తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bapatla Suryalanka Accident: బాపట్ల జిల్లా నాగరాజు కాల్వలో నలుగురు హైదరాబాద్‌ యువకుల గల్లంతు

Bapatla suryalanka Accident: బాపట్ల జిల్లా నాగరాజు కాల్వలో నలుగురు హైదరాబాద్‌ యువకుల గల్లంతు

Sarath chandra.B HT Telugu

Published May 29, 2024 01:56 PM IST

google News
    • Bapatla suryalanka Accident: బాపట్ల జిల్లాలో జరిగిన ప్రమాదంలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. హైదరాబాద్‌కు చెందిన యువకులు సూర్యలంక బీచ్‌ వచ్చి ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయారు. 
సూర్యలంక వద్ద కొట్టుకుపోయిన హైదరాబాద్ యువకులు

సూర్యలంక వద్ద కొట్టుకుపోయిన హైదరాబాద్ యువకులు

Bapatla suryalanka Accident: బాపట్ల జిల్లాలో జరిగిన ప్రమాదంలో నలుగురు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లి నుంచి విహార యాత్ర కోసం సూర్యలంక బీచ్‌కు వచ్చిన యువకులు నాగరాజు కాల్వలో గల్లంతయ్యారు. సూర్యలంక సమీపంలోని నాగరాజు కాల్వలో ఈతకు దిగిన నలుగురు యువకులు కాలువలో గల్లంతయ్యారు.


బాపట్ల వద్ద నల్లమడ వాగులో స్నానం చేయడానికి దిగిన యువకులు నీటిలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారిని హైదరాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. యువకులు గల్లంతు కావడంతో వారి బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బాపట్ల మండలంలోని నాగరాజు కాలువ వద్ద నలుగురు యువకులు గల్లంతైన సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. గజ ఈతగాళ్లతో కాలువలో గాలింపు చేపట్టారు. గల్లంతైన వారిని హైదరాబాద్ కూకట్ పల్లి వాసులుగా గుర్తించారు.

గల్లంతైన వారు బుధవారం ఉదయం సూర్యలంక సముద్ర తీరానికి హైదరాబాద్ నుండి వచ్చినట్టు తెలిపారు. సముద్ర స్నానాలు చేసి తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో ఉన్న నాగరాజు కాలువలోకి దిగారు. ఉప్పునీటిలో దిగడంతో స్నానం చేసేందుకు సాగునీటి కాల్వలోకి దిగినట్టు చుబుతున్నారు. మొత్తం ఆరుగురు వ్యక్తులు కాల్వలోకి దిగగా నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు.

సన్నీ, సునీల్, కిరణ్, నందు అనే యువకులు గల్లంతైనట్టు ప్రమాదంలో బయటపడిన వారు తెలిపారు. గల్లంతైన వారిని కాపాడాలంటూ స్థానికుల్ని వేడుకోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పడవల సహాయంతో నాగరాజు కాలువ వెంబడి గాలింపు చేపట్టారు. సముద్రంలోకి నీరు ప్రవహించే మార్గం కావడంతో కాల్వ లోతుగా ఉంటుందని స్థానికులు తెలిపారు. కాల్వ లోతును అంచనా వేయలేక ఒరవడికి కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.

తదుపరి వ్యాసం