తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila Vs Ysrcp : వైసీపీ ముర్ఖత్వాన్ని మ్యూజియంలో పెట్టాలి-షర్మిల చంద్రబాబు ఏజెంట్ : ఎక్స్ లో షర్మిల వర్సెస్ వైసీపీ

YS Sharmila Vs Ysrcp : వైసీపీ ముర్ఖత్వాన్ని మ్యూజియంలో పెట్టాలి-షర్మిల చంద్రబాబు ఏజెంట్ : ఎక్స్ లో షర్మిల వర్సెస్ వైసీపీ

29 July 2024, 15:28 IST

  • YS Sharmila Vs Ysrcp : వైఎస్ జగన్ లక్ష్యంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేస్తున్నారు. షర్మిల విమర్శలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. అయితే వైసీపీ కౌంటర్ పై షర్మిల మరోసారి స్పందించారు.

వైసీపీ ముర్ఖత్వాన్ని మ్యూజియంలో పెట్టాలి-షర్మిల చంద్రబాబు ఏజెంట్ : ఎక్స్ లో వైసీపీ వర్సెస్ షర్మిల
వైసీపీ ముర్ఖత్వాన్ని మ్యూజియంలో పెట్టాలి-షర్మిల చంద్రబాబు ఏజెంట్ : ఎక్స్ లో వైసీపీ వర్సెస్ షర్మిల

వైసీపీ ముర్ఖత్వాన్ని మ్యూజియంలో పెట్టాలి-షర్మిల చంద్రబాబు ఏజెంట్ : ఎక్స్ లో వైసీపీ వర్సెస్ షర్మిల

YS Sharmila Vs Ysrcp : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైసీపీ మధ్య ట్విట్ల వార్ కొనసాగుతోంది. అసెంబ్లీకి వెళ్లనప్పుడు వైఎస్ జగన్ కు ఎమ్మెల్యే పదవి ఎందుకని షర్మిల ప్రశ్నించారు. షర్మిల చంద్రబాబు ఏజెంట్ అంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది. దీనిపై మళ్లీ స్పందించిన షర్మిల ట్విట్టర్ వేదికగా వైసీపీ ఫైర్ అయ్యారు.

మాజీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా? అని షర్మిల ప్రశ్నించారు. అయితే మీ మూర్ఖత్వాన్ని మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలంటూ వైసీపీపై ఘాటుగా స్పందించారు. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే.. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుందంటూ సెటైర్లు వేశారు. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడబడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు.

ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా?

"సోషల్ మీడియాలో నన్ను కించపర్చేంత ద్వేషం మీకు ఉంది. మాకు ద్వేషం లేదు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకు ఉంది. అది అధికార పార్టీనా.. లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు. కాబట్టే తప్పు అన్నాం. చట్ట సభను గౌరవించకపోవడం తప్పు. కాబట్టే రాజీనామా చేయమన్నాం. వైఎస్సార్ విగ్రహాలు కూల్చేస్తే నేనే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించింది నేనే. అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్సార్ కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. అసలు వైసీపీలో వైఎస్సార్, విజయమ్మను అవమానించినవారే కదా పెద్దవాళ్లు" - వైఎస్ షర్మిల

వైసీపీ నుంచి వైఎస్ఆర్ ను ఎప్పుడో వెళ్లగొట్టారు

"YSRCPలో YSRని ఎప్పుడో వెళ్లగొట్టారు కదా.. ఇప్పుడు ఉన్నది కేవలం Y -వైవీ సుబ్బారెడ్డి, S - సాయిరెడ్డి, R - రామకృష్ణారెడ్డి మాత్రమే ఉన్నారు. వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదులే.. మీకు మీడియా పాయింటే ఎక్కువ. మీరు మాట్లాడుతున్న పక్క రాష్ట్రం తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నాం. మరి మీరు రైతులను నిలువునా మోసం చేసింది నిజం కాదా ? 3 వేల కోట్లతో ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధి అన్నారు. 4 వేల కోట్లతో ప్రతి ఏడాది పంట నష్ట పరిహారం అన్నారు. ఇక వైఎస్సార్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారు. మద్యపాన నిషేధం అని దగా చేశారు. మీ కంటే మోసగాళ్లు.. విశ్వసనీయత కోల్పోయిన వాళ్లు ఉంటారా..? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువుణువునా పిరికితనం పెట్టుకున్న బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి, తాకట్టుపెట్టారు" అని షర్మిల ఘాటుగా స్పందించారు.

షర్మిలకు వైసీపీ కౌంటర్

షర్మిల వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికీ, ప్రజల తరఫున ప్రతి క్షణం ఆలోచించి వారికోసం పనిచేసేవారికీ మధ్య తేడా ఉంటుందని వైసీపీ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేసింది. షర్మిల మాటలు చూస్తే జగన్‌ మీద ద్వేషమే కనిపిస్తోంది తప్ప, ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉండి, మరో ప్రతిపక్షాన్ని తిడుతున్నారంటే… మీ అజెండా చంద్రబాబుకు మద్దతు పలకడం, జగన్‌ తిట్టడం అని స్పష్టమవుతుందంది. వైయస్ఆర్ విగ్రహాలను కాల్చేస్తుంటే.. ఎప్పుడైనా నోరు విప్పారా?

రాష్ట్రంలో టీడీపీ హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలు చేస్తుంటే కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించింది. పావురాల గుట్టలో పావురమైపోయాడని వైయస్ఆర్ మరణాన్ని అవహేళనచేసిన వారితో షర్మిల కలిసి నడవడంలేదా? తెలంగాణలో పుట్టా.. తెలంగాణలోనే ఉంటా అంటూ మాటలు చెప్పి.. అక్కడ నుంచి పారిపోయి ఇక్కడకు రాలేదా? అని ఎద్దేవా చేసింది.

"మీకన్నా.. పిరికివాళ్లు, మీకన్నా స్థిరత్వం లేనివాళ్లు, మీకన్నా.. అహంకారులు, మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా? ఇంతకీ మీరు పోస్టుచేసిన ట్వీట్‌ చంద్రబాబు దగ్గరనుంచి వచ్చిందా? లేక పక్క రాష్ట్రంలో ఉన్న ఆయన ఏజెంటు దగ్గర నుంచి వచ్చిందా?" అని వైసీపీ కౌంటర్లు వేసింది.

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్