తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌... ఎనిమిది ప్ర‌త్యేక రైళ్లు… మీ మార్గంలో ఏవి?

రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌... ఎనిమిది ప్ర‌త్యేక రైళ్లు… మీ మార్గంలో ఏవి?

HT Telugu Desk HT Telugu

05 December 2024, 10:27 IST

google News
    • Eight Special Trains: ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్టు రైల్వే విభాగం ప్రకటించింది. ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, ఈస్ట్ కోస్ట్ రైల్వే ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే విభాగం
ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే విభాగం (HT_PRINT)

ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే విభాగం

ప్రయాణీకుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వే ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఆయా మార్గాలు ఇక్కడ చూడొచ్చు.

1. విశాఖపట్నం- చెన్నై ఎగ్మోర్ మ‌ధ్య రెండు ప్ర‌త్యేక రైళ్లు

1. విశాఖపట్నం నుండి బ‌య‌లుదేరే విశాఖపట్నం-చెన్నై ఎగ్మోర్ (08557) ప్రత్యేక రైలును డిసెంబ‌ర్ 7 నుంచి మార్చి 1 వ‌ర‌కు అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు ప్ర‌తి శ‌నివారం రాత్రి 7 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్నంలో బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉద‌యం 8.45 గంటలకు చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుంది.

2. చెన్నై నుండి బ‌య‌లుదేరే చెన్నై ఎగ్మోర్ -విశాఖపట్నం (08558) ప్రత్యేక రైలు ను డిసెంబ‌ర్ 8 నుంచి మార్చి 2 వ‌ర‌కు అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు ప్ర‌తి ఆదివారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు చెన్నై ఎగ్మోర్ నుండి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు రాత్రి 10.35గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు విశాఖ‌ప‌ట్నం-చెన్నై ఎగ్మోర్ మ‌ధ్య‌ దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు రైల్వే స్టేష‌న్‌లో ఆగుతాయి. ఈ రెండు రైళ్లకు థ‌ర్డ్‌ ఏసీ ఎకానమీ-10, స్లీపర్ క్లాస్-6, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్‌లు-1, జనరేటర్ మోటార్ కార్-1 కోచ్ ఉంటాయి.

2. విశాఖపట్నం- షాలిమార్ మ‌ధ్య రెండు ప్రత్యేక రైళ్లు

1. విశాఖపట్నం నుండి బ‌య‌లుదేరే విశాఖపట్నం– షాలిమార్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08508) రైలు డిసెంబ‌ర్ 10 నుంచి మార్చి 4 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్ర‌తి మంగ‌ళ‌వారం ఉద‌యం 11.20 గంట‌ల‌కు విశాఖ‌పట్నంలో బ‌య‌లుదేరుతుంది. మ‌రుస‌టి రోజు బుధ‌వారం తెల్ల‌వారు జామున 3 గంట‌ల‌కు షాలిమార్ చేరుకుంటుంది.

2. షాలిమార్ నుండి బ‌య‌లుదేరే షాలిమార్ - విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (08507) రైలు డిసెంబ‌ర్ 11 నుండి మార్చి 5 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్ర‌తి బుధ‌వారం ఉద‌యం 5 గంట‌ల‌కు షాలిమార్‌లో బ‌య‌లుదేరి, అదే రోజు రాత్రి 8.50 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్నం చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు విశాఖ‌ప‌ట్నం-షాలిమార్ మ‌ధ్య‌ సింహాచలం, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస రైల్వే స్టేష‌న్ల‌లో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్ల‌లో సెకెండ్ ఏసీ-1, థ‌ర్డ్ ఏసీ -3, స్లీపర్-9, జనరల్ సెకండ్ క్లాస్ -4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగజన్ కోచ్‌లు-1, మోటార్ కార్-1 ఉంటాయి.

3. సంబల్‌పూర్‌ - ఈరోడ్ మ‌ధ్య రెండు ప్రత్యేక రైలు

1. సంబల్‌పూర్ నుండి బ‌య‌లుదేరే సంబల్‌పూర్-ఈరోడ్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08311) రైలు డిసెంబ‌ర్ 11 నుంచి మార్చి 5 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సంబ‌ల్‌పూర్‌లో బుధ‌వారం ఉద‌యం 11.35 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. గురువారం రాత్రి 8.30 గంట‌ల‌కు ఈరోడ్ చేరుకుంటుంది.

2. ఈరోడ్ నుండి బ‌య‌లుదేరే ఈరోడ్ - సంబల్‌పూర్ వీక్లీ స్పెషల్ (08312) రైలు డిసెంబ‌ర్ 13 నుంచి మార్చి 7 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఈరోడ్‌లో ప్ర‌తి శుక్రవారం మ‌ధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరుతుంది. శనివారం రాత్రి 11.15 గంటలకు సంబల్‌పూర్ చేరుకుంటుంది.

ఈ రెండు ప్రత్యేక రైళ్లకు సంబ‌ల్‌పూర్‌-ఈరోడ్ మ‌ధ్య‌ పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం జంక్షన్, కొత్తవలస, దువ్వాడ, అన‌కాపల్లి, సామర్లకోట‌, రాజమండ్రి, నిడ‌ద‌వోలు, భీమ‌వ‌రం, కైక‌లూరు, గుడివాడ‌, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేష‌న్ల‌లో ఆగుతుంది. ఈ రెండు రైళ్ల‌లో సెకెండ్ ఏసీ-1, థ‌ర్డ్ ఏసీ-3, స్లీపర్ క్లాస్-9, జనరల్ సెకండ్ క్లాస్-3, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్‌లు-2 ఉన్నాయి.

4. భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ మ‌ధ్య రెండు ప్రత్యేక రైళ్లు

1. భువనేశ్వర్‌లో బయలుదేరే భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ ప్రత్యేక (02811) రైలు డిసెంబ‌ర్ 7 నుంచి ఫిబ్ర‌వరి 22 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు భువ‌నేశ్వ‌ర్‌లో ప్ర‌తి శ‌నివారం రాత్రి 7.15 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. ఈ రైలు యశ్వంతపూర్ మ‌రోస‌టి రోజు అర్థ‌రాత్రి 12.15 గంట‌ల‌కు చేరుకుంటుంది.

2. యశ్వంత్‌పూర్ నుండి బ‌య‌లుదేరే యశ్వంత్‌పూర్ -భువనేశ్వర్ ప్రత్యేక (02812) రైలు డిసెంబ‌ర్ 9 నుండి ఫిబ్ర‌వ‌రి 24 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు య‌శ్వంత్‌పూర్‌లో ప్ర‌తి సోమ‌వారం ఉద‌యం 4.30 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. మ‌రోస‌టి రోజు మ‌ధ్యాహ్నం 12.15 గంట‌ల‌కు భువ‌నేశ్వ‌ర్ చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, మార్కాపూర్ రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, ధోనే, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేష‌న్‌ల‌లో ఆగుతాయి. ఈ రెండు రైళ్ల‌కు థ‌ర్డ్‌ ఏసీ కోచ్‌లు-16, జనరేటర్ మోటార్ కార్లు-2 కోచ్‌లు ఉంటాయి.

-జ‌గదీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం