తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Mega Dsc2024 Update: మారిన మెగా డిఎస్సీ షెడ్యూల్…నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే.. కొత్త తేదీల ఖరారు

AP Mega DSC2024 Update: మారిన మెగా డిఎస్సీ షెడ్యూల్…నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే.. కొత్త తేదీల ఖరారు

24 October 2024, 10:24 IST

google News
    • AP Mega DSC2024 Update: ఆంధ్రప్రదేశ్‌ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్‌ విడుదల తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే టెట్ పరీక్షలు పూర్తి కావడంతో డిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదల అవుతుందని  భావించారు. తాజాగా షెడ్యూల్‌‌లో మార్పులు  చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. 
విద్యాశాఖపై సమీక్షిస్తున్న  మంత్రి నారా లోకేష్
విద్యాశాఖపై సమీక్షిస్తున్న మంత్రి నారా లోకేష్

విద్యాశాఖపై సమీక్షిస్తున్న మంత్రి నారా లోకేష్

AP Mega DSC2024 Update: ఆంధ్రప్రదేశ్‌ మెగా డిఎస్సీ నోటిఫకేషన్‌ విడుదలలో స్వల్ప జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే టెట్‌ పరీక్షలు పూర్తి కావడంతో తొలుత నవంబర్‌ రెండో తేదీలోగా టెట్ 2024 ఫలితాలను వెల్లడించనున్నారు. టెట్ ఫలితాలు వెలువడిన వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్‌ వస్తుందని విద్యాశాఖ వర్గాలు మొదట ప్రకటించాయి. తాజాగా ఈ తేదీల్లో మార్పు ఉండొచ్చని చెబుతున్నారు. సాంకేతిక కారణాలతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ విదేశీ పర్యటన నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదలలో స్వల్ప మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను నవంబరు మొదటి వారంలోనే విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తొలుత 3వ తేదీన నోటిఫికేషన్‌ ఇవ్వాలని భావించారు. ఆ రోజు ఆదివారం కావడంతో ముఖ్యమైన నాయకులు అందుబాటులో ఉంటారో లేదోననే సందేహంతో మరో తేదీలో నోటిఫికేషన్ విడుదల చేస్తారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు.

మరోవైపు నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత న్యాయ వివాదాలు సృష్టించే అవకాశాలు ఉంటాయని భావించిన ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ వర్గాలను ఆదేశించింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్‌లోగా నియామకాలను భర్తీ చేస్తామని ప్రకటించినా టెట్‌ నిర్వహణతో పరీక్షలు, నోటిఫికేషన్ ఆలస్యమైంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మెగా డిఎస్పీలో ఎలాంటి న్యాయవివాదాలకు తావివ్వకుండా చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారుల్ని ఇప్పటికే ఆదేశించారు.

టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఇప్పటికే ఆశావహులు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగాలు మానుకుని పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఉద్యోగ ప్రకటన చేసిన ఆర్నెల్లకు మించి ఆలస్యమైతే అభ్యర్థుగా భారమవుతుందని భావించారు. దీంతో నవంబర్‌లోనే డిఎస్సీ పరీక్షల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

సిలబస్‌లో మార్పు లేదు…

డిఎస్సీ 2024 సిలబస్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే తోసిపుచ్చింది. సిలబస్ వివరాలను https://aptet.apcfss.in అందుబాటులో ఉంచామని స్పష్టత ఇచ్చారు.

పోస్టుల వివరాలు…

తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.

స్కూల్ అసిస్టెంట్ - 7,725

ఎస్‌జీటీ - 6371

టీజీటీ - 1781

పీజీటీ - 286

పీఈటీ - 132

ప్రిన్సిపల్స్ - 52

తదుపరి వ్యాసం