తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Drunk Person Stunts : ఫుల్లుగా తాగి మందుబాబు విన్యాసాలు, కరెంట్ తీగలపై పడుకుని హల్ చల్-వీడియో వైరల్

Drunk Person Stunts : ఫుల్లుగా తాగి మందుబాబు విన్యాసాలు, కరెంట్ తీగలపై పడుకుని హల్ చల్-వీడియో వైరల్

01 January 2025, 16:46 IST

google News
  • Drunk Person Stunts : మందుబాబుల విన్యాసాలు మామూలుగా ఉండవ్. మద్యం మత్తులో సకల విద్యలు ప్రదర్శిస్తుంటారు. అలాంటి ఓ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కి కరెంట్ తీగలపై పడుకున్నాడు.

ఫుల్లుగా తాగి మందుబాబు విన్యాసాలు, కరెంట్ తీగలపై పడుకుని హల్ చల్-వీడియో వైరల్
ఫుల్లుగా తాగి మందుబాబు విన్యాసాలు, కరెంట్ తీగలపై పడుకుని హల్ చల్-వీడియో వైరల్

ఫుల్లుగా తాగి మందుబాబు విన్యాసాలు, కరెంట్ తీగలపై పడుకుని హల్ చల్-వీడియో వైరల్

Drunk Person Stunts : అసలే డిసెంబర్ 31, న్యూ ఇయర్ కు డిఫరెంట్ గా వెల్ కమ్ చెప్పాలనుకున్నాడో ఏంటో తెలియదు గానీ పార్వతీపురం మన్యం జిల్లాలో మందుబాబు చేసిన పని వైరల్ అయ్యింది. పీకలదాకా తాగి అతడు చేసిన విన్యాసాలు స్థానికులను పరుగులు పెట్టించాయి. ఫుల్లుగా తాగి కరెంట్ పోల్ ఎక్కాడు. అక్కడితో ఆగకుండా కరెంట్ తీగలపై పడుకున్నాడు.

ఈ ఘటన ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. పాలకొండ మండలం ఎం.సింగపురంలో మంగళవారం మందుబాబు హల్‌చల్‌ చేశాడు. డిసెంబర్ 31న పొద్దున్నే మద్యం తాగడం మొదలెట్టిన మందుబాబు...అది చాలకపోవడంతో మందుకు ఇంకా డబ్బులు ఇవ్వాలని వాళ్లను అమ్మను అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో... కోపంలో ఇంటి బయట ఉన్న కరెంట్ పోల్‌ ఎక్కేశాడు. మందుబాబు విద్యుత్‌ స్తంభం ఎక్కడం చూసిన స్థానికులు వెంటనే అతని వద్దకు వెళ్లి ఆపేందుకు ప్రయత్నించారు. వారి మాటలు లెక్కచేయని మందుబాబు...విద్యుత్ స్తంభం ఎక్కాడు. దీంతో స్థానికులు వెంటనే ట్రాన్స్ ఫార్మన్ ఆపేశారు. కరెంటు పోల్ ఎక్కిన మందుబాబు...కాసేపు విన్యాసాలు చేసి, ఆపై తీగలపై పడుకున్నాడు.

కరెంటు స్తంభం దిగి రావాలని అతడి కుటుంబ సభ్యులు, స్థానికులు ఎంతసేపు పిలిచినా అతడు పట్టించుకోలేదు. దాదాపు అర గంటపాటు అతడు కరెంటు తీగలపై విన్యాసాలు చేశాడు. మందుకు డబ్బులు ఇస్తామని బుజ్జగించడంతో...చివరకు కరెంట్ పోల్ దిగి వచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మందుబాబు విన్యాసాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియోలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.

మద్యం షాపులో చోరీకి వెళ్లి...తాగి నిద్రపోయాడు

చోరీ చేసేందుకు వైన్ షాపులోకి దూరిన ఓ దొంగ ఫుల్లుగా తాగి అక్కడే నిద్రపోయాడు. నికార్సైన మద్యం కళ్ల ముందు కనబడడంతో...వచ్చిన పని మర్చిపోయి తాగుతూ కూర్చున్నాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. మెదక్‌ జిల్లా నార్సింగిలోని ఓ మద్యం దుకాణంలో చోరీ చేసేందుకు ఓ షాపు పై కప్పు రేకులను తొలగించి లోపలికి వెళ్లాడు. క్యాష్ కౌంటర్​లోని డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. సీసీ కెమెరాల హార్డ్‌ డిస్క్‌ లు కూడా తీసేశాడు. అసలే మద్యం షాపు కావడంతో...దొంగకు నాలుక లాగింది. కనిపించిన బ్రాండెడ్ మందు సీసాలు లాగించేశాడు. కాస్త ఎక్కువే తాగడంతో మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్నాడు. చోరీ విషయం మర్చిపోయి తెల్లవారే వరకు అక్కడే పడుకున్నాడు. ఉదయం షాపు తెరిచిన యజమాని దొంగను చూసి షాక్ అయ్యాడు.

షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించడంతో...పోలీసులు అక్కడకు చేరుకుని మద్యం మత్తులో ఉన్న దొంగను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మత్తు దిగాక అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తదుపరి వ్యాసం