తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Special Trains : ప్రయాణికులకు అలర్ట్ - ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు

Special Trains : ప్రయాణికులకు అలర్ట్ - ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu

24 October 2024, 22:07 IST

google News
    • ప్రయాణికులకు మరో అలర్ట్ ఇచ్చింది రైల్వేశాఖ. ప్రయాణికుల రద్దీని క్లియర్ చేసేందుకు నాలుగు స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను వాల్తేర్ రైల్వే డివిజన్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.సంత్రగచ్చి, బెంగళూరు, సనత్ నగర్ మధ్య నడవనున్నాయి.
స్పెషల్ రైళ్లు
స్పెషల్ రైళ్లు

స్పెషల్ రైళ్లు

ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి ప్రత్యేక రైళ్లను నడపాలని ఇండియన్ రైల్వే నిర్ణయించిందని వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు. నాలుగు స్పెషల్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. సనత్‌నగర్-సంత్రగచ్చి-సనత్‌నగర్ (07069/07070), ఎస్ఎంవీ బెంగళూరు - సంత్రాగచ్చి - ఎస్ఎంవీ బెంగళూరు (06211/06212) రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

నాలుగు స్పెషల్ రైళ్లు

1. సనత్‌నగర్ నుండి బయలుదేరే సనత్‌నగర్-సంత్రాగచ్చి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07069) రైలు అక్టోబర్ 30 నుండి నవంబర్ 6 వరకు అందుబాటులో ఉంటుంది. బుధవారాల్లో బయలుదేరే ఈ రైలు ఉదయం 6:20 గంటలకు సనత్‌నగర్ లో బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 8:55 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడ నుండి రాత్రి 8:57 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం రాత్రి 10:03 గంటలకు చేరుకుని, అక్కడ నుండి రాత్రి 10:08 గంటలకు బయలుదేరుతుంది. శ్రీకాకుళం రోడ్డుకు రాత్రి 11:10 గంటలకు చేరుకుని, అక్కడ నుండి రాత్రి 11:12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది.

2. సంత్రాగచ్చి నుండి బయలుదేరే సంత్రాగచ్చి - సనత్‌నగర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (07070) రైలు అక్టోబర్ 31 నుండి నవంబర్ 7 వరకు అందుబాటులో ఉంటుంది. గురువారాల్లో బయలుదేరే ఈ రైలు సాయంత్రం 5:25 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుని,‌ అక్కడ నుంచి ఉదయం 6:47 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం ఉదయం 7:48 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి ఉదయం 7:50 గంటలకు బయలుదేరుతుంది. దువ్వాడ ఉదయం 9:25 గంటలకు చేరుకుని, అక్కడి నుంచి ఉదయం 9:27 గంటలకు బయలుదేరి శుక్రవారం రాత్రి 11:50 గంటలకు సనత్‌నగర్ చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు సనత్‌నగర్ నుండి సంత్రాగచి మధ్య సికింద్రాబాద్, చరాలపల్లి, ఘట్‌కేసర్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అంకపల్లె, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, బ్రహ్మాపూర్ రోడ్, సికింద్రాబాద్, బ్రహ్మాపూర్ రోడ్, సి. జాజ్‌పూర్ కె రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఆగుతుంది.

ఈ రెండు రైళ్ల్లలో సెకెండ్ ఏసీ క్లాస్ కోచ్-2, థర్డ్ ఏసీ క్లాస్ కోచ్-6, స్లీపర్ క్లాస్ కోచ్‌లు -7, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు-3, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగజన్ కోచ్-1,‌జనరేటర్ మోటార్ కార్-1 ఉంటాయి.

3. ఎస్ఎంవీ బెంగళూరు నుండి ఎస్ఎంవీ బెంగళూరు-సంత్రాగచ్చి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (06211) రైలు అక్టోబర్ 26న (శనివారం) ఉదయం 10.15 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు తెల్లవారు జామున 3:53 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడి నుండి 3:55 గంటలకు బయలుదేరుతుంది.‌కొత్తవలస 4:38 గంటలకు చేరుకుని, అక్కడి నుండి 4:40 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం 5:30 గంటలకు చేరుకుని, అక్కడి నుండి 5:40 గంటలకు బయలుదేరుతుంది. శ్రీకాకుళం రోడ్డులో ఉదయం 6:43 గంటలకు చేరుకుని, అక్కడి‌ నుండి 6:45 గంటలకు బయలుదేరి,‌ మరుసటి రోజు ఆదివారం రాత్రి 7:45 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది.

4. సంత్రాగచ్చి-ఎస్ఎంవీ బెంగుళూరు స్పెషల్ (06212) రైలు అక్టోబర్ 27 (ఆదివారం నాడు రాత్రి 11:30 గంటలకు సంత్రాగచ్చి నుండి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం 12:05 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుని, అక్కడి నుండి 12:07 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం 1:05 గంటలకు చేరుకుని, అక్కడి నుండి 1:15 గంటలకు బయలుదేరుతుంది. కొత్తవలస 1.45 గంటలకు చేరుకుని, అక్కడి నుండి 1.47 గంటలకు బయలుదేరుతుంది. దువ్వాడ మధ్యాహ్నం 3.10 గంటలకు చేరుకుని, అక్కడి నుండి 3.15 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరు చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు కృష్ణరాజపురం, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మాపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, కటక్, బాలాసోర్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

ఈ రెండు థర్డ్ ఏసీ క్లాస్ కోచ్-2, స్లీపర్ క్లాస్ కోచ్‌లు -3, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు-12, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగజన్ కోచ్-1, జనరేటర్ మోటార్ కార్-01 కోచ్‌లు ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కె. సందీప్ కోరారు.

రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం