AP SSC Exams Schedule : ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల-మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు
11 December 2024, 20:35 IST
AP SSC Exams Schedule : ఏపీ పదో తరగతి షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
AP SSC Exams Schedule : ఏపీ పదో తరగతి షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. మంత్రి లోకేశ్ టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేశారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్
- మార్చి 17 -ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 19-సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 21- ఇంగ్లీష్
- మార్చి 24 -గణితం
- మార్చి 26- ఫిజిక్స్
- మార్చి 28 - బయోలజీ
- మార్చి 31 - సోషల్
"మార్చి 2025 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మీరు మెరుగ్గా ప్రిపేర్ అవ్వడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మేము ప్రత్యామ్నాయ రోజులలో పరీక్షలను ప్లాన్ చేశాము. ఈ అదనపు సమయాన్ని అధ్యయనం చేయడానికి, అద్భుతమైన స్కోర్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించుకోండి. నా సోదరులు, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు" - మంత్రి లోకేశ్
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా విడుదల చేశారు. మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థులకు కూడా ఇవే తేదీలలో పరీక్షలు నిర్వహిస్తారు. ఒకేషనల్ విద్యార్థుల టైమ్ టేబుల్ విడిగా విడుదల చేస్తారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్
- మార్చి 1- సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
- మార్చి 4 - ఇంగ్లీష్ పేపర్ 1
- మార్చి 6- మ్యాథ్స్ పేపర్ 1ఏ, బోటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1
- మార్చి 8 - మ్యాథ్స్ పేపర్ 1బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1
- మార్చి 11 - ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1
- మార్చి 13- కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1
- మార్చి 17 -పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్(బైపీసీ విద్యార్థుల కోసం)
- మార్చి 19 -మోడరన్ లాంగ్వేజ్ పేపర్1, జాగ్రఫీ పేపర్ 1
ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్
- మార్చి 3 -సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
- మార్చి 5 - ఇంగ్లీష్ పేపర్ 2
- మార్చి 7-మ్యాథ్స్ పేపర్ 2ఏ, బోటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2
- మార్చి 10- మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2
- మార్చి 12- ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2
- మార్చి 15 - కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2
- మార్చి 18- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2(బైపీసీ విద్యార్థుల కోసం)
- మార్చి 20 -మోడరన్ లాంగ్వేజ్ పేపర్2, జాగ్రఫీ పేపర్ 2