తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagan On Saireddy: విలువలు, వ్యక్తిత్వం ఉండాలి.. సాయిరెడ్డి, పార్టీ వీడిన ఎంపీలపై జగన్ వ్యాఖ్యలు

Jagan On Saireddy: విలువలు, వ్యక్తిత్వం ఉండాలి.. సాయిరెడ్డి, పార్టీ వీడిన ఎంపీలపై జగన్ వ్యాఖ్యలు

Published Feb 06, 2025 01:27 PM IST

google News
    • Jagan On Saireddy: రాజకీయాల్లో ఉన్న వారికి విలువలు, వ్యక్తిత్వం, విశ‌్వసనీయత  ముఖ్యమని, కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రజాస్వామ్యంలో ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉండగలరని గుర్తుంచుకోవాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. సాయిరెడ్డి పార్టీ పార్టీని వీడటం జగన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 
సాయిరెడ్డిపై జగన్‌ ఆగ్రహం

సాయిరెడ్డిపై జగన్‌ ఆగ్రహం

Jagan On Saireddy: వైసీపీని వీడి బయటకు వెళ్లిన ఎంపీలపై జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెళ్లే నాయకులకు వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలని సాయిరెడ్డితో కలుపుకుంటే నలుగురు పార్టీని వీడి బయటకు వెళ్లారని వారందరికి అదే వర్తిస్తుందని జగన్‌ అన్నారు.

పోయే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెబుతున్నానని రాజకీయాల్లో క్యారెక్టర్‌, క్రెడిబిలిటీ ఉండాలని, క్యాడర్‌ కాలర్ ఎగరేసుకుని ఫలనా వ్యక్తి తమ నాయకుడు అని చెప్పుకోవాలన్నారు. ఎమ్మెల్యే, ఎంపీల గురించి వారు అలాగే చెప్పుకోవాలన్నారు. భయపడో, ఏదో కారణం చేతో మనంతట మనమే రాజీపడి అటు వైపు వెళితే వారికి గౌరవం, క్యారెక్టర్‌ వాల్యూ ఏముంటుందన్నారు.

కష్టం ఎల్లకాలం ఉండవని, అధికారం ఐదేళ్లు మాత్రమే ఎవరికైనా ఉంటుందని, ఐదేళ్లు ఓర్చుకుంటే సరిపోతుందన్నారు. సాయిరెడ్డికైనా, పార్టీని వీడి బయటకు వెళ్లిన ముగ్గురికైనా అదే వర్తిస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి వారించినా వినకుండా రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసినట్టు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. జగన్‌ విదేశీ పర్యటనలో ఉండగా పార్టీని వీడిన సాయిరెడ్డి తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు.

తదుపరి వ్యాసం