తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rains Update : ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం, నెల్లూరుకి 370 కి.మీ దూరంలో- ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్

AP Rains Update : ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం, నెల్లూరుకి 370 కి.మీ దూరంలో- ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్

16 October 2024, 17:42 IST

google News
  • AP Rains Update : ఏపీ వైపీ వాయుగుండం దూసుకొస్తుంది. నెల్లూరుకి 370 దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయ్యి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం, నెల్లూరుకి 370 కి.మీ దూరంలో- ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్
ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం, నెల్లూరుకి 370 కి.మీ దూరంలో- ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్

ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం, నెల్లూరుకి 370 కి.మీ దూరంలో- ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఏపీ వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం వాయుగుండం చెన్నైకి 280 కి.మీ, పుదుచ్చేరికి 320 కి.మీ, నెల్లూరుకి 370కి.మీ దూరంలో కేంద్రీకృతం అయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా 15 కి.మీ వేగంతో వాయుగుండం కదులుతుందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్) సంభవించే అవకాశం ఉందని తెలిపింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

పెన్నా నది తీర ప్రాంత ప్రజలు బీఅలర్ట్

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పెన్నా నది పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగానికి వర్ష తీవ్రతను బట్టి విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే సహాయక చర్యల కోసం రూ.కోటి చొప్పున జిల్లాలకు అత్యవసర నిధులు చేశామన్నారు. నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెడీ ఉంచామన్నారు.

13 మండలాలపై తీవ్ర ప్రభావం

ప్రకాశం జిల్లా 4, నెల్లూరు జిల్లాలో 6, అన్నమయ్య జిల్లాలోని 3 మండలాల్లో వాయుగుండం ఎక్కువ ప్రభావం చూపుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ అన్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన 61,756 మంది మత్స్యకారులను వెనక్కి రప్పించామన్నారు.

నెల్లూరులో కుండపోత

నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు సిటీతో పాటు కావలి, అల్లూరు, బిట్రగుంట, గుడ్లూరు, లింగసముద్రం, వింజమూరు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కనియంపాడులో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. స్వర్ణముఖి నదిలో వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, సింగరాయకొండ ఇతర ప్రాంతాల్లో బుధవారం మోస్తరు వర్షం కురిసింది. సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు 360 మంది పోలీసులను, 18 బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ తెలిపారు.

తిరుపతిలో భారీ వర్షాలు

తిరుపతి జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలో భారీ వర్షం పడుతుంది. శ్రీకాళహస్తి తడ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో స్వర్ణముఖి నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని టీటీడీ తెలిపింది. శ్రీవారి పాదాలు, జాపాలి, ఆకాశగంగకు భక్తుల అనుమతిని నిలిపివేసింది. వర్షాల కారణంగా ఇవాళ తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసింది.

భారీ వర్షాల కారణంగా తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని రేపటి(గురువారం) వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

తదుపరి వ్యాసం