తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gunadala Mary Matha Festival : గుణదల మేరీమాత ఉత్సవాలు-ఈ నెల 8 నుంచి 12 వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Gunadala Mary Matha Festival : గుణదల మేరీమాత ఉత్సవాలు-ఈ నెల 8 నుంచి 12 వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Updated Feb 08, 2025 02:51 PM IST

google News
  • Gunadala Mary Matha Festival : ఈ నెల 9 నుంచి 12వ విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు జరగనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8 నుంచి 12 వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఏ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ స్థలాలపై విజయవాడ సిటీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

గుణదల మేరీమాత ఉత్సవాలు-ఈ నెల 8 నుంచి 12 వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

గుణదల మేరీమాత ఉత్సవాలు-ఈ నెల 8 నుంచి 12 వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Gunadala Mary Matha Festival : గుణదల మేరీమాత ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తైయ్యాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు విజయవాడ సిటీ పోలీసులు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏలూరు రోడ్డు మార్గంలో ఆర్టీసీ సిటీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను మళ్లించినట్లు తెలిపారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

విజయవాడ పండిత్ నెహ్రూ సిటీ బస్టాండ్ నుంచి గన్నవరం, ఆటోనగర్ వైపునకు ఏలూరు రోడ్డు మీదుగా వెళ్లే ఆర్టీసీ సిటీ బస్సుల రాకపోకలు

పండిత్ నెహ్రూ సిటీ బస్టాండ్, పీసీఆర్ జంక్షన్, ఆర్టీసీ జంక్షన్, స్వర్ణ హోటల్ జంక్షన్, అప్సరా జంక్షన్, విజయ టాకీస్, దీప్తి జంక్షన్, చుట్టుగుంట సెంటర్, కుడి వైపునకు విశాలాంధ్ర రోడ్డులోకి తిరిగి, మెట్రో జంక్షన్, నైస్ బార్ జంక్షన్, జమ్మిచెట్టు, సిద్ధార్థ జంక్షన్, అమ్మ కల్యాణమంటపం, క్రీస్తు రాజపురం, సాయి హోటల్ జంక్షన్, డెంటల్ ఆసుపత్రి రోడ్డు, మహానాడు జంక్షన్ మీదుగా రామవరప్పాడు, ఆటోనగర్ వైపునకు మళ్లించారు.

గన్నవరం, ఆటోనగర్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా పండిత్ నెహ్రూ సిటీ బస్ స్టాండ్ వైపునకు వచ్చు ఆర్టీసీ సిటీ బస్సుల రాకపోకలు మళ్లింపులు

గన్నవరం, ఆటోనగర్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు వచ్చి-ఏలూరు రోడ్డులో ఇ.యస్.ఐ. జంక్షను వద్ద నుంచి ఎడమవైపుకు తిరిగి -గుణదల పోస్ట్ ఆఫీస్- మద్దే రావమ్మ గుడి జంక్షన్-సంగం డైరీ జంక్షన్- మాచవరం పోలీసు స్టేషన్ మీదుగా అమ్మ కల్యాణమంటపం - సిద్ధార్థ జంక్షన్ - జమ్మిచెట్టు -మధు చౌక్ శిఖామణి సెంటర్ – రెడ్ సర్కిల్ - గోపాల రెడ్డి రోడ్ - ఆర్.ఐ.ఓ జంక్షన్ - సివిల్ కోర్ట్స్ మహంతి మార్కెట్ – బందర్ లాకులు – పి.సి.ఆర్. జంక్షన్ - పండిత్ నెహ్రూ సిటీ బస్ స్టాండ్ వైపునకు వెళ్లాలి.

గుణదల మేరిమాత ఉత్సవాలకు స్పెషల్ ఆర్టీసీ సిటీ బస్సుల రాకపోకలు

పండిత్ నెహ్రూ సిటీ బస్ స్టాండ్ -పి.సి.ఆర్ జంక్షన్-ప్రకాశం విగ్రహం- రైల్వే స్టేషన్ తూర్పు బుకింగ్ -ఏలూరు లాకులు జంక్షన్- జి.యస్.రాజు రోడ్డు- జింఖానా జంక్షన్ – సీతన్నపేట్ గేటు జంక్షన్ - బి.ఆర్.టి.యస్ రోడ్డులోకి తిరిగి- శారదా కాలేజీ జంక్షన్ - ఫుడ్ జంక్షన్ – మధురానగర్ జంక్షన్- మధురానగర్ కొత్త వంతెన వద్ద ఆర్.టి.సి. టెంపరరీ బస్ స్టాండ్ వరకూ బస్సులను అనుమతిస్తారు. తిరిగి ప్రత్యేక బస్సులు అదే మార్గంలో పండిట్ నెహ్రూ సిటీ బస్ స్టాండ్ వెళ్తాయి.

బి.ఆర్.టి.యస్ రోడ్డు, మాచవరం డౌన్ వైపు నుంచి రామవరప్పాడు రింగ్ వైపునకు వాహన రాకపోకలు

చుట్టుగుంట సెంటర్ –విశాలాంద్ర రోడ్డు - మెట్రో జంక్షన్ – నైస్ బార్ జంక్షన్ – జమ్మిచెట్టు – సిద్ధార్థ జంక్షన్- అమ్మ కల్యాణమంటపము-రమేశ్ హాస్పిటల్ జంక్షన్ -మహానాడు జంక్షన్-రామవరప్పాడు రింగ్ వైపునకు వెళ్లాలి.

రామవరప్పాడు రింగ్ వైపు నుంచి బి.ఆర్.టి.యస్ రోడ్డు, మాచవరం డౌన్ వైపు వైపునకు వాహనాల మార్గం

  • రామవరప్పాడు రింగ్-మహానాడు జంక్షన్-రమేశ్ హాస్పిటల్ జంక్షన్-అమ్మకల్యాణ మంటపం-సిద్ధార్థ జంక్షన్ -జమ్మిచెట్టు-నైస్ బార్ జంక్షన్-మెట్రో జంక్షన్-విశాలాంద్ర రోడ్డు-చుట్టుగుంట సెంటర్-బి.ఆర్.టి.యస్ రోడ్డుకు, మాచవరం డౌన్ కు మళ్లాలి.
  • 08-02-2025 రాత్రి నుంచి 12-02-2025 వరకు గుణదల పడవల రేవు జంక్షన్ నుంచి గుణదల ఈఎస్ఐ జంక్షన్ వరకూ ఏ విధమైన వాహనాలను అనుమతించరు.
  • గుణదల గంగిరెద్దుల దిబ్బ వైపు నుంచి బెత్లహెంనగర్ రోడ్డు మీదుగా పడవల రేవు వైపునకు ఇరువైపులా ఏవిధమైన వాహనాలను అనుమతించరు.
  • ఏలూరు రోడ్డులో ఆటో రిక్షాలను మాచవరం డౌన్ వరకూ మాత్రమే అనుమతిస్తారు. రామవరప్పాడు రింగ్ నుంచి ఆటో రిక్షాలను ఏలూరు రోడ్డులో ఈఎస్ఐ జంక్షన్ వరకూ మాత్రమే అనుమతిస్తారు.

గుణదల మేరిమాత ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ వివరాలు

1.పడవల రేవు వద్ద ఉన్న మధురానగర్ వంతెన వద్ద బి.ఆర్.టి.యస్ మధ్య రోడ్డులో కార్లు, ఆటోలు పార్కింగ్ చేసుకోవాలి. విజయవాడ సిటీ, తిరువూరు, నందిగామ, జగ్గయ్య పేట, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ వైపు నుంచి వచ్చేవారికి ఇక్కడ పార్కింగ్ సదుపాయం కల్పించారు.

2.st.జోసెఫ్ హైస్కూల్ మైదానంలో డ్యూటీలో ఉన్న అధికారులు, సిబ్బంది వాహనాల పార్కింగ్ ములు

3.జియాన్ బైబిల్ కాలేజి మైదానం ఎదురుగా ఉన్నా ప్రైవేటు ఖాళీ స్థలంలో ద్విచక్ర వాహనాల పార్కింగ్ ఏర్పాటుచేశారు. మచిలీపట్నం, ఏలూరు, గన్నవరం, పటమట వైపు నుంచి వచ్చే వారు ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు.

4.ఈఎస్ఐ హాస్పిటల్ మైదానం- కార్లు, మరియు ఆటోలు ద్విచక్రవాహనాల పార్కింగ్ - మచిలీపట్నం, ఏలూరు, గన్నవరం పటమట వైపు నుంచి వచ్చేవారు ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం