తారు. పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన‌ ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా మండ‌లాల త‌హ‌శీల్దారు కార్యాల‌యాల్లోనూ, లేదా ఆర్డీవో కార్యాల‌యంలోనూ నుంచి పొంద‌వ‌చ్చు.

పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తు ఫాంను నేరుగా గాని, లేదా పోస్టు ద్వారా గాని రెవెన్యూ డివిజ‌నల్ అధికారి వారి కార్యాల‌యం, గుడివాడ‌కు పంపాలి. డిసెంబ‌ర్ 13 తేదీ లోపు ద‌ర‌ఖాస్తును దాఖలు చేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుతో పాటు సంబంధిత స‌ర్టిఫికేట్లు జ‌త చేయడం త‌ప్ప‌ని స‌రి. ఇత‌ర వివ‌రాల కోసం గుడివాడ‌ ఆర్డీవో కార్యాల‌యాన్ని సంప్ర‌దించాల‌ని ఆర్డీవో సుబ్ర‌హ్మ‌ణ్యం తెలిపారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం