తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Employees Dues: ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపు, నేడు రూ.6200కోట్ల విడుదల.. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న ఉద్యోగులు

Employees Dues: ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపు, నేడు రూ.6200కోట్ల విడుదల.. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న ఉద్యోగులు

Sarath Chandra.B HT Telugu

Published Mar 21, 2025 07:26 AM IST

google News
    • Employees Dues: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్లో శుక్రవారం రూ.6200కోట్లను విడుదల చేయనున్నారు. గత ఐదేళ్లుగా ఉద్యోగులు పొదుపు చేసుకున్న డబ్బును దారి మళ్లించడంతో వాటి కోసం పలు మార్లు ఆందోళనలు సైతం నిర్వహించారు.
బకాయిల విడుదల కోసం సీఎస్‌కు వినతి పత్రం ఇస్తున్న ఏపీ జేఏసీ నేతలు

బకాయిల విడుదల కోసం సీఎస్‌కు వినతి పత్రం ఇస్తున్న ఏపీ జేఏసీ నేతలు

Employees Dues: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని ప్రకటించిన ప్రభుత్వం శుక్రవారం రూ.6,200 కోట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ఆర్థికశాఖను ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదేశించడంతో సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద కలిపి రూ. 6,200 కోట్లను శుక్రవారం విడుదల చేయనున్నారు. ఇందుకు అవసరమైనచర్యలు తీసుకుంటున్నారు.


ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగులకు బకాయిల కింద రూ.1,033 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని వినతి

గత ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయులు వేతనాల చెల్లింపుల్లో ఇబ్బంది పడ్డారని, 25 వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రాష్ట్రంలోని పరిస్థితులు ఇబ్బందులు మీద అవగాహనతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పూర్తిగా సహకరించాయని, తొమ్మిది నెలలు దాటినా కూడా ఉద్యోగుల సమస్యలన్నీ ఎక్కడి ఒక్కడే ఉన్నాయని గురువారం ఏపీ జేఏసీ నాయకులు చీఫ్‌ సెక్రటరీకి విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 17వ తారీకు ఏపీ జెఎసి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను జేఏసీ ముఖ్య నేతలు చీఫ్ సెక్రటరీ రిప్రజెంటేషన్ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఒక్క జాయింట్ స్టాప్ కౌన్సిల్ మీటింగ్ కూడా జరపలేదని జాయింట్ స్టాప్ కౌన్సిల్ మీటింగ్ జరిపి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల మీద చర్చించాలని కోరారు.

2023 నుంచి పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను నియమించాల్సి ఉన్నాఇంతవరకు పీఆర్సీ చైర్మన్‌ను నియమించకపోవడం ఉద్యోగుల్ని ఆందోళన గురి చేస్తుందని వివరించారు. 29% ఇంటీరియర్ రిలీఫ్ మంజూరు చేయాలని కోరారు.

ఉద్యోగులకు సంబంధించిన జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ మరియు సరెండర్ లీవ్ బకాయిలు ఇంతవరకు చెల్లించటం లేదని, ఉద్యోగులు దాచుకున్న డబ్బులు కూడా కనీస చెల్లింపులు లేకపోతే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువచ్చారు. కూటమీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం కు జిపిఎఫ్ లో ఏపీజిఎల్ఐలు రూపంలో 2000 కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు ఉద్యోగులు తమ ఖాతాలకు చేశారని, కనీసం వాటిని కూడా ప్రభుత్వం రిలీజ్ చేయటం లేదన్న విషయాన్ని వివరించారు.

ధరలు పెరిగిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన మూడు డిఏల మీద ప్రభుత్వంకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగుల మీద వారి డిమాండ్ల మీద దృష్టి సారించాలని, పదవి విరమణ చేస్తున్న ఉద్యోగులకు కూడా కనీసమైన చెల్లింపులు జరగడంలేదనీ తెలిపారు.

ఈ అంశాలు అన్నిటి మీద చర్చించిన చీఫ్ సెక్రటరీ విజయానంద ఐఏఎస్, అసెంబ్లీ సెషన్స్ తర్వాత జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, అన్ని విషయాల మీరు చర్చిస్తామని తెలిపారు. ఉద్యోగులు చెప్పిన ఇబ్బందులు, సమస్యల మీద మీద సావధానంగా చర్చించారు.

బకాయిల విడుదలకు ఆదేశాలు..

ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల పెండింగ్ బకాయిలకు సంబంధించి రూ.6,200 కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలివ్వడంపై ఏపీ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల మిగిలిన సమస్యలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.