తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Higher Education Council : ఉన్న‌త విద్యా మండ‌లిలో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

Higher Education Council : ఉన్న‌త విద్యా మండ‌లిలో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

HT Telugu Desk HT Telugu

13 September 2024, 17:25 IST

google News
    • Higher Education Council : ఆంధ్రప్రదేశ్ ఉన్న‌త విద్యా మండ‌లిలో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు డిప్యూటేష‌న్ ప‌ద్ధ‌తిలో భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదలైంది. దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబ‌ర్ 18న ఆఖ‌రు తేదీ అని ఉన్నత విద్యా మండలి అధికారులు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ కౌన్సిల్ ఫ‌ర్ హైయ్య‌ర్ ఎడ్యూకేష‌న్ (ఏపీఎస్‌సీహెచ్ఈ) టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అప్లై చేసేందుకు సెప్టెంబ‌ర్ 18న ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించింది. డిప్యూటేష‌న్ ప్రాతిప‌దిక‌న వివిధ డివిజ‌న్స్‌, సెల్స్‌లో ప‌ని చేసేందుకు అసోసియేట్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు (8), అసిస్టెంట్ రిజిస్ట్ర‌ర్‌, సూప‌రింటెండెంట్ (2) పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు secretary@apsche.org మెయిల్‌కు రెజ్యూమేను పంపాలని అధికారులు సూచించారు.

పోస్టులు..

అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ క్యాడ‌ర్‌లో అడ‌మిక్ ఆఫీస‌ర్ (ఇంట‌ర్నెషిప్స్ అండ్ అప్రెంటిస్‌షిప్స్‌)- 1, అడ‌మిక్ ఆఫీస‌ర్ (రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్‌)- 1, అడ‌మిక్ ఆఫీస‌ర్ (క్యాలిటీ అసురెన్సు)- 1, అడ‌మిక్ ఆఫీస‌ర్ (ఇన్ట్సిట్యూష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్‌) -1, అడ‌మిక్ ఆఫీస‌ర్ (పాల‌సీ ఎనాల‌సిస్‌) -1, అడ‌మిక్ ఆఫీస‌ర్ (ఐసీటీ అండ్ ఐయూఎంఎస్‌) -1, అడ‌మిక్ ఆఫీస‌ర్ (డిజిట‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ లెర్నింగ్ మేనేజ్‌మెంట్‌) -1, అడ‌మిక్ ఆఫీస‌ర్ (స్టాట‌స్టిక్స్ అండ్ డేటా అనాలటిక్స్‌) -1, అసిస్టెంట్ రిజిస్ట్ర‌ార్, సూప‌రింటెండెంట్ క్యాడ‌ర్‌లో అకౌంట్స్ ఆఫీస‌ర్ -1, ఆఫీస్ అడ్మినిస్ట్రేట‌ర్ -1 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

అర్హ‌త‌లు..

త‌ప్ప‌ని స‌రిగా రాష్ట్ర ప్ర‌భుత్వ యూనివ‌ర్శిటీలు, ప్ర‌భుత్వ‌ డిగ్రీ కాలేజీలు, ప్ర‌భుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో రెగ్యుల‌ర్ స‌ర్వీస్ చేస్తుండాలి. అలాగే మంచి రాత‌, ఒరాల్ క‌మ్యూనికేష‌న్‌, ఇంట‌ర్‌ ప‌ర్స‌న‌ల్ స్కిల్స్‌, కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం (ఎంఎస్ వ‌ర్డ్‌, ఎంఎస్ ఎక్స్ఎల్‌, ప‌వ‌ర్ పాయింట్ త‌దిత‌ర‌) త‌ప్ప‌నిస‌రిగా వ‌చ్చి ఉండాలి.

ఏడాది పాటు ఆన్‌డ్యూటీ డిప్యూటేష‌న్ ఉంటుంది. అవ‌స‌రం అనుకుంటే మ‌ళ్లీ ఏడాదికి పొడిగిస్తూ ఉంటారు. అర్హ‌త‌, అనుభవం బ‌ట్టీ ద‌ర‌ఖాస్తుల‌ను షార్ట్‌లిస్టు చేస్తారు. షార్ట్‌లిస్టు అభ్య‌ర్థులు ఏపీఎస్‌హెచ్ఈ ఛైర్మ‌న్ నేతృత్వంలోని ప్యానెల్ ముందు ఇంట్రాక్ష‌న్ అవ్వాల్సి ఉంటుంది. ఇంట్రాక్ష‌న్‌కు సంబంధించిన తేదీని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు. దీనికి హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల‌కు టీఏ, డీఏలు ఇవ్వ‌రు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కౌన్సిల్ ఫ‌ర్ హైయ్యార్ ఎడ్యూకేష‌న్ (ఏపీఎస్‌సీహెచ్ఈ) మంగ‌ళ‌గిరి, గుంటూరు జిల్లాలో ప‌ని చేయాల్సి ఉంటుంది.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం