Kumbhamela Trains: రాయలసీమ జిల్లాల మీదుగా మహా కుంభ మేళాకు నాలుగు స్పెషల్ రైళ్లు
Published Feb 06, 2025 10:55 AM IST
- Kumbhamela Trains: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు, యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు రాయలసీమ జిల్లాల మీదుగా స్పెషల్ రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది.
కుంభ మేళాకు ప్రత్యేక రైళ్లు
Kumbhamela Trains: మహా కుంభమేళాకు వెళ్లే యాత్రీకుల కోసం నాలుగు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. తిరుపతి నుంచి ప్రయాగ్‌రాజ్ మీదుగా బిహార్‌లోని ధనపూర్‌కు మధ్య నాలుగు మహా కుంభ స్పెషల్ రైళ్లను నడపడానికి నిర్ణయించింది.
ఈ రెండు రైళ్లు రాయలసీమ జిల్లాలలో పాటు తెలంగాణలోని వివిధ రైల్వే స్టేషన్ల మీదుగా వెళ్తాయి. ఈ ప్రాంత ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మహా కుంభమేళాకు ప్రయాణికులు, యాత్రికులు, భక్తుల అదనపు రద్దీని తగ్గించడానికి ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ తెలిపారు.
మహా కుంభ స్పెషల్ రైళ్లు
1. రైలు నెంబర్ 07117 తిరుపతి-ధనపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 14 (శుక్రవారం) తేదీన రాత్రి 11.45 గంటలకు తిరుపతి జంక్షన్ నుండి బయలుదేరుతుంది. ఈ రైలు ఫిబ్రవరి 16 (ఆదివారం) తేదీన రాత్రి 11.55 గంటలకు ధనపూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
2. రైలు నెంబర్ 07118 ధనపూర్-తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 17 (సోమవారం) తేదీన మధ్యాహ్నం 3.15 గంటలకు ధనపూర్ (బీహార్) నుండి బయలుదేరుతుంది. ఈ రైలు ఫిబ్రవరి 19 (బుధవారం) తేదీన మధ్యాహ్నం 1.45 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
ఈ స్పెషల్ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు, గద్వాల్, వనపర్తి రోడ్డు, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, ఉందానగర్, కాచిగూడ, మాల్కజ్‌గిరి, చర్లపల్లి, ఖాజీపేట స్టేషన్లలో ఆగుతుంది.
ఈ ప్రత్యేక రైళ్లలో సెకెండ్ ఏసీ కోచ్‌లు -3, థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లు -4, స్లీపర్ క్లాస్ కోచ్‌లు -8, జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్-1, జనరేటర్ మోటార్ కార్-1 ఉంటాయి.
3. రైలు నెంబర్ 07119 తిరుపతి-ధనపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 18 (మంగవారం) తేదీన రాత్రి 11.45 గంటలకు తిరుపతి జంక్షన్ నుండి బయలుదేరుతుంది. ఈ రైలు ఫిబ్రవరి 20 (గురువారం) తేదీన రాత్రి 11.55 గంటలకు ధనపూర్ (బీహార్) చేరుకుంటుంది.
4. రైలు నెంబర్ 07120 ధనపూర్-తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 21 (శుక్రవారం) తేదీన మధ్యాహ్నం 3.15 గంటలకు ధనపూర్ నుండి బయలుదేరుతుంది. ఈ రైలు ఫిబ్రవరి 23 (ఆదివారం) తేదీన మధ్యాహ్నం 1.45 గంటలకు తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది.
ఈ రెండు స్పెషల్ రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, కృష్ణ, యాద్గిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, చర్లపల్లి, ఖాజీపేట స్టేషన్లలో ఆగుతుంది.
ఈ ప్రత్యేక రైళ్లలో సెకెండ్ ఏసీ కోచ్‌లు -3, థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లు -4, స్లీపర్ క్లాస్ కోచ్‌లు -8, జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్-1, జనరేటర్ మోటార్ కార్-1 ఉంటాయి. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ తెలిపారు.