తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rains : ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP Rains : ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

11 December 2024, 22:48 IST

google News
  • AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతుందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో రేపు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అల్పపీడన శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతం మీద కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం కదులుతూ కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

అల్పపీడనం ప్రభావంతో రేపు( డిసెంబర్ 12) ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతారణ శాఖ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

తెలంగాణలో పొడివాతావరణం

తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. భారీ వర్షాలకు పడే అవకాశం లేదని వెల్లడించింది. ఒకటి రెండు చోట్ల చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తూర్పు , ఈశాన్య దిశల నుంచి ఈదురు గాలులు వీస్తాయన్నారు. పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. రానున్న రెండు మూడు రోజులు అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కనిష్ఠ స్థాయికి పడిపోవచ్చొని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఉష్ణోగ్రతలు తగ్గుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి గాలుల బారిన పడకుండా ఉన్ని దస్తులు ధరించాలన్నారు. చలికాలంలో వేడి వేడి ఆహారం తీసుకోవాలని సూచించారు.

ఉష్ణోగ్రతలు తగ్గుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి గాలుల బారిన పడకుండా ఉన్ని దస్తులు ధరించాలన్నారు. చలికాలంలో వేడి వేడి ఆహారం తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత తగ్గింది. తాజాగా చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని రోజుల కిందట 10 కిందకి దిగొచ్చిన కనిష్ట ఉష్ణోగ్రతలు...ఇప్పుడు మళ్లీ 20 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఉదయం పొగమంచు కారణంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

తదుపరి వ్యాసం