తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ongole Spa : పేరుకే స్పా సెంటర్.. లోపలంతా గలీజు పనులు.. గంజాయి ప్యాకెట్లు, కండోమ్‌లు!

Ongole Spa : పేరుకే స్పా సెంటర్.. లోపలంతా గలీజు పనులు.. గంజాయి ప్యాకెట్లు, కండోమ్‌లు!

30 November 2024, 15:35 IST

google News
    • Ongole Spa : అది పేరుకే స్పా సెంటర్. లోపల మసాజ్ కాకుండా.. ఇంకా వేరే గలీజు పనులు కూడా జరుగుతున్నాయి. తాజాగా పోలీసులు ఆ స్పా సెంటర్‌లో సోదాలు చేయగా.. కండోన్, గంజాయి ప్యాకెట్లు లభించాయి. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. కేసు నోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్పా సెంటర్‌లో లభించిన గంజాయి, కండోమ్‌లు
స్పా సెంటర్‌లో లభించిన గంజాయి, కండోమ్‌లు

స్పా సెంటర్‌లో లభించిన గంజాయి, కండోమ్‌లు

ఒంగోలు నగరంలోని వీ2 స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో గంజాయి ప్యాకెట్లు, కండోమ్ ప్యాకెట్లు లభ్యం అయ్యాయి. దీంతో ఈ స్పా సెంటర్ నిర్వాహకుడి పై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు పార్వతమ్మ గుడి దగ్గరలోని వీ2 స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, పక్కా సమాచారంతో రైడ్ చేసినట్టు ఒంగోలు వన్ టౌన్ పోలీసులు వెల్లడించారు.

గతంలోనూ ఈ స్పా సెంటర్ నిర్వాహకుడిపై ఫిర్యాదులు వచ్చాయి. అప్పుడు పోలీసులు పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. అయినా అతను మారలేదు. ఈ నేపథ్యంలో.. తాజా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. లోపల గలీజు పనులు జరుగుతున్నట్టు అనుమానిస్తున్నారు. గంజాయిని అమ్మడానికే తీసుకొచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

గంజాయి ఎక్కడిది..

స్పా సెంటర్‌లో గంజాయి లభించడం ఇప్పుడు ఒంగోలులో సంచలనంగా మారింది. స్పా సెంటర్ నిర్వాహకుడికి గంజాయి ఎక్కడినుంచి వచ్చింది.. అతను ఎవరికి విక్రయిస్తున్నాడనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ స్పా సెంటర్‌కు రెగ్యులర్‌గా ఎవరెవరు వెళ్తున్నారు.. వారు లోపం ఏం చేశారనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

ఈగల్ నిఘా..

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ శాఖలో కొత్త వ్యవస్థ ఏర్పాటైంది. వ్యవస్థీకృతంగా మారిన గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖలో కొత్త దళాన్ని ఏర్పాటు చేశారు. ఎలైట్ యాంటీ- నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఈగల్‌ పేరుతో కొత్త టీమ్‌ను ఏర్పాటు చేస్తూ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈగల్ బృందానికి గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఎస్పీగా, తర్వాత సుదీర్ఘ కాలం ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన ఐజీ ఆకే రవికృష్ణ సారథ్యం వహిస్తారు. ఈగల్ కోసం అమరావతిలో రెండు స్టేషన్లు, గంజాయి సమస్య తీవ్రంగా ఉన్న ఏవోబీలోని విశాఖపట్నం, పాడేరు కేంద్రాలుగా.. మరో రెండు కలిపి మొత్తం నాలుగు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు ఈగల్‌లో పనిచేస్తాయి.

మాదక ద్రవ్యాలపై ఫిర్యాదులు చేసేం టోల్ ఫ్రీ నంబర్ (1972)ను ఏర్పాటు చేశాడు ఆమరావతిలో ఏర్పాటు చేసే కాల్‌ సెంటర్ 24 గంటలూ పనిచేస్తుంది. నార్కోటిక్స్ పోలీసు, నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాల్లో మొత్తం 450 మంది సిబ్బంది పని చేయ నున్నారు. ప్రధాన కార్యాలయానికి 200 మందిని, జిల్లాల్లోని స్టేషన్ విభాగాలకు 181 పోస్టులు కేటాయించారు. పోలీసు శాఖలోని సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకొని ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఈ విభాగంలో పనిచేసే వారికి అదనపు ఇన్సెంటివ్‌లు చెల్లిస్తారు.

తదుపరి వ్యాసం