HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Polycet 2024 Updates : ఏపీ పాలిసెట్ సీట్ల కేటాయింపు - జూన్ 19 వరకు రిపోర్టింగ్ కు అవకాశం

AP POLYCET 2024 Updates : ఏపీ పాలిసెట్ సీట్ల కేటాయింపు - జూన్ 19 వరకు రిపోర్టింగ్ కు అవకాశం

HT Telugu Desk HT Telugu

14 June 2024, 22:01 IST

    • AP POLYCET 2024 Updates : ఏపీ పాలిసెట్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు.. జూన్ 14 నుంచి కాలేజీల్లో రిపోర్ట్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఏపీ పాలిసెట్ సీట్ల కేటాయింపు 2024
ఏపీ పాలిసెట్ సీట్ల కేటాయింపు 2024

ఏపీ పాలిసెట్ సీట్ల కేటాయింపు 2024

AP POLYCET 2024 seat allotment: రాష్ట్రంలో పాలిటెక్నిక‌ల్ సీట్ల‌ను విద్యార్థుల‌కు కేటాయించారు. అధికారిక వెబ్‌సైట్‌లో appolycet.nic.inలో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ ట్రైనింగ్ విడుద‌ల చేసింది. అభ్యర్థులు ఏపీ పాలీసెట్ -2024లో వారి ర్యాంక్, రిజ‌ర్వేష‌న్‌, వారు న‌మోదు చేసిన ఎంపిక‌లు ప్రాధాన్య‌త‌ల‌, సంబంధిత కాళాశాల్లో సీట్ల ల‌భ్య‌త ఆధారంగా సీట్లు కేటాయించారు. అలాగే జూన్ 19 నుండి రెండో ద‌శ కౌన్సింగ్ ఉంటుంది. అప్పుడు కూడా సీట్ల‌ను, కాలేజీల‌ను మార్చ‌కోవ‌చ్చు.

ట్రెండింగ్ వార్తలు

YS Sharmila On CM CBN : చంద్రబాబు గారు.... ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు, చక్కర్లు ఎందుకు కొడుతున్నారు..? వైఎస్ షర్మిల

APSRTC Arunachalam : మూడు జిల్లాల నుంచి అరుణాచ‌లం గిరి ప్రద‌క్షిణ‌కు స్పెష‌ల్ స‌ర్వీసులు, ఏపీపీఎస్ఆర్టీసీ ప్యాకేజీలివే

West Godavari News : ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లాలో అమానుష ఘటన, మద్యం మత్తులో గేదేపై అత్యాచారం-కలెక్టర్ ఆదేశాలతో కేసు నమోదు

Nara Lokesh Help : మంత్రి నారా లోకేశ్ చొరవ, స్వదేశానికి చేరుకున్న కువైట్ బాధితుడు శివ

విద్యార్థులు త‌మ‌కు కేటాయించిన సీటుకు సంబంధించిన అలాట్‌మెంట్ అర్డ‌ర్‌ను అధికారిక వెబ్‌సైట్ నుంచే పొందాలి. త‌రువాత విద్యార్థులు తుది ప్ర‌వేశానికి జూన్ 14 నుంచి జూన్ 19 లోగా కాలేజీకి వ్య‌క్తిగ‌తంగా హాజ‌రై రిపోర్టు చేయాలి. నిర్ణీత ఫీజును చెల్లించి సీటును క‌న్ఫ్మ‌మేష‌న్ చేసుకోవాలి. గ‌డువులోగా అడ్మిష‌న్ క‌న్ఫ్మ‌మేష‌న్ నిర్ధారించుకోక‌పోతే సీటు ర‌ద్దు చేస్తారు.

ఒక‌వేల సీటు కేటాయింపు సంతృప్తిక‌రంగా లేద‌నిపిస్తే, ఆ సీటును ర‌ద్దు చేసుకోవ‌చ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో ర‌ద్దు చేసుకునేందుకు తేదీలు ప్ర‌క‌టిస్తారు. దాని ఆధారంగా ద‌ర‌ఖాస్తు ఫార‌మ్‌ని యాక్సెస్ చేసి, సీటు రద్దు చేసే ట్యాబ్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సీటును స‌రెండ‌ర్ చేసే ఫార‌మ్‌ను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయాలి.

సాధార‌ణ కౌన్సిలింగ్ అయిపోయిన త‌రువాత స్పాట్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. రెగ్యుల‌ర్ కౌన్సిలింగ్ ప్ర‌క్రియ పూర్తి అయితే, మిగిలిపోయిన సీట్ల‌ను భ‌ర్తీ చేయ‌డానికి స్పాట్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తారు. అర్హ‌త గ‌ల విద్యార్థులు పాల్గొని కళాశాల‌ల్లో అందుబాటులో ఉన్న సీట్ల‌లో అడ్మిష‌న్ పొందేందుకు ఈ రౌండ్‌లో అవ‌కాశం ఉంటుంది.

3 దశల్లో వెబ్ కౌన్సెలింగ్….

వెబ్ కౌన్సెలింగ్‌ను మూడు ద‌శ‌ల్లో నిర్వ‌హించింది. కౌన్సిలింగ్ రిజిస్ట్రేష‌న్‌, స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్‌, కాలేజీ, బ్రాంచ్ ఆప్ష‌న్స్ పెట్ట‌డం వంటివి నిర్వ‌హించింది. అభ్య‌ర్థులుకౌన్సిలింగ్ రిజిస్ట్రేష‌న్‌ను మే 24 నుండి మే 31 వ‌ర‌కు చెల్లించేందుకు విద్యార్థుల‌కు అవ‌కాశం ఇచ్చింది. అర్హ‌త పొందిన అభ్య‌ర్థుల కోసం స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ మే 27 నుంచి జూన్ 6 వ‌ర‌కు నిర్వ‌హించింది. ర్యాంకుల‌ను బట్టీ రోజుకు 12 వేల నుంచి 13 వేల ర్యాంకుల అభ్య‌ర్థుల‌కు స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్ నిర్వ‌హించింది.

త‌రువాత కాలేజీ, బ్రాంచ్‌ల ప్రాధాన్య ఎంపిక‌ కోసం వెబ్ ఆప్ష‌న్ పెట్టుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్ appolycet.nic.inలో జూన్ 7 నుంచి అందుబాటులోకి తెచ్చింది. అందులోనూ ర్యాంకుల‌ను బ‌ట్టీ జూన్ 7 నుండి జూన్ 10 వ‌ర‌కు మొద‌టి ర్యాంకు నుంచి చివ‌రి ర్యాంకు వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్ పెట్టుకునేందుకు అవ‌కాశం ఇచ్చింది. అయితే జూన్ 11 తేదీన 1 ర్యాంకు నుంచి చిట్ట చివ‌రి ర్యాంకు వ‌ర‌కు అంద‌రూ త‌మ ఎంపిక‌ల‌ను మార్చుకునేందుకు అవ‌కాశం ఇచ్చింది.

ఏపీ పాలీసెట్-2024 ఏప్రిల్ 27న జ‌రిగింది. 1,59,989 మంది విద్యార్థులు పాలీసెట్‌కు అప్లై చేయ‌గా, 1,41,978 (88.74) ప‌రీక్ష‌లు రాశారు. ప్రిలిమిన‌రీ ఆన్స‌ర్ కీ మే 1న‌ విడుద‌ల అయింది. తుది అన్స‌ర్ కీ మే 5న విడుద‌ల అయింది. మే 8న ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం