TTD Darshans: నేడు శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూన్ నెల కోటా విడుదల..
Published Mar 21, 2025 09:06 AM IST
- TTD Darshans: తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్జిత సేవల జూన్ నెల కోటాను శుక్రవారం విడుదల చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
నేడు జూన్ నెల కోటా ఆర్జిత సేవల విడుదల
TTD Darshans: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు జూన్ నెల కోటా టిక్కెట్లలో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మార్చి 21 మంగళవారం కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జూన్ నెల కోటాను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
మార్చి 21న జ్యేష్టాభిషేకం టికెట్లు...
తిరుమలలో జూన్ 09 నుండి 11వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను మార్చి 21న ఉదయం 11 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు.
మార్చి 21న వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
మార్చి 22న అంగప్రదక్షిణం టోకెన్లు….
జూన్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను మార్చి 22వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూన్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మార్చి 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
మార్చి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల…
తిరుమల, తిరుపతిలలో జూన్ నెల గదుల కోటాను మార్చి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.