తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Housing Approval : ఏపీలో ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై ఆ నిబంధన నుంచి మినహాయింపు

AP Housing Approval : ఏపీలో ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై ఆ నిబంధన నుంచి మినహాయింపు

03 November 2024, 17:24 IST

google News
  • AP Housing Approval : నగరాల్లో ఇల్లు నిర్మించుకునే వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 100 గజాల లోపు స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 300 గజాల్లోపు ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేస్తామన్నారు.

ఏపీలో ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై ఆ నిబంధన నుంచి మినహాయింపు
ఏపీలో ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై ఆ నిబంధన నుంచి మినహాయింపు

ఏపీలో ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై ఆ నిబంధన నుంచి మినహాయింపు

ఏపీ సర్కార్ ఇండ్ల నిర్మాణంపై కీలక ప్రకటన చేసింది. పట్టణాలు, నగరాల్లో నిర్మించే 100 గజాల లోపు స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. పట్టణాల్లో పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అంటే రెండు సెంట్లలోపు(100 గజాలు) స్థలంలో ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి ప్లాన్ మంజూరు కోసం మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు.

పట్టణాలు, నగరాల్లో ఇళ్ల నిర్మాణం అంటే పెద్ద క్రతువు. ఇంటి నిర్మాణానికి అనుమతుల కోసం అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగాలి. అవసరమైన పత్రాలన్నీ సమర్పించాలి. అన్నీ ఉన్న...అధికారుల నుంచి అనుమతులు రావాలంటే చాలా సమయమే పడుతుంది. పేదల పడుతున్న ఈ ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నగరాల్లో నిర్మించే 100 గజాల్లోపు ఇండ్లకు ప్లాన్‌ అప్రూవల్ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. శనివారం విశాఖ జిల్లాలో పర్యటించిన ఆయన...అధికారుల సమీక్షలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

పట్టణ, నగరాల్లోని ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన నిబంధనలలో మార్పులు చేయనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 100 గజాలలోపు స్థలంలో నిర్మించే నిర్మాణాలకు ప్లాన్ మినహాయింపుతో పాటు 300 గజాలలోపు ఇంటి నిర్మాణాలకు సులభతరంగా ప్లాన్ మంజూరు చర్యలు చేపడతున్నట్లు వెల్లడించారు. వీఎంఆర్‌డీఏ పెండింగ్ పనులు, ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విశాఖను అనుసంధానించేలా రహదారుల నిర్మించాలని ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. మాస్టర్‌ప్లాన్‌ రహదారుల రూపకల్పన, నిధుల సమీకరణ, విశాఖ మెట్రో రైలు డీపీఆర్, టిడ్కో ఇండ్ల పురోగతిపై చర్చించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పథకం

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం అయ్యిందని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. లబ్ధిదారుల కోసం ఒక యాప్‌ డిజైన్‌ చేశామన్న పొంగులేటి.. నాలుగు దశల్లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం ఉంటుందన్నారు. సొంత స్థలం ఉన్నవారికి దశల వారీగా రూ.5 లక్షలు ఇస్తామని మంత్రి ప్రకటించారు. ఇంటి యజమానిగా మహిళలను ఎంపిక చేస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు.

ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపిక పార‌ద‌ర్శకంగా ఉంటుంద‌ని, రాజ‌కీయ పార్టీలు, ప్రాంతాలు అనే భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిర‌మ్మ ఇళ్లు ఇస్తామ‌ని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కొద్దిరోజుల్లోనే ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకాన్ని ప్రారంభిస్తామ‌ని ప్రకటించారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు తుది ద‌శ‌కు చేరుకున్నాయ‌ని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ప్రజ‌ల‌ను దృష్టిలో ఉంచుకొని యాప్‌లో తెలుగు వెర్షన్ ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. లబ్దిదారుల ఎంపిక నుంచి ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యేవ‌ర‌కు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వీలైనంత‌ వ‌ర‌కు వాడుకోవాల‌ని అధికారులకు సూచించారు.

తదుపరి వ్యాసం