తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Balineni Srinivas Reddy :నేను నీతిమంతుడినని చెప్పడంలేదు, మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నా-బాలినేని సంచలన వ్యాఖ్యలు

Balineni Srinivas Reddy :నేను నీతిమంతుడినని చెప్పడంలేదు, మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నా-బాలినేని సంచలన వ్యాఖ్యలు

09 December 2023, 20:39 IST

google News
    • Balineni Srinivas Reddy : ఏపీలో జగన్ రావాలని మా అబ్బాయి తపన పడుతున్నాడని, సీఎం జగన్ కు కూడా మా మీద అభిమానం ఉండాలి కదా అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి
బాలినేని శ్రీనివాసరెడ్డి

బాలినేని శ్రీనివాసరెడ్డి

Balineni Srinivas Reddy :మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా.. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తుందన్నారు. పోటీ చేస్తే ఒంగోలు నుంచే పోటీచేస్తానని, మరో నియోజకవర్గానికి వెళ్లనన్నారు. శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ...అందరూ కలిసి పని చేస్తానంటేనే నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని సీఎం జగన్‌కు చెప్పానన్నారు. నేను నీతి మంతుడినని చెప్పడం లేదని, మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకున్నానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని రూ.50 లక్షలు పందెం కట్టానని, తెలంగాణలో అన్ని జిల్లాలో తిరిగి మా అబ్బాయి బీఆర్ఎస్ వస్తుందని చెప్పారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ వస్తే ఏపీలో వైసీపీ వస్తుందని మా అబ్బాయి తపనపడ్డాడన్నారు. మా అబ్బాయి బాధపడకూడదని పెట్టిన పందెం రద్దు చేసుకున్నానని, జగన్ రావాలని మా అబ్బాయి తపన పడుతున్నాడన్నారు. సీఎం జగన్‌కు కూడా మా మీద అభిమానం ఉండాలి కదా అని బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరెక్కడా పోటీ చేయను

తనకు టిక్కెట్ ఇవ్వరని జిల్లాలో వేరే చోట టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోందని, అయితే ఒంగోలులో తప్ప మరెక్కడా తాను పోటీ చేయబోనని బాలినేని చెప్పారు. అవినీతిపై బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నీతి మంతుడినని చెప్పడం లేదన్న ఆయన... తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నానని తెలిపారు. అయితే తాను వెయ్యి కోట్లు సంపాదించానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

"ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది. మా అబ్బాయికి జగన్ అంటే చాలా అభిమానం. ఎప్పుడూ జగన్ రావాలని కోరుకుంటాడు. కానీ ఆయనకు కూడా మాపై ఉండాలి కదా? ఉండాలి అని కోరుకుంటున్నాను. మా అబ్బాయిని రాజకీయాల్లో తీసుకొద్దామా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నాను. సంబంధంలేని అంశాలను తీసుకొచ్చి బురద జల్లుతున్నారు. మీరందరూ నా వెంట ఉండి, హార్ట్ ఫుల్ గా పనిచేస్తేనే ఒంగోలులో పోటీ చేస్తాను. నా మనిషి వాసు అని అనుకుంటేనే పోటీ చేస్తాను. ఓటర్ లిస్ట్ కూడా సరిగ్గా వెరిఫై చేయలేకపోతున్నారనే బాధ. ఒంగోలులో నియోజకవర్గంలో ఒక్కరి దగ్గర రూపాయి తీసుకోలేదు. అప్పులు చేసి రాజకీయాలు చేస్తున్నాను. మినిస్ట్రీలో ఉన్నప్పుడు డబ్బులు ఇస్తే తీసుకున్నాను. నేను నీతిమంతుడనని చెప్పలేదు"- మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

తదుపరి వ్యాసం