CM Jagan : వ్యవసాయ మెటార్లకు మీటర్ల గురించి రైతులకు లేఖలు రాయండి
28 July 2022, 18:26 IST
- వ్యవసాయ మెటార్లకు మీటర్లతో కలిగే ప్రయోజనాన్ని రైతులకు వివరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అన్నదాతలు లేఖలు రాయాలని తెలిపారు. వారిపై ఒక్కపైసా కూడా భారం పడదని చెప్పారు. బిల్లు అంతా ప్రభుత్వం చెల్లిస్తుందన్న విషయాన్ని రైతులకు తెలిసేలా చెప్పాలన్నారు.
సీఎం జగన్
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖపై సీఎం జగన్ సమీక్ష చేశారు. సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. థర్మల్ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్‌ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలని సీఎం జగన్ చెప్పారు. ఒప్పందాల మేరకు బొగ్గు సప్లై జరిగేలా చూడాలన్నారు. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. వ్యవసాయ మెటార్లకు మీటర్లతో రైతులకు కలిగే ప్రయోజనాలంటే చెప్పాలన్నారు. ఈ మేరకు రైతులకు అన్ని విషయాలను వివరిస్తూ.. లేఖ రాయాలని ఆదేశించారు.
'శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్‌తో 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది. ఈ విషయాన్ని రైతులకు వివరించాలి. మీటర్ల కారణంగా మోటార్లు కాలిపోవని చెప్పాలి. ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుంది. వ్యవసాయ పంపుసెట్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేయండి. ఎక్కడ ట్రాన్సాఫార్మర్ పాడైనా వెంటనే రీప్లేస్ చేయాలి. రైతుపై ఒక్కపైసాకూడా భారం పడదని లేఖలో వివరించాలి. బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్ని చెప్పాలి.' అని సీఎం జగన్ అన్నారు.
టాపిక్