తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ts Weather Report : తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు-పెరుగుతున్న చలి

AP TS Weather Report : తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు-పెరుగుతున్న చలి

04 November 2024, 0:56 IST

google News
  • AP TS Weather Report : తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రేపు(సోమవారం) తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయని, చలి తీవ్ర పెరుగుతోందని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు-పెరుగుతున్న చలి
తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు-పెరుగుతున్న చలి (pexels)

తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు-పెరుగుతున్న చలి

తెలుగు రాష్ట్రాల్లో రేపు(సోమవారం) తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో దక్షిణ తమినాడు, శ్రీలంక తీరాల్లో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా రేపు పలు జిల్లాల్లో తేలికపాటు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ, తెలంగాణలో మాత్రం తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో తేలికపాటి మేఘాలు, దక్షిణ రాయలసీమ, ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా చిరు జల్లులు పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రాలు తెలిపాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

నవంబర్ 04(సోమవారం) ఈ జిల్లాల్లో వర్షాలు

రేపు ఏపీలోని పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో గాలి వేగం గంటకు 15 కిలోమీటర్లుగా ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ ఉంది. కొన్ని జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి. రాత్రిళ్లు మాత్రం చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నాయి. పొగమంచు పెరుగుతోంది. చలి బారినపడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

మరో అల్పపీడనం

నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 6, 7 తేదీల్లో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. నవంబర్‌ రెండో వారంలో బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 7 నుంచి 11 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నెల 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది.

తదుపరి వ్యాసం