తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Prathipadu Accident : ప్రత్తిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం- టెంపో వ్యాన్ బోల్తా పడి ఇద్దరు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు

Prathipadu Accident : ప్రత్తిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం- టెంపో వ్యాన్ బోల్తా పడి ఇద్దరు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు

16 January 2025, 15:44 IST

google News
  • Prathipadu Accident : కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.

ప్రత్తిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం- టెంపో వ్యాన్ బోల్తా పడి ఇద్దరు మృతి
ప్రత్తిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం- టెంపో వ్యాన్ బోల్తా పడి ఇద్దరు మృతి

ప్రత్తిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం- టెంపో వ్యాన్ బోల్తా పడి ఇద్దరు మృతి

Prathipadu Accident : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో వ్యాన్ బోల్తా పడి ఇద్దరు మరణించగా, 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రత్తిపాడు పీఎస్ పరిధిలోని వొమ్మంగి గ్రామ శివారులో AP 39 VG 3357 నంబర్ గల వినాయక ట్రావెల్స్ టెంపో వ్యాన్ బోల్తా పడి ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.

ఎస్సై లక్ష్మీ కాంతం, సీఐ సూర్య అప్పారావు సంఘటనాస్థలిని పరిశీలించారు. మృతులు బత్తుల సురేఖ(19), కోమాకుల చంద్రావతి(45)గా గుర్తించారు. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్, మెడికవర్, ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాకినాడ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన సుమారు 20 మంది బంధువులు దామచర్ల వాటర్ ఫాల్స్ కు వెళ్తున్న సమయంలో ప్రత్తిపాడు వద్ద ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణలోని యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ - హైదరాబాద్ హైవేపై రాయగిరి సమీపంలో పెట్రోల్ పంపు వైపు ఎడమవైపుకు తిరుగుతుండగా, వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. ఈ విషాదకరమైన రోడ్డుప్రమాదంలో మహిళ, కుమార్తె మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను మహబూబాబాద్ జిల్లా వాసులుగా గుర్తించారు.

తదుపరి వ్యాసం